
హైదరాబాద్: పబ్జీ గేమ్‌తో మైనర్ బాలికకు వల వేసిన ఓ యువకుడి ఉదంతం హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పబ్జీ గేమ్ ఆడుతూ.. ఓ మైనర్ బాలిక వాట్సాప్ నెంబర్ తీసుకొని ఓ యువకుడు వేధిస్తున్నాడు. నాంపల్లికి చెందిన సల్మాన్ ఖాన్ అనే యువకుడు సదరు బాలికకు పబ్జీ గేమ్‌లో పరిచయమయ్యాడు. అతడు కాస్తా అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నెంబర్ తీసుకున్నప్పటి నుంచి అమ్మాయితో చాటింగ్ చేసిన యువకుడు.. అమ్మాయి పర్సనల్ ఫోటోలు సంపాదించాడు.
చదవండి: 'మూఢనమ్మకానికి 12 మందికి జీవిత ఖైదు'
ఆ ఫోటోలతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడతానని వేదించడం మొదలు పెట్టాడు. తనతో శారీరకంగా గడపాలని లేదంటే ఫోటోలు బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు. దీంతో, భయపడిన బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు ఈ విషయమై సదరు యువకుడిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమ్మాయిని వేధించిన యువకుడిని అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. అతని కాల్‌డేటా ఆధారంగా ఇలా ఎంత మంది అమ్మాయిలను వేధించాడో పోలీసులు కూపీ లాగుతున్నారు.
చదవండి: పెళ్లి చేసుకుంటామన్న మైనర్లు.. 4 నెలలు ఆగాలన్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment