authentication process
-
ఆన్లైన్ పేమెంట్ మోసాలను అరికట్టేందుకు ముసాయిదా
ఆన్లైన్ చెల్లింపుల్లో జరిగే మోసాలను అరికట్టడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) ద్వారా జరిగే మోసాన్ని నిరోధించడానికి ఆర్బీఐ ముసాయిదాను రూపొందించింది. ఆరు నెలల పాటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించని వినియోగదారుల కేవైసీను అప్డేట్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. అలాగే పాస్వర్డ్, పిన్, సాఫ్ట్వేర్ టోకెన్లు, బయోమెట్రిక్‌లతో సహా డిజిటల్ చెల్లింపుల కోసం అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ) వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించేలా చూడాలని ప్రతిపాదించింది.కార్డు లావాదేవీలు మినహా ఇతర డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు గతంలో కొన్ని అథెంటికేషన్లను యాక్సెస్ చేసినా వాటిని నిరుపయోగంగానే వదిలేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి ఎన్ని అథెంటికేషన్లను తీసుకొచ్చినా లావాదేవీలు జరపాలంటే మాత్రం ప్రాథమికంగా ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం రూ.5,000 లోపు చేసే కార్డ్, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్లు, బీమా ప్రీమియంలు, డిజిటల్ టోల్ చెల్లింపులు, రూ.7,500 లోపు చేసే ఆఫ్‌లైన్ చెల్లింపు లావాదేవీలను ఏఎఫ్ఏ నుంచి మినహాయించారు. అంతకుమించి లావాదేవీలు జరిపితే మాత్రం అథెంటికేషన్ ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి!కస్టమర్ల వివరాలు, లావాదేవీల్లో మరింత భద్రత పాటించాలనే ఉద్దేశంతోనే ఏఈపీఎస్ ముసాయిదాను రూపొందించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఆరు నెలల నుంచి ఎలాంటి లావాదేవీలు జరపని కస్టమర్ల కేవైసీ ప్రక్రియలో ముసాయిదాలోని ఆదేశాలు పాటించాలని తెలిపింది. -
నకిలీ ఇన్వాయిస్ల కట్టడికి బయోమెట్రిక్ అథెంటికేషన్
నకిలీ ఇన్వాయిసింగ్ కేసులను అరికట్టడానికి దేశవ్యాప్తంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మోసపూరిత ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ లను ఎదుర్కోవడానికి ఆధార్ ఆథెంటికేషన్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.మోదీ ప్రభుత్వం 3.0 ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇదే కావడం గమనార్హం. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.ఆలిండియా ప్రాతిపదికన బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ అథెంటికేషన్ వ్యవస్థను దశలవారీగా అమలు చేస్తామని, ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసాలను అరికట్టడంలో సహాయపడటంతో పాటు, జీఎస్టీలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఓటీపీలకు స్వస్తి.. ఆర్బీఐ కీలక ప్రతిపాదన!
దేశంలో డిజిటల్ పేమెంట్ల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. అంతే స్థాయిలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో అడిషనల్ ఫ్యాకర్ట్ అథెంటికేషన్ అంశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎంఎస్ ఆధారిత వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ప్రామాణీకరణను తొలగించడానికి ఆర్బీఐ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఆర్బీఐ ప్రస్తుతానికి ఎటువంటి వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేయలేదు కానీ తమ వెబ్సైట్లో ఫిబ్రవరి 8న విడుదల చేసిన డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్మెంట్లో దీన్ని ప్రస్తావించింది. డిజిటల్ పేమెంట్ లావాదేవీల ప్రామాణీకత కోసం మెరుగైన విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మనం ఏదైన ఆర్థిక లావాదేవీని డిజిటల్‌గా నిర్వహించినప్పుడు ఆథెంటికేషన్ కోసం ఫిన్‌టెక్ సంస్థ లేదా బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తేనే లావాదేవీని పూర్తి చేయడానికి వీలవుతుంది. బ్యాంక్ ఖాతాల భద్రతను నిర్ధారించడానికి, చట్టవిరుద్ధంగా పొందిన ఆర్థిక డేటా దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఈ అడిషనల్ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ( AFA ) ఒక కీలక దశ. ఆర్బీఐ నిర్దిష్ట ఏఎఫ్‌ఏని నిర్దేశించనప్పటికీ చెల్లింపుల వ్యవస్థ ఎక్కువగా ఎస్ఎంఎస్-ఆధారిత వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని అనుసరిస్తోంది. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నో ప్రత్యామ్నాయ ప్రమాణీకరణ యంత్రాంగాలు వచ్చాయి. డిజిటల్ చెల్లింపు లావాదేవీల ప్రామాణీకరణ కోసం ఇటువంటి యంత్రాంగాల వినియోగాన్ని పరిశీలించాలని ఆర్బీఐ సూత్ర ప్రాయ ప్రతిపాదనలు చేసింది. ఇక ఇదే ప్రకటనలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS)కు సంబంధించిన ప్రతిపాదనలూ చేసింది. బ్యాంకులు అనుసరించాల్సిన AePS టచ్‌పాయింట్ నిర్వాహకుల కోసం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. అలాగే మోసాలను నిరోధించే చర్యలను సైతం పరిగణననలోకి తీసుకోవాలని సూచించింది. గతేడాది ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా 37 కోట్ల మంది లావాదేవీలు నిర్వహించారు. -
Aadhaar FaceRD App: ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త!
బ్యాంకు అకౌంట్ నుంచి..సెల్‌ఫోన్ సిమ్ కొనుగోలు మొదలు..చివరకు హోటళ్ళు,సినిమా హాళ్ళలో ఆధార్ కార్డ్ తప్పని సరిగా మారింది. దేనికీ ఆధార్ తప్పనిసరి కాకపోయినా, ఇతర గుర్తింపుకార్డులు అనేకమున్నా, అన్నిటికీ ఆధార్ కావాలని పట్టుబట్టడమూ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆధార్‌తో పెరిగిపోతున్న సైబర్ నేరాల్ని అడ్డుకట్ట వేసేందుకు ఆధార్ సంస్థ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ఆధార్ ఫేస్ అథంటికేషన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇటీవల దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందన్న కారణంతో ఆధార్ వివరాల్ని ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వకూడదంటూ ఆదార్ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (యూఐడీఎఐ) అప్రమత్తం చేసింది. కొన్ని సంస్థలకే ఆధార్ వివరాలు సేకరించే లైసెన్స్ ఇచ్చామనీ, లైసెన్స్ లేని సంస్థలు ఆధార్ అడిగితే (ఆధార్ నంబర్లో చివరి నాలుగంకెలు మాత్రమే కనిపించే) ‘మాస్క్డ్ ఆధార్’ను ఇవ్వాలనీ చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో యూఐడీఏఐ ఆధార్‌లో ఫేస్ అథంటికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు ఆధార్ సంస్థ ట్వీట్ చేసింది. #FaceAuthentication Residents are now using the #Aadhaar Face Authentication feature by downloading the #UIDAI #RDApp, which can be used for various #Aadhaar Authentication Apps like #JeevanPraman, #PDS, #Scholarship schemes, #COWIN, #FarmerWelfare schemes.@GoI_MeitY @ceo_uidai pic.twitter.com/c5cZNXEGOz — Aadhaar (@UIDAI) July 12, 2022 ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ వినియోగం ♦స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ముందుగా గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి అందులో ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అని సెర్చ్ చేయాలి. . ♦గూగుల్ ప్లేస్టోర్‌లో సెర్చ్ చేస్తే మీకు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేసి ఇన్స్టాల్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి ♦మీరు ఫేస్ అథంటికేషన్ పూర్తి చేసుకోవడానికి స్క్రీన్‌పై కొన్ని నిబంధనల్ని తప్పని సరిగ్గా పాటించాల్సి ఉంటుంది. అనంతరం ప్రోసీడ్‌పై క్లిక్ చేయండి. ♦ఫేస్ అథంటికేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ముందుగా మీ కెమెరా లెన్స్‌లు క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు లైటింగ్ ఉన్న చోట నిలుచోండి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ కూడా క్లియర్‌గా ఉండేలా చేసుకోండి. ఆధార్ అథంటికేషన్ ఉపయోగం ఏంటీ! కేంద్ర ప్రభుత్వ పథకాలైన జీవన్ ప్రమాణ్, పీడీఎస్, స్కాలర్షిప్ స్కీమ్స్, కోవిన్, ఫార్మర్ వెల్ఫేర్ స్కీమ్స్ వంటి వాటిల్లో అప్లయ్ చేయాలంటే కొన్ని సార్లు ఫిజికల్ ఆధార్ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇకపై అలా కాకుండా కేవలం మొబైల్లోని యాప్‌తో ఆధార్ ఫేస్ అథంటికేషన్‌తో పూర్తి చేసుకోవచ్చు.అంతేకాదు ఆధార కార్డు దారులు వారి వ్యక్తిగత డేటాను ఫేస్ అథంటికేషన్ కోసం సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోజిటరీలో స్టోర్ చేసుకోవచని యూఐడీఏఐ ట్వీట్ చేసింది. -
మీ ఫేస్బుక్ అకౌంట్ భద్రమేనా..ఇలా చేస్తే బెటర్..!
ఇంటర్నెట్ యుగంలో ఫేస్బుక్ అకౌంట్ లేని వారు చాలా అరుదు. ఇతరులతో ఫేస్బుక్ మమేకమవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. భారత్‌లో ఫేస్బుక్ అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, మనలో చాలా మంది ఫేస్బుక్లో కాలక్షేపం చేస్తూ అందులో మునిగితేలుతాము. కాగా ప్రస్తుతం హాకర్లు ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో యూజర్ల ఖాతాలనుంచి విలువైన సమాచారాన్ని పొందడానికి అనేక పద్దతులను వాడుతున్నారు. మన ఫేస్బుక్ ఖాతాలు హాకర్ల బారినుంచి తప్పించుకోవడానికి ఫేస్బుక్లో ఉండే సెట్టింగ్‌లతో హాకింగ్‌కు గురికాకుండా చూసుకోవచ్చును. మీ ఫేస్బుక్ ఖాతాను ఇలా భద్రపర్చుకోండి... స్టెప్ 1: ముందుగా మీ ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తరువాత కుడివైపు ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయండి. తరువాత సెట్టింగ్స్ అండ్ ప్రైవసీపై క్లిక్ చేయండి. స్టెప్ 2: మెను బార్ నుంచి ‘సెక్యూరిటీ అండ్ లాగిన్’పై క్లిక్ చేయండి. స్టెప్ 3: అందులో ‘వేర్ యూఆర్ లాగ్డ్ ఇన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్ మీరు ఫేస్బుక్లో లాగిన్ అయిన సెషన్లను చూపిస్తోంది. అందులో మీరు గుర్తించని లాగిన్ సెషన్లు ఏమైనా ఉంటే, త్రీ-డాట్ మెనుపై క్లిక్ చేసి, ‘లాగ్ అవుట్’ను ఎంచుకోవడం ద్వారా వెంటనే సంబంధిత సెషన్ నుండి లాగ్ అవుట్ అవ్వండి. ఒకవేళ మీరు అన్ని సెషన్ల నుంచి ఒకేసారి లాగ్అవుట్ అయ్యే అప్షన్ కూడా ఉంటుంది. స్టెప్ 4: తరువాత, ‘లాగిన్’ ఆప్షన్ కింద ఉన్న , ‘సేవ్ యూవర్ లాగిన్ ఇన్ఫర్మేషన్’ పై క్లిక్ చేయండి. ఇలా చేయడంతో మీరు లాగిన్ సమాచారం సేవ్ అవుతుంది. ఇది కేవలం మీరు మీ పర్సనల్ కంప్యూటర్ ఐతేనే ఇలా చేయాలి. స్టెప్ 5: సెట్టింగ్ మెనులో ఉన్న ‘టూ ఫ్యాక్టర్ అథనిటికేషన్( 2FA)’పై క్లిక్ చేసిన తరువాత ‘యూజ్ టూ ఫ్యాక్టర్ అథనిటికేషన్’ పై ఎడిట్ అప్షన్‌ను క్లిక్ చేయాలి. అథనిటికేటర్ యాప్‌తో లాగిన్ కోడ్‌ను జనరేట్ చేయవచ్చును. లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చును. ఈ ప్రాసెస్‌లో వచ్చిన బ్యాక్‌ఆప్ కోడ్స్‌ను మర్చిపోకూడదు. ఇలా చేయడంతో మీరు ఎక్కడైనా లాగిన్ కావాల్సిఉంటే 2FA ద్వారా లాగిన్ అవాల్సి ఉంటుంది. ముందుగా మీ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసిన తరువాత మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. లాగిన్ అయ్యే సమయంలో ఆరు అంకెల ఓటీపీ ఎంటర్ చేసిన తరువాతనే మీ అకౌంట్ మీ ముందు ప్రత్యక్షమైతుంది. స్టెప్ 6: ‘సెట్టింగ్ ఆప్ ఎక్సట్రా సెక్యూరిటీ’ అప్షన్ మీద క్లిక్ చేసి, లాగిన్ అలర్ట్ సెట్టింగ్‌ను అన్ చేయాలి. ఇది లాగిన్ అలర్ట్ ను అందిస్తోంది. ఒకవేళ మీ ఫేస్బుక్ అకౌంట్లోకి వేరే మొబైల్ నుంచి లాగిన్ అయితే వెంటనే గుర్తించి మీకు ఈ-మెయిల్ లేదా ఫేస్బుక్ మెసేంజర్‌కు మెసేజ్‌ను పంపి హెచ్చరిస్తుంది. స్టెప్ 7: చివరగా, ‘సెట్టింగ్ ఆప్ ఎక్సట్రా సెక్యూరిటీ’ ఆప్షన్లో భాగంగా ఫేస్‌బుక్‌లోని మీ ముగ్గురు నుంచి ఐదు స్నేహితులను ఎంచుకోండి. దీంతో మీరు ఎప్పుడైనా మీ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతే వారి అకౌంట్లనుపయోగించి లాగిన్ అవ్వచ్చును. చదవండి: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు కొత్త బెడద..! వారికి మాత్రం పండగే... -
PUBG: గేమ్ ఆడాలంటే ఓటీపీ తప్పనిసరి..!
గేమింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పబ్జీ గేమ్ తిరిగి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ గేమ్ జూన్ 18న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది గేమింగ్ లవర్స్ గేమ్ ను ప్రిరిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా ప్రిరిజిస్ట్రేషన్ తర్వాత క్రాఫ్టన్ సూచనలు పాటిస్తేనే గేమ్ ఆడగాలరని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా తాజాగా పబ్జీ గేమ్‌లో లాగిన్‌లో కావాలంటే మొబైల్‌తో ఓటీపీ నిర్ధారణ తప్పనిసరని క్రాఫ్టన్ పేర్కొంది. ఓటీపీ నిర్ధారణ చేయకపోతే గేమ్‌లో లాగిన్ అవ్వలేరని తెలిపింది. ఈ ఓటీపీను కేవలం మూడుసార్లు లాగిన్ కోసం ఎంటర్ చేయవచ్చునని పేర్కొంది. తరువాత ఓటీపీ గడువు ముగుస్తుందని తెలుపగా, ఈ ఓటీపీకి కేవలం ఐదు నిమిషాలపాటు వ్యాలిడిటీ ఉండనుంది. వెరిఫికేషన్ కోడ్ కోసం 24 గంటల్లో పదిసార్లు మాత్రమే రిక్వెస్ట్ పెట్టాలి. తరువాత ఓటిపీ ఫోన్‌కు రాదు. ఒకే ఫోన్ నెంబర్‌ను ఉపయోగించి పది అకౌంట్లను క్రియేట్ చేసుకోవచ్చును. క్రాఫ్టన్ ఓటీపీ నిర్ధారణ కోసం మొబైల్ నంబర్‌ను తీసుకొవడంతో డేటా చౌర్యం జరిగే అవకాశం ఉందని టెక్ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు పబ్జీలో ఫేసుబుక్, గూగుల్ అకౌంట్నుపయోగించి యూజర్లు లాగిన్ అయ్యేవారు. చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్ -
వేలిముద్రకు రూ.150
కార్తీక్ మేడ్చల్ సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉపకార వేతనం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద దరఖాస్తు చేశాక.. ఆధార్ ఆధారిత వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో సమీపంలోని మీసేవ కేంద్రంలో సంప్రదించి వేలిముద్రలు సమర్పించాడు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రూ.20కి రశీదు చేతిలో పెట్టిన మీసేవ నిర్వాహకుడు రూ.150 ఇవ్వాలని స్పష్టం చేశాడు. గతేడాది ఇదే మీసేవ కేంద్రంలో రూ.50 ఇచ్చానని కార్తీక్ చెప్పినా లాభం లేకపోయింది. కోవిడ్-19 తర్వాత ఇదే రేటు అని చెప్పడంతో చేసేదేమీ లేక రూ.150 చెల్లించుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో అక్రమాలను అరికట్టడానికి ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానాన్ని మీసేవ కేంద్రం నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు సమర్పించిన తర్వాత వాటిని ఆన్లైన్లో ఆమోదించాలంటే సదరు విద్యార్థి వేలిముద్రలను దరఖాస్తుతో అప్లోడ్ చేయాలి. ఎక్కడినుంచైనా ఆన్లైన్ దరఖాస్తును సమర్పించే అవకాశం ఉన్నప్పటికీ... వేలిముద్రలు అప్లోడ్ చేసే ఆప్షన్ మీసేవ కేంద్రాలకు ప్రభుత్వం ఇచ్చింది. దీనికి రూ.20 రుసుముగా నిర్ణయించింది. అయితే పలు మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మొత్తానికంటే కొన్నిరెట్లు అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. రూ.10 కోట్లు దాటుతున్న వసూళ్లు! రాష్ట్రంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి ప్రతి సంవత్సరం సగటున 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 20 చొప్పున బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీజు రూపంలో సర్కారు ఖజానాకు రూ. 2.6 కోట్లు జమవుతోంది. కానీ చాలాచోట్ల మీసేవ కేంద్రాల నిర్వాహకులు రూ.50 నుంచి రూ.200 వరకు దండుకుంటున్నారు. సగటున రూ. 100 చార్జ్జ్ చేస్తున్నారనుకుంటే... ఈ లెక్కన ఏటా రూ.10 కోట్లకు పైగా విద్యార్థుల నుంచి దోచుకుంటున్నారు. కౌంటర్లు పెట్టి మరీ దోపిడీ మీసేవ కేంద్రాల నిర్వాహకులతో కొన్ని కాలేజీ యాజమాన్యాలు కుమ్మక్కై కాలేజీలోనే బయో మెట్రిక్ అప్డేషన్ కానిచ్చేస్తున్నారు. మీసేవ కేంద్రం నిర్వాహకుడు కంప్యూటర్‌తో కాలేజీలోనే ఒకచోట సెటప్ ఏర్పాటు చేసి అక్కడే వేలిముద్రలు అప్డేట్ చేస్తున్నారు. అలా కాలేజీలోనే దుకాణం తెరిచి ఒ క్కో విద్యార్థికి రూ.200 చార్జ్ చేస్తున్నారు. ఇందులో కాలేజీ సిబ్బందికి సైతం వాటాలందుతున్నాయి. వేలిముద్రల స్వీకరణ ప్రక్రియను ఉచితంగా నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. మీసేవ కేంద్రాలకు ఆప్షన్ ఇచ్చే బదులుగా కాలేజీల్లోనే ప్రత్యేకంగా ఈ సెటప్ ఏర్పాటు చేయాలని, యాజమాన్యాలు సైతం బాధ్యతగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తే దోపిడీకి ఆస్కారం ఉండదని విద్యార్థులు అంటున్నారు. అయితే మీసేవ కేంద్రాల్లో వసూళ్లపై ఇప్పటివరకు ఫిర్యాదులు రాలేదని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. కాలేజీలోనే వేలిముద్రలిచ్చే ఆప్షన్ ఉండాలి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన బయోమెట్రిక్ విధానం మీసేవ కేంద్రంలో కాకుండా కాలేజీలోనే సమర్పించేలా ఆప్షన్ ఉండాలి. ట్యూషన్ ఫీజుతో పాటు ఇతరత్రా ఫీజులు తీసుకుంటున్నందున... ఉచితంగా వేలిముద్రలను అప్డేట్ చేసే బాధ్యతను కాలేజీ యాజమాన్యాలకే అప్పగించాలి. దీంతో విద్యార్థులకు ఉపశమనం కలుగుతుంది. కాలేజీ క్లాసులు ఎగ్గొట్టి... మీసేవ కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇచ్చే బాధ తప్పుతుంది. - సాత్విక్, బీటెక్ ఫైనలియర్, శంషాబాద్ -
వాయిస్ గుర్తింపుతో మొబైల్ బ్యాంకింగ్
మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారా..? అయితే ఆ ప్రక్రియ మరింత సులభతరం కానుందట. ఎవరైతే తరుచూ మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారో, వారి ధృవీకరణను వేగవంతంగా చేపట్టడానికి వాయిస్ గుర్తింపు ప్రక్రియను ప్రైవేట్ బ్యాంకులు ఆవిష్కరిస్తున్నాయి. కార్డును యూజర్లు కోల్పోయినప్పుడు, లేదా కార్డు దొంగతనం జరిగినప్పుడు వినియోగదారులకు అత్యవసర వినియోగం కోసం ఈ ప్రక్రియను ప్రైవేట్ బ్యాంకులు ప్రారంభిస్తున్నాయి. ఐసీఐసీఐ, కొటక్ మహింద్రా బ్యాంకు, మరికొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించేశాయి. కస్టమర్ ధృవీకరణ సులభతరం కోసం, ఐసీఐసీఐ బ్యాంకు ఇప్పటికే ఈ సౌకర్యాన్ని 3 మిలియన్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది మరో మిలియన్ వినియోగదారులకు ఈ ప్రక్రియను ఆవిష్కరించాలని బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. అకౌంట్ నెంబర్ లేదా కార్డు నెంబర్ టైపు చేయడం, అనంతరం టీ-పిన్, డేట్ ఆఫ్ బర్త్, డెబిట్ కార్డు సీవీవీ నెంబర్ ఇలా నమోదుచేసే ప్రక్రియంతా కొంత గందరగోళానికి దోహదం చేసే అవకాశం ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సభర్వాల్ తెలిపారు. ఫింగర్ ఫ్రింట్ ధృవీకరణ కంటే వ్యక్తి స్వరం మరింత యూనిక్ గా ఉంటుందని పేర్కొన్నారు. వాయిస్ ధృవీకరణతో మొబైల్ బ్యాంకింగ్ ప్రక్రియ మరింత సులభతరమవుతుందని సభర్వాల్ చెప్పారు. మరోవైపు కొటక్ మహింద్రా బ్యాంకు సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక భాషలో ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది. అయితే వాయిస్ ధృవీకరణ ఒక్కటే పూర్తి మొబైల్ బ్యాంకింగ్ ప్రక్రియలకు పూర్తి రక్షణ కల్పించదని డేటా సెక్యురిటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.