ఏంతో కాలంగా ఎదురుచూస్తున్నా 'ఫౌజీ' గేమ్ గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉందని నవంబర్ 30న ఎన్‌కోర్ గేమ్స్ ప్రకటించింది. ఈ గేమ్ మొదటి 24 గంటల్లో భారతదేశంలోని ప్లే స్టోర్‌లో అత్యధిక సంఖ్యలో ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఫస్ట్ పర్సన్ షూటర్(ఎఫ్‌పిఎస్) గేమ్ కోసం 1.06 మిలియన్ల ప్రీ-రిజిస్ట్రేషన్లను చేసుకున్నారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని డెవలపర్లు ట్వీట్‌లో తెలిపారు. 'ఫౌజీ' గేమ్ నవంబర్‌లో ప్రారంభించాల్సి ఉంది, కానీ ఇతర కారణాల రీత్యా ఆలస్యం అయింది. (చదవండి: 11వేలలో 5జీ ఫోన్)
దసరా పండుగ సందర్బంగా ఈ గేమ్ యొక్క ట్రైలర్ ని విడుదల చేసింది. ‘ఈ రోజు మనం చెడుపై మంచి గెలుపుున సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భయంలేని, ఐక్యతా గార్డులు 'ఫౌజీ' గురించి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకు మించి మంచి రోజు ఏముంటుంది. దసరా పర్వదినం రోజు 'ఫౌజీ' టీజర్‌ను ప్రజెంట్ చేస్తున్నాం.’ అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో గాల్వన్ వ్యాలీకి సంబందించిన సన్నివేశాలు ఉన్నాయి. సరిహద్దు భద్రతకు బాధ్యత వహిస్తున్న భారత సైనికులకు ఈ ఆట నివాళి అని ఎన్‌కోర్ గేమ్స్ తెలిపింది. పబ్జి గేమ్ ని భారత్ లో నిషేదించిన తర్వాత 'ఫౌజీ' గేమ్ ని తీసుకొచ్చారు. 'ఫౌజీ' గేమ్, పబ్జికి పోటీ కాదని ఎన్‌కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment