గేమింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పబ్‌జీ గేమ్ తిరిగి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ గేమ్ జూన్ 18న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది గేమింగ్ లవర్స్ గేమ్ ను ప్రిరిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా ప్రిరిజిస్ట్రేషన్ తర్వాత క్రాఫ్టన్ సూచనలు పాటిస్తేనే గేమ్ ఆడగాలరని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా తాజాగా పబ్జీ గేమ్‌లో లాగిన్‌లో కావాలంటే మొబైల్‌తో ఓటీపీ నిర్ధారణ తప్పనిసరని క్రాఫ్టన్ పేర్కొంది. ఓటీపీ నిర్ధారణ చేయకపోతే గేమ్‌లో లాగిన్ అవ్వలేరని తెలిపింది. ఈ ఓటీపీను కేవలం మూడుసార్లు లాగిన్ కోసం ఎంటర్ చేయవచ్చునని పేర్కొంది. తరువాత ఓటీపీ గడువు ముగుస్తుందని తెలుపగా, ఈ ఓటీపీకి కేవలం ఐదు నిమిషాలపాటు వ్యాలిడిటీ ఉండనుంది. వెరిఫికేషన్ కోడ్ కోసం 24 గంటల్లో పదిసార్లు మాత్రమే రిక్వెస్ట్ పెట్టాలి. తరువాత ఓటిపీ ఫోన్‌కు రాదు. ఒకే ఫోన్ నెంబర్‌ను ఉపయోగించి పది అకౌంట్లను క్రియేట్ చేసుకోవచ్చును.
క్రాఫ్టన్ ఓటీపీ నిర్ధారణ కోసం మొబైల్ నంబర్‌ను తీసుకొవడంతో డేటా చౌర్యం జరిగే అవకాశం ఉందని టెక్ ఎక్స్‌పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు పబ్జీలో ఫేసుబుక్, గూగుల్ అకౌంట్‌నుపయోగించి యూజర్లు లాగిన్ అయ్యేవారు.
చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్
Comments
Please login to add a commentAdd a comment