సాక్షి, అనంతపురం: బాటిల్ గ్రౌండ్ గేమ్ పబ్‌జీకి బానిసైన ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. దాంతో ఎడతెరిపిలేకుండా గేమ్‌లోనే మునిపోయే కిరణ్‌కుమార్‌రెడ్డి (23) తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడు. అనంతపురం రెవెన్యూ కాలనీలోని తన నివాసంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. మృతుడి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment