FAU-G
-
రివ్యూ: ఫౌజీ గేమ్ ఎలా ఉందంటే?
సాధారణంగా ఏదైనా కొత్త గేమ్ ని ఇండియాలో లాంచ్ చేస్తున్నారంటే పెద్దగా పట్టించుకోరు. కానీ, ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రజాదరణ పొందిన 'పబ్జీ’కీ పోటీగా ఓ గేమ్ తీసుకొస్తున్నారంటూ ప్రచారం జరిగిన ఆ గేమ్ విడుదల పెద్ద విషయమనే చెప్పాలి. పబ్జీ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించాక చాలా మంది గేమ్ లవర్స్ నిరుత్సాహ పడిపోయారు. సరైన మల్టీప్లేయిర్ ప్లేయర్ యాక్షన్ గేమ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసారు. సరిగ్గా అదే సమయంలో భారత సైనికుల వీరోచిత పోరాటాలు ప్రతిబింబించేలా ఓ గేమ్‌ను రూపొందిస్తున్నామని బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ ప్రకటించింది.(చదవండి: మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?) అదే ఇండియన్ పబ్జీగా పిలువబడే "ఫౌజీ" గేమ్. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నేతృత్వంలో రూపొందిన ఈ గేమ్ గణతంత్ర దినోత్సవ కానుకగా నేడు అందరికి అందుబాటులోకి వచ్చింది. మరి గేమ్ ఎలా ఉంది? పబ్జీకి పోటీ ఇచ్చే స్థాయిలో రూపొందించారో లేదో తెలుసుకుందామా... అందరికంటే ముందుగా ఫ్రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారుల మొబైల్ లలో ఆటోమేటిక్ గేమ్ డౌన్లోడ్ అయింది. ఈ గేమ్ ను సుమారు 500ఎంబీ సైజ్‌లో తీసుకొచ్చారు. ఫౌజీ గేమ్ ని ఓపెన్ చేసాక మొదటి దశలో మూడు రకాల మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. క్యాంపెయిన్, టీమ్ డెత్ మ్యాచ్, ఫ్రీ ఫర్ ఆల్ అనే మూడు మోడ్స్ కనిపిస్తాయి. ప్రస్తుతం క్యాంపెయిన్ మోడ్ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత దశలో అప్డేట్స్ రూపంలో మిగిలిన మోడ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాఫిక్ సెట్టింగ్స్ మీడియంలో ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి అల్ట్రా వరకు పెంచుకోవచ్చు. ప్రస్తుతం పబ్జీ గేమ్ లో లాగా మల్టీ ప్లేయర్ కి సపోర్ట్ చేయకపోయిన తర్వాత దశలో మల్టీ ప్లేయర్ సపోర్ట్ తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)తో ఆధారంగా పనిచేస్తుంది. చేతులే ఆయుధాలు అయితే ఈ గేమ్ లో చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ అవి పట్టించుకునేంత కావు. ఉదా: మీరు ఒక గుడారంలో ఉంటే మీరు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్న ఆటగాళ్లను కొట్టవచ్చు. అలాగే ప్రారంభ దశలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఆటగాళ్ళు ఒక్కోసారి మిమ్మల్ని కొట్టడం లేదు. ఇందులో పబ్జీలో లాగా గన్స్ అందుబాటులో లేవు, కేవలం కత్తులు మాత్రమే ఉంటున్నాయి. ఇవి కూడా కొన్ని స్టేజిలు దాటాక మీకు లభిస్తాయి. అప్పటి వరకు మీ శతృవులను మీ చేతితో యుద్ధం చేయాల్సి ఉంటుంది.(చదవండి: గాల్వాన్ వీరుడికి పరమవీర చక్ర ఇస్తే బాగుండేది!) ఇందులో ప్రధాన పాత్రలో ఒక సిక్కు సైన్య అధికారి ఉంటాడు. అయితే తను మిగతా తన తోటి సిబ్బందిని చైనా సైన్యం నుండి రక్షించుకోవాలి. గేమ్ లో ముందుకు వెళ్తున్నపుడు ఎనర్జీని పెంచుకోవడానికి పబ్జీలో లాగా డ్రింక్స్ ఏమి ఉండవు. కేవలం మనం భోగి మంటల దగ్గర కూర్చొని ఉంటే హెల్త్ పెరుగుతుంది. ఒక్కోసారి గేమ్ లో హెల్త్ అయిపోయిన దీని సహాయంతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం గేమ్ లో చేతితో పోరాడే ఆయుధాలు కత్తి లాంటివి మాత్రమే ఉన్నాయి. ఇందులో మీరు ఆశించినట్టు తుపాకులు లేవు. తర్వాత మోడ్ లో తీసుకొస్తారేమో చూడాలి. ఈ కత్తి లాంటి ఆయుధంతో శత్రువులను చంపడం చాలా తేలిక అవుతుంది. వాటిని కూడా మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే అవి రెండు హత్యలకు మాత్రమే పరిమితం చేయబడతాయి. సినిమాటిక్ లుక్స్ ఇందులో నాలుగు దశలు ఉంటాయి. ఏ దశలో ఎంతవరకు వచ్చామనేది పైన బార్లో చూపిస్తుంటుంది. ఇందులో పాస్ ఆప్షన్ ఉండటం చేత రియల్ గేమ్ అనుభూతిని మనం మిస్ అవుతాం. అలాగే శత్రువులను కొట్టేటప్పుడు వారి చనిపోయేరో లేదో తెలిపే సూచికలు లేవు. అందువల్ల కొన్నిసార్లు మీరు వారు చనిపోయాక కొట్టాల్సి వస్తుంది. ప్రధానంగా గేమ్ ను సినిమాటిక్ లుక్స్ లో, ఇటీవలి గాల్వన్ సరిహద్దు సంఘటన ఆధారంగా రూపొందించారు. ఇందులో క్రమంగా చెక్‌పోస్టులను దాటేటప్పుడు మరింత కష్టమైంది అని చెప్పుకోవాలి. ఇందులో గేమర్స్ వారికీ ఇచ్చిన సమయంలో అన్ని దశలను పూర్తి చేయడం అంటే కష్ట్టమే అని చెప్పుకోవాలి. ఆట నిజంగా చాలా కష్టంగానే ఉంది. నేను, నా సహోద్యోగులు ఎవరూ కూడా ప్రస్తుతం అన్ని దశలను పూర్తీ చేయలేకపోయాము.(చదవండి: ఎలోన్ మస్క్ 'స్పేస్ఎక్స్' సరికొత్త రికార్డ్!) ఆట మీద నా అభిప్రాయం ఈ గేమ్ ని ప్రధానంగా చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినట్లు మనకు భాగా తెలిసిపోతుంది. ఇందులో కేవలం పిడిగుద్దులు, కత్తులు తప్ప గన్స్ ఉండవు. అందుకే గేమ్ ఎక్కువ శాతం ఆసక్తిగా అనిపించదు. పబ్జీకి పోటీ అంటూ ప్రచారం జరిగింది కాబట్టి.. దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాంపెయిన్ మోడ్‌తో ఈ గేమ్ పబ్జీ ప్రేమికుల అంచనాలను అందుకోలేదు. మిగిలిన రెండు మోడ్స్ లో పబ్జీలో లాగా మల్టి ప్లేయర్ సపోర్ట్ తీసుకొస్తే తప్ప ఏమైనా మార్పు ఉండొచ్చు. సాధారణ సమయాలలో చిన్న పిల్లలతో ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. ‘గల్వాన్’ ఘటన గురించి, ఆ సందర్భంలో మన సైనికుల వీరోచిత పోరాటం గురించి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. -
ఇండియన్ పబ్జీ(ఫౌజీ) విడుదల రేపే!
న్యూఢిల్లీ: గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్వదేశీ ఆన్లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ "ఫౌజీ"ని 72వ గణతంత్రదినోత్సవ కానుకగా రేపు(జనవరి 26) విడుదల కాబోతోంది. ఈ స్వదేశీ గేమ్ ఇప్పటివరకు 4 మిలియన్లకు పైగా ప్రీ-రిజిస్ట్రేషన్లతో తన సత్తా చాటినట్లు ఎన్కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ పేర్కొన్నారు. ఈ గేమ్ ని అందరికంటే ముందే డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫౌజీ మొబైల్ గేమ్ జనవరి 26న ప్రారంభించిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ లేదా అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.(చదవండి: డిజిటల్ ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!) ఈ గేమ్ ని ప్రారంభించిన తర్వాత ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంపై ఎన్కోర్ గేమ్స్ తెలపలేదు. ఈ గేమ్ మొదట ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఐఫోన్లు, ఐప్యాడ్లకు అందుబాటులో రానున్నట్లు సమాచారం. పబ్జీపై నిషేధం విధించిన కొద్ది నెలల తర్వాత ఫౌజీ గేమ్ తీసుకొస్తున్నట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రకటించారు. ఆయనే ఈ గేమ్‌కి మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. అలానే ఫౌజీని బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ అనే గేమింగ్ సంస్థ రూపొందించింది. ఫౌజీ, పబ్జీ రెండు వేర్వేరు ఫౌజీ ఒక మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్. చాలా మంది భారతీయ గేమర్స్ దీనిని పబ్జీ మొబైల్ కి ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు, ప్రస్తుతం భారతదేశంలో నిషేధించబడిన పబ్జీ మొబైల్‌తో పోల్చినప్పుడు ఫౌజీ చాలా భిన్నమైన గేమ్ అని ఎన్కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ గేమ్ ప్రధానంగా ఒక కథాంశం ఆధారంగా కొనసాగుతుందని చెప్పారు. గత నాలుగు దశాబ్దాలలో చైనా, భారతదేశం మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇందులో కూడా చాలా ఎపిసోడ్లు ఉంటాయి అని అన్నారు. -
నాలుగు మిలియన్లతో సత్తా చాటిన ఫౌజీ
న్యూఢిల్లీ: గేమింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్. పబ్జీకి దీటుగా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఫౌజీ(ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్)గేమ్ గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే నాలుగు మిలియన్ ప్రీ-రిజిస్ట్రేషన్లతో తన సత్తా చాటినట్లు ఎన్కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ పేర్కొన్నారు. ఈ గేమ్ మిడ్-రేంజ్, హై-ఎండ్ ఫోన్లకు మాత్రమే పరిమితం అయినప్పటికీ ఫౌజీ ఇంత తక్కువ సమయంలో ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ప్రసుతం బడ్జెట్ ఫోన్లకు సపోర్ట్ చేయనప్పటికీ.. త్వరలో తక్కువ-స్థాయి ఫోన్ల కోసం ఈ గేమ్ లైట్ వెర్షన్‌ను విడుదల చేస్తామని ఎన్కోర్ గేమ్స్ ప్రకటించింది.(చదవండి: వన్‌ప్లస్ యూజర్లకు గుడ్‌న్యూస్) భారతదేశంలో 2020 డిసెంబరు నెలలో ఫౌజీ గేమ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా 24 గంటల్లో ఒక మిలియన్ రిజిస్ట్రేషన్లతో రికార్డు సృష్టించింది. ఫౌజీ గేమ్ ని బెంగళూరుకి చెందిన స్టూడియో ఎన్కోర్ గేమ్స్ అనే సంస్థ రూపొందించింది. ఈ గేమ్ మొదట్లో భారత ప్రభుత్వం నిషేధించిన పబ్జీ మొబైల్‌కు ప్రత్యామ్నాయంగా వస్తుందని అందరు భావించారు. కానీ, ఇది పబ్జీకి ప్రత్యామ్నాయం కాదని విశాల్ గొండాల్ గతంలో పేర్కొన్నారు. ప్రస్తుతం పబ్జీ మొబైల్ ఇండియా విడుదల అయ్యేటట్లు కనబడటం లేదు. ఫౌజీ ఇండియా కొద్దీ రోజుల్లోనే లాంచ్ కానుంది. మల్టీప్లేయర్ బాటిల్ రాయల్ గేమ్ కోసం దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇక ప్రతిరోజూ పండగే. జాతీయ భద్రతా ఆందోళనల నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ నెలలో భారత ప్రభుత్వం పబ్జీని నిషేదించిన సంగతి మనకు తెలిసిందే. -
గుడ్ న్యూస్.. 'ఫౌజీ' గేమ్ ట్రైలర్ వచ్చేసింది!
న్యూఢిల్లీ: గేమింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్ తెలిపింది ఎన్కోర్ గేమ్స్. 'ఫౌజీ' గేమ్ ను రూపొందిస్తున్న దేశీయ ఎన్కోర్ గేమ్స్ సంస్థ ‘మేడ్ ఇన్ ఇండియా’ 'ఫౌజీ' గేమ్ ను జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ సైనికులు లడఖ్ లో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ దళాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దృశ్యాలతో థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు లాంచ్ చేసింది. ఈ గేమ్ యొక్క మొదటి టీజర్ గత సంవత్సరం దసరా రోజున విడుదలైంది. టీజర్ లో కేవలం పోరాటానికి సంబందించిన సమాచారాన్ని మాత్రమే పంచుకుంది కానీ ఎటువంటి ఆయుధాలను తీసుకొస్తున్నారో వెల్లడించలేదు.(చదవండి: 'ఫౌజీ' ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రారంభం) What will you do when they come? We will hold our ground & fight back, because we are Fearless. United. Unstoppable FAU:G! Witness the anthem 🦁 FAU:G! #FAUG #nCore_Games Pre-register now https://t.co/4TXd1F7g7J Launch 🎮 26/1@vishalgondal @akshaykumar @dayanidhimg pic.twitter.com/VGpBZ3HaOS — nCORE Games (@nCore_games) January 3, 2021 కానీ నేడు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్లో 'ఫౌజీ' గేమ్ ఉద్దేశ్యాన్ని తెలియజేసింది ఎన్కోర్ గేమ్స్. ఈ ట్రైలర్లో భారత సైనికులు ఉపయోగించే టాల్ట్ రైఫిల్స్‌ను కూడా చూడవచ్చు. కొత్త ట్రైలర్లో టైటిల్ ట్రాక్ ‘'ఫౌజీ'’ పేరుతో బాగా రూపొందించారు. అలాగే, పంజాబీలో అదిరిపోయే కొన్ని డైలాగులు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు 2020 డిసెంబర్లో గేమ్ కోసం ఫ్రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా చెప్పట్టారు. 'ఫౌజీ' గేమ్ కేవలం 24 గంటల్లో ఒక మిలియన్ ప్రీ-రిజిస్ట్రేషన్లతో రికార్డు సృష్టించింది. పబ్జి గేమ్ మాదిరిగా కాకుండా 'ఫౌజీ' గేమ్ నిజమైన యుద్ధ సన్నివేశాల అనుభూతిని కలిగిస్తుంది. పబ్జి గేమ్ ని సెప్టెంబర్ లో దేశ సరిహద్దుల్లో ఘర్షణ నేపథ్యంలో నిషేదించింది భారత ప్రభుత్వం. ఈ నిషేధం తరువాత వెంటనే 'ఫౌజీ' గేమ్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ఎన్కోర్ గేమ్స్. గత కొద్దీ నెలల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా 'ఫౌజీ' గేమ్ లవర్స్ కోసం నేడు శుభవార్త తెలిపింది. ఈ గేమ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఎన్కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ దీనిని పబ్జి గేమ్ తో పోల్చకూడదని పలు ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కేవలం భారతీయ వినియోగదారుల కోసమే రూపొందించినట్లు పేర్కొన్నాడు. -
రికార్డు సృష్టించిన ఫౌజీ గేమ్
ఏంతో కాలంగా ఎదురుచూస్తున్నా 'ఫౌజీ' గేమ్ గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉందని నవంబర్ 30న ఎన్కోర్ గేమ్స్ ప్రకటించింది. ఈ గేమ్ మొదటి 24 గంటల్లో భారతదేశంలోని ప్లే స్టోర్‌లో అత్యధిక సంఖ్యలో ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఫస్ట్ పర్సన్ షూటర్(ఎఫ్పిఎస్) గేమ్ కోసం 1.06 మిలియన్ల ప్రీ-రిజిస్ట్రేషన్లను చేసుకున్నారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని డెవలపర్లు ట్వీట్లో తెలిపారు. 'ఫౌజీ' గేమ్ నవంబర్‌లో ప్రారంభించాల్సి ఉంది, కానీ ఇతర కారణాల రీత్యా ఆలస్యం అయింది. (చదవండి: 11వేలలో 5జీ ఫోన్) దసరా పండుగ సందర్బంగా ఈ గేమ్ యొక్క ట్రైలర్ ని విడుదల చేసింది. ‘ఈ రోజు మనం చెడుపై మంచి గెలుపుున సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భయంలేని, ఐక్యతా గార్డులు 'ఫౌజీ' గురించి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకు మించి మంచి రోజు ఏముంటుంది. దసరా పర్వదినం రోజు 'ఫౌజీ' టీజర్‌ను ప్రజెంట్ చేస్తున్నాం.’ అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో గాల్వన్ వ్యాలీకి సంబందించిన సన్నివేశాలు ఉన్నాయి. సరిహద్దు భద్రతకు బాధ్యత వహిస్తున్న భారత సైనికులకు ఈ ఆట నివాళి అని ఎన్కోర్ గేమ్స్ తెలిపింది. పబ్జి గేమ్ ని భారత్ లో నిషేదించిన తర్వాత 'ఫౌజీ' గేమ్ ని తీసుకొచ్చారు. 'ఫౌజీ' గేమ్, పబ్జికి పోటీ కాదని ఎన్కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ స్పష్టం చేశారు. -
గేమ్ లవర్స్ కి గుడ్ న్యూస్
ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నా గేమ్ అభిమానులకు ఎన్కోర్ గేమ్స్ శుభవార్త తెలిపింది. తాజాగా ఎన్కోర్ గేమ్స్ రూపొందిస్తున్న 'ఫౌజీ' మొబైల్ గేమ్ చివరకు గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించింది. గేమ్ ఇంకా లాంచ్ కాలేదు కానీ, మొత్తానికి దీన్ని గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉంచారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే దీనిని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఆపిల్ యొక్క యాప్ స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్లు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. 'ఫౌజీ' మొబైల్ గేమ్ గతంలో తీసుకొచ్చిన టీజర్లో గాల్వన్ వ్యాలీకి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. భారత్, చైనీస్ బలగాల మధ్య జరిగిన ఘర్షణ, ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందనే అంశాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. భారత ఆర్మీ ధైర్యసాహసాలను ప్రతిబింబించేలా ఆ టీజర్ ఉంది. (చదవండి: 5జీ మొబైల్స్ సందడి షురూ) సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా సెప్టెంబరులో 117 ఇతర చైనా యాప్ లతో పాటు పబ్జి గేమ్ నిషేదించింది. పబ్జి గేమ్ పై నిషేధం విధించిన రెండు రోజుల తర్వాత 'ఫౌజీ' గేమ్ ని రూపొందిస్తున్నట్లు ఎన్కోర్ గేమ్స్ ప్రకటించింది. గతంలో ఎన్కోర్ గేమ్స్ ఈ గేమ్ నవంబర్ తర్వాత తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం భారత్ కే వీర్ ట్రస్టుకి అందిస్తామని తెలిపింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నెలలో పబ్జి గేమ్ కూడా "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతో తిరిగి రానున్నట్లు సమాచారం. చూడాలి మరీ ఈ రెండు గేమ్ లలో ఏది ముందు విడుదల అవుతుందో. -
పబ్జీ పోటీగా దేశీయ ఫౌ-జీ గేమ్
న్యూఢిల్లీ: ఫేమస్ మొబైల్ గేమ్ యాప్ పబ్జీ బ్యాన్ తర్వాత ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా వస్తున్న ఫౌ-జీ అనే దేశీయ మొబైల్ గేమ్ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. భారతీయ సైనిక బలగాల వీర్యపరాక్రమాలను తెలియజేసే విదంగా ఈ మొబైల్ యాప్ రూపొందిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. దీనికి సంబందించిన ఫౌ-జీ ఫస్ట్ లుక్ కూడా సినిమా రేంజ్లో టీజర్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా పబ్జీ కార్పొరేషన్ "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో త్వరలో భారత్ లో లాంచ్ కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే పబ్జీకి గట్టిపోటీ ఇవ్వడానికి మన భారత ఫౌ-జీ గేమ్ యాప్ కూడా విడుదలకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. (చదవండి: ఈ వాట్సాప్ మెస్సేజ్ తో జర జాగ్రత్త!) ఫౌ-జీ గేమ్ నవంబర్ తరువాత విడుదల చేయబడుతుందని కంపెనీ గతంలో ధృవీకరించినప్పటికీ, అధికారికంగా ఎప్పుడు విడుదల చేస్తున్నారో స్పష్టం చేయలేదు. గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఫౌ-జీ గేమ్ అందుబాటులో ఉంటుందని ఎన్కోర్ గేమ్స్ పేర్కొంది. భారత గేమింగ్ కంపెనీ అయిన ఎన్కోర్ గేమ్స్ పబ్జీ పోటీగా గేమ్ ని అభివృద్ధి చేయడానికి అత్యంత నిపుణులైన టాప్ - 25 ప్రోగ్రామర్లు, డిజైనర్స్ , టెస్టర్స్, ఆర్టిస్ట్ బృందాన్ని ఎంపిక చేసినట్లు ఎన్కోర్ గతంలో తెలిపింది. 'ఫౌ-జీ: ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్' అనే మల్టీ-ప్లేయర్ గేమ్ పబ్జీ మొబైల్‌కు భారతీయ ప్రత్యామ్నాయంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు కంపెనీలు కూడా అధికారికంగా గేమ్ ని మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారో తెలియజేయలేదు. -
ఇండియన్ పబ్జీ...ఫౌజీ వచ్చేస్తోంది!
సాక్షి, న్యూఢిల్లీ: పబ్జీ సహా 118 చైనీస్ మొబైల్ యాప్ లపై కేంద్రం నిషేధం నేపథ్యంలో ఇండియన్ పబ్జీ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ కొత్త యాక్షన్ గేమ్‌ను శుక్రవారం పరిచయం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మల్టీప్లేయర్ యాక్షన్-గేమ్ ఫౌ-జీని ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ట్విటర్ లో పోస్ట్ చేశారు. వినోదంతో పాటు ఆటగాళ్ళు మన సైనికుల త్యాగాల గురించి కూడా తెలుసుకుంటారని అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పబ్జీకి ప్రత్యామ్నాయంగా ఫౌజీ పేరుతో ఇండియన్ యాప్ ను బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ రూపొందించింది. అక్షయ్ కుమార్ తోపాటు, పారిశ్రామికవేత్త, జీవోక్యూఐఐ ఫౌండర్, సీఈవో విశాల్ గోండల్ ట్వీట్ చేశారు. అంతేకాదు దీని ఆదాయంలో 20 శాతం నిధులను భారత్ కే వీర్‌కు విరాళంగా ఇస్తామని తెలిపారు. అయితే అధికారికంగా ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ వివరించలేదు. అలాగే ఈ గేమ్ మొబైల్ పరికరాలకే పరిమితం అవుతుందా లేదా పీసీ వెర్షన్ కూడా వస్తుందా అనేదానిపై కూడా స్పష్టత లేదు. కాగా1999 లో ఇండియా గేమ్స్ ను ప్రారంభించిన విశాల్ గోండల్ 2011లో దీన్ని డిస్నీకి విక్రయించారు. గత ఏడాది మార్చిలో ఎన్కోర్ గేమ్స్‌లో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టారు. అలాగే స్టార్టప్‌కు వ్యూహాత్మక సలహాదారుగా కూడా పనిచేస్తున్నారు. Supporting PM @narendramodi’s AtmaNirbhar movement, proud to present an action game,Fearless And United-Guards FAU-G. Besides entertainment, players will also learn about the sacrifices of our soldiers. 20% of the net revenue generated will be donated to @BharatKeVeer Trust #FAUG pic.twitter.com/Q1HLFB5hPt — Akshay Kumar (@akshaykumar) September 4, 2020 In response to PM @narendramodi call of #AtmaNirbharApp, @nCore_games is proud to announce our action game Fearless And United: Guards FAU:G with mentorship from @akshaykumar 20% of net revenues donated to @BharatKeVeer trust for India's Bravehearts #JaiHind #FAUG #gaming pic.twitter.com/OZTKj2mdFl — Vishal Gondal (@vishalgondal) September 4, 2020