చైనాతో జరిగిన ఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం భద్రత కారణాల రీత్యా గతంలో 118 యాప్స్ ని నిషేదించింది. ఆ నిషేదించిన జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా బాగా పేరు పొందిన ‘పబ్ జి గేమ్’ కూడా ఉంది. పబ్ జి గేమ్ ని భారత్ లో నిషేధించడంతో ఆ ప్రభావం కంపెనీపై బాగానే పడింది. నిషేధంతో ఒక్క సారిగా గేమ్ డౌన్ లోడ్ సంఖ్య తగ్గిపోయింది. అందుకే కంపెనీ తిరిగి భారత్ లోకి రావాలని ప్రయత్నిస్తుంది. ఇందుకోసం స్థానిక కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో పాటు ఇండియాలోనే యూజర్ల డేటాని నిల్వచేయడానికి మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం చేసుకుంది. కొద్దీ రోజుల క్రితం భారత వినియోగదారుల కోసం "పబ్ జి మొబైల్ ఇండియా" పేరుతొ కొత్త యాప్ ని కూడా తీసుకువచ్చింది. ఇప్పటికే దీనికి సంబందించిన టీజర్ ని కూడా విడుదల చేసింది. పబ్‌జీ మొబైల్ గేమ్‌ని అధికారికంగా ప్రారంభించటానికి ముందు పబ్‌జీ కార్పొరేషన్ తన ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. (చదవండి: పేటీఎం యూజర్లకు శుభవార్త)
భారత్ లో పబ్ జీ గేమ్ ఎప్పుడు విడుదల అవుతుందా అని పబ్ జీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పబ్ జీ ప్రియుల సుదీర్ఘ నిరీక్షణ తొందరలోనే ముగియనుంది. భారతదేశంలో ఈ గేమ్ ని అధికారికంగా ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. "పబ్ జి మొబైల్ ఇండియా" పేరుతో రిజిస్టర్ చేయబడిన పబ్ జి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో కంపెనీకి ఆటంకాలు అన్ని తొలిగిపోయాయి. తాజా సమాచారం ప్రకారం "పబ్ జి మొబైల్ ఇండియా"ను డిసెంబర్ మొదటి వారంలో గ్రాండ్ గా విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తరువాత, చివరకు ఆటగాళ్లకు శుభవార్త లభించింది.
Comments
Please login to add a commentAdd a comment