
మెసేజింగ్ యాప్‌లో మంచి పాపులారిటీని సంపాదించుకున్న వాట్సాప్ రోజుకో కొత్త రకం ఫీచర్లను ప్రవేశపెడుతూ యూజర్లను అలరిస్తూ ఉంది. తాజాగా ఆండ్రాయిడ్ వాట్సాప్‌కు కొత్త బీటా వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఈ బీటా వెర్షన్‌లో రికార్డు చేసిన వాయిస్ మెసేజ్‌లను లాక్ చేసుకునే వెసులుబాటు ఉంది. మెసేజ్ రికార్డు చేస్తున్న సేపు రికార్డు బటన్‌ను పట్టుకునే ఉండకుండా.. వాయిస్ మెసేజ్‌లను తేలికగా రికార్డు చేయొచ్చు. అంతేకాకుండా రికార్డు చేసిన వాయిస్ మెసేజ్‌లను డెలివరీ చేసేముందే యూజర్లు ప్లే చేసే వినే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఫీచర్ కోసం 2.18.102ను వాట్సాప్ అప్‌డేట్ చేసింది. వాయిస్ రికార్డింగ్‌లను లాక్ చేసుకునే ఫీచర్‌ను ఐఓఎస్ ఐఫోన్లకు గతేడాది నవంబర్‌లోనే తీసుకొచ్చింది. ప్రస్తుతం దీన్ని ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌కు కూడా అందుబాటులోకి తెచ్చింది.
మీ వాయిస్ మెసేజ్‌లను లాక్ చేయాలనుకుంటే, మిక్ ఐకాన్‌ను 0.5 సెకన్లు పట్టుకుని, లాక్ బటన్ వైపు మీ చేతి వేళ్లను స్లైడ్ చేయాలి. ఒక్కసారి లాక్ అయిన వాయిస్ రికార్డింగ్‌ను తేలికగా సెండ్ బటన్‌తో పంపవచ్చు. అంటే మనం ఎవరికైనా వాయిస్ మెసేజ్ లు పంపాలనుకున్నప్పుడు రికార్డు బటన్ మీద అలాగే ప్రెస్ చేసి పట్టుకోవాల్సిన పనిలేకుండా ఒకసారి రికార్డింగ్ లాక్ చేసి పెడితే.. మాట్లాడడం పూర్తయిన తర్వాత దాన్ని అన్లాక్ చేసుకునే విధంగా ఈ లాక్డ్ రికార్డింగ్ సదుపాయం ఉపయోగపడుతోంది. లాక్ రికార్డింగ్ ఫీచర్, వాయిస్ మెసేజ్‌లను పంపే ముందు వినే సౌకర్యం కోసం వాట్సాప్ బీటా యూజర్లు ఆండ్రాయిడ్ వెర్షన్ 2.18.102ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని WABetaInfo రిపోర్టు చేసింది. గూగుల్ ప్లేలో బీటా టెస్టర్ల వద్ద ఇది అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది.

Comments
Please login to add a commentAdd a comment