పబ్​జీ ఆట.. యాంటీ ఇస్లాం అట..!! | Pakistan bans pubg citing it as anti islam material | Sakshi
Sakshi News home page

పబ్​జీ ఆట.. యాంటీ ఇస్లాం అట..!!

Published Fri, Jul 17 2020 10:56 AM | Last Updated on Fri, Jul 17 2020 11:53 AM

Pakistan bans pubg citing it as anti islam material - Sakshi

ఇస్లామాబాద్: ప్లేయర్ అన్​నౌన్ బ్యాటిల్​గ్రౌండ్స్​(పబ్​జీ) వీడియో గేమ్​ను ‘యాంటీ ఇస్లాం’గా పేర్కొంటూ పాకిస్తాన్ నిషేధం విధించింది. పబ్​జీ వల్ల యువకుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని, ఎంతో విలువైన సమయమూ వృథా అవుతోందని ఇమ్రాన్​ ఖాన్​ సర్కారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీన్ని పాకిస్తానీ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సింధ్​–పంజాబ్​ సరిహద్దు వద్ద ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ ధర్నాలు చేయడానికి సిద్ధపడుతోంది. (వణికిన ట్విట్టర్)

పబ్​జీ నిషేధాన్ని సవాలు చేస్తూ ఇస్లామాబాద్​ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్​ దాఖలైంది. పబ్​జీలో యాంటీ ఇస్లాం మెటీరియల్​తో పాటు శృంగారపరమైన దృశ్యాలున్నాయని, అందుకే గేమ్​ను బ్యాన్​ చేశామని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) కోర్టుకు నివేదించింది. పబ్​జీ బ్యాన్​కు ముందు గేమ్​ మిషన్​లో ఫెయిలైనందుకు ఒత్తడిని తట్టుకోలేక కొందరు యువత బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని సైతం పీటీఏ ప్రస్తావించింది. (7.3 తీవత్రతో భూకంపం, సునామీ హెచ్చరిక)

పాకిస్తాన్ వీడియో గేమ్స్​ను నిషేధించడం ఇది నాలుగోసారి. గతంలో పాకిస్తాన్​లో టెర్రరిస్టులు తలదాచుకున్నారని, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్​ఐ వారికి మద్దతునిస్తోందని చూపించినందుకు కాల్​ ఆఫ్ డ్యూటీ, మెడల్​ ఆఫ్ హానర్ గేమ్స్​ను బ్యాన్ చేసింది. 2017లో సెక్సువల్​ కంటెంట్​ ఉన్న వాల్కైరీ డ్రైవ్​: భిక్కూని అనే గేమ్​ను సైతం నిషేధించింది.

బ్యాన్​ వల్ల ఏం వస్తుంది?
పబ్​జీ బ్యాన్​ వల్ల ఇప్పటికే దానికి బానిసలైన యువత తట్టుకోలేక అఘాయిత్యాలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉంది. మెంటల్​ హెల్త్​కు సంబంధించి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, డైరెక్టు బ్యాన్​ వల్ల పాకిస్తాన్ మరింత నష్టపోతుంది. 2005లో కైట్​ ఫెస్టివల్​ను బ్యాన్​ చేసిన సమయంలోనూ ఇలానే జరిగింది. గాలిపటాలను ఎగురేసే దారం వల్ల నష్టం కలుగుతోందని భావించిన పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఫెస్టివల్​ను నిషేధించింది. దాంతో చాలా మంది ఉసురు తీసుకున్నారు.

ఇప్పటికే పబ్​జీపై నిషేధం ఎత్తేయాలంటూ యువత రోడ్లు ఎక్కింది. ప్లకార్డులతో నిరసన తెలుపుతోంది. పబ్​జీకి కొందరు బానిసలైతే, ఇంకొందరికి అదో ఎంటర్​టైన్​మెంట్. గడచిన నాలుగు నెలల లాక్​డౌన్​లో చాలా మందికి ఇదే టైం పాస్. అందుకే ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు పాకిస్తాన్​ పబ్​జీ ప్రియులు ట్విట్టర్​​, ఫేస్​బుక్​ తదితర సోషల్​మీడియా వేదికల్లో చిన్నపాటి ఉద్యమాలు రన్ చేస్తున్నారు. పబ్​జీ మొబైల్​ వరల్డ్​ 2020 టోర్నమెంటులో పాకిస్తాన్​ టీమ్ ‘ఫ్రీ స్టైల్​’పోటీ చేయాలని భావించింది. కానీ గేమ్​ను నిషేధిస్తూ సర్కారు ఉత్తర్వులు దానికి శరాఘాతంగా మారాయి.

మరి టిక్​టాక్​ సంగతేంటి?
పబ్​జీని యాంటీ ఇస్లాంగా చూస్తున్న పాకిస్తాన్​కి టిక్​టాక్ అలా​ కనిపించడం లేదు. దానిలో శృంగార సంబంధిత కంటెంట్​ వస్తున్నా పట్టడం లేదు. ఈ మేరకు ఇస్లామాబాద్​ హైకోర్టులో టిక్​టాక్​ను నిషేధించాలంటూ పిటిషన్​ కూడా దాఖలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement