ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నా గేమ్ అభిమానులకు ఎన్‌కోర్ గేమ్స్ శుభవార్త తెలిపింది. తాజాగా ఎన్‌కోర్ గేమ్స్ రూపొందిస్తున్న 'ఫౌజీ' మొబైల్ గేమ్ చివరకు గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించింది. గేమ్ ఇంకా లాంచ్ కాలేదు కానీ, మొత్తానికి దీన్ని గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉంచారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే దీనిని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఆపిల్ యొక్క యాప్ స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్‌లు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. 'ఫౌజీ' మొబైల్ గేమ్ గతంలో తీసుకొచ్చిన టీజర్‌లో గాల్వన్ వ్యాలీకి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. భారత్, చైనీస్ బలగాల మధ్య జరిగిన ఘర్షణ, ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందనే అంశాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. భారత ఆర్మీ ధైర్యసాహసాలను ప్రతిబింబించేలా ఆ టీజర్ ఉంది. (చదవండి: 5జీ మొబైల్స్ సందడి షురూ)
సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా సెప్టెంబరులో 117 ఇతర చైనా యాప్ లతో పాటు పబ్జి గేమ్ నిషేదించింది. పబ్జి గేమ్ పై నిషేధం విధించిన రెండు రోజుల తర్వాత 'ఫౌజీ' గేమ్ ని రూపొందిస్తున్నట్లు ఎన్‌కోర్ గేమ్స్ ప్రకటించింది. గతంలో ఎన్‌కోర్ గేమ్స్ ఈ గేమ్ నవంబర్ తర్వాత తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం భారత్ కే వీర్ ట్రస్టుకి అందిస్తామని తెలిపింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నెలలో పబ్జి గేమ్ కూడా "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతో తిరిగి రానున్నట్లు సమాచారం. చూడాలి మరీ ఈ రెండు గేమ్ లలో ఏది ముందు విడుదల అవుతుందో.
Comments
Please login to add a commentAdd a comment