‘ముస్లింల ఆగ్రహానికి పబ్‌జీ కారణమవుతోంది’ | Tamil Nadu Muslim League Demands Ban on PUBG | Sakshi
Sakshi News home page

పబ్‌జీని నిషేధించండి: ముస్లీంలీగ్‌

Published Wed, Jun 5 2019 1:16 PM | Last Updated on Wed, Jun 5 2019 1:25 PM

Tamil Nadu Muslim League Demands Ban on PUBG - Sakshi

సాక్షి, చెన్నై: ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ పబ్‌జీపై నిషేధం విధించాలని తమిళనాడు ముస్లిం లీగ్ (టీఎన్ఎంఎల్) డిమాండ్ చేసింది. ఈ గేమ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపించింది. ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం టీఎన్ఎంఎల్ ఫిర్యాదు చేసింది. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల ఆగ్రహానికి ఈ గేమ్ కారణమవుతోంది. విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమైన ‘బ్లూ వేల్ చాలెంజ్’ గేమ్ మాదిరిగానే... ఇది కూడా పవిత్ర స్థలం ‘కాబా’ను పోలిన ఓ చిత్రాన్ని చెడుగా చూపిస్తూ ఆగ్రహానికి గురిచేస్తోంది...’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ముస్లింలంతా ఈ గేమ్‌ను తమ మొబైల్‌లో డిలీట్ చేస్తూ ‘‘బాయ్‌కాట్ పబ్‌జీ’’ పేరుతో ప్రచారం చేపట్టాలని టీఎన్ఎంఎల్ పిలుపునిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement