
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ) అందరికీ అందుబాటులో వచ్చిన విషయం తెలిసిందే. బీజీఎంఐను రూపొందించిన క్రాఫ్టన్ సంస్థ తొలిసారిగా లాంచ్ పార్టీని జరపనుంది. జూలై 8 నుంచి జూలై 9 వరకు లాంచ్ పార్టీ జరగనుంది. లాంచ్ పార్టీకి సంబంధించిన టీజర్‌ను క్రాఫ్టన్ యూట్యూబ్‌లో షేర్ చేసింది. రెండురోజులపాటు సాగే ఈ వెంట్‌లో 18 ప్రో టీమ్స్ ఆడనున్నాయి.
ఈ వెంట్‌లో గెలిచిన విజేతలకు రూ. 6 లక్షల రూపాయల నగదు బహుమతిని అందిచనున్నారు. ఈ లాంచ్ పార్టీలో ప్రసిద్ది చెందిన డైనమో, మోర్టల్, కె 18, క్రోంటెన్, గాడ్నిక్సన్, ఘటక్, శ్రీమాన్ లెజెండ్, మాక్స్టర్న్, బండూక్‌బాజ్, క్లాష్ యూనివర్స్, పాల్గొననున్నారు. ఈ మ్యాచ్‌లను మొబైల్ ఇండియా అధికారిక ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం చేయనున్నారు.