రివ్యూ: ఫౌజీ గేమ్ ఎలా ఉందంటే? | This is no PUBG Mobile Rival but got Some Potential | Sakshi
Sakshi News home page

రివ్యూ: ఫౌజీ గేమ్ ఎలా ఉందంటే?

Published Tue, Jan 26 2021 8:54 PM | Last Updated on Wed, Jan 27 2021 1:40 PM

This is no PUBG Mobile Rival but got Some Potential - Sakshi

సాధారణంగా ఏదైనా కొత్త గేమ్ ని ఇండియాలో లాంచ్ చేస్తున్నారంటే పెద్దగా పట్టించుకోరు. కానీ, ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రజాదరణ పొందిన 'పబ్‌జీ’కీ పోటీగా ఓ గేమ్‌ తీసుకొస్తున్నారంటూ ప్రచారం జరిగిన ఆ గేమ్‌ విడుదల పెద్ద విషయమనే చెప్పాలి. పబ్‌జీ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించాక చాలా మంది గేమ్ లవర్స్ నిరుత్సాహ పడిపోయారు. సరైన మల్టీప్లేయిర్ ప్లేయర్ యాక్షన్ గేమ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసారు. సరిగ్గా అదే సమయంలో భారత సైనికుల వీరోచిత పోరాటాలు ప్రతిబింబించేలా ఓ గేమ్‌ను రూపొందిస్తున్నామని బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్ గేమ్స్‌ ప్రకటించింది.(చదవండి: మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?)

అదే ఇండియన్ పబ్‌జీగా పిలువబడే "ఫౌజీ" గేమ్. బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నేతృత్వంలో రూపొందిన ఈ గేమ్‌ గణతంత్ర దినోత్సవ కానుకగా నేడు అందరికి అందుబాటులోకి వచ్చింది. మరి గేమ్‌ ఎలా ఉంది? పబ్‌జీకి పోటీ ఇచ్చే స్థాయిలో రూపొందించారో లేదో తెలుసుకుందామా... 

అందరికంటే ముందుగా ఫ్రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారుల మొబైల్ లలో ఆటోమేటిక్ గేమ్ డౌన్లోడ్ అయింది. ఈ గేమ్ ను సుమారు 500ఎంబీ సైజ్‌లో తీసుకొచ్చారు. ఫౌజీ గేమ్ ని ఓపెన్ చేసాక మొదటి దశలో మూడు రకాల మోడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. క్యాంపెయిన్‌, టీమ్‌ డెత్‌ మ్యాచ్‌, ఫ్రీ ఫర్‌ ఆల్‌ అనే మూడు మోడ్స్‌ కనిపిస్తాయి. ప్రస్తుతం క్యాంపెయిన్ మోడ్ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత దశలో అప్‌డేట్స్‌ రూపంలో మిగిలిన మోడ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాఫిక్ సెట్టింగ్స్ మీడియంలో ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి అల్ట్రా వరకు పెంచుకోవచ్చు. ప్రస్తుతం పబ్‌జీ గేమ్ లో లాగా మల్టీ ప్లేయర్ కి సపోర్ట్ చేయకపోయిన తర్వాత దశలో మల్టీ ప్లేయర్ సపోర్ట్ తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఇది ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ)తో ఆధారంగా పనిచేస్తుంది.

చేతులే ఆయుధాలు
అయితే ఈ గేమ్ లో చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ అవి పట్టించుకునేంత కావు. ఉదా: మీరు ఒక గుడారంలో ఉంటే మీరు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్న ఆటగాళ్లను కొట్టవచ్చు. అలాగే ప్రారంభ దశలో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఆటగాళ్ళు ఒక్కోసారి మిమ్మల్ని కొట్టడం లేదు. ఇందులో పబ్‌జీలో లాగా గన్స్ అందుబాటులో లేవు, కేవలం కత్తులు మాత్రమే ఉంటున్నాయి. ఇవి కూడా కొన్ని స్టేజిలు దాటాక మీకు లభిస్తాయి. అప్పటి వరకు మీ శతృవులను మీ చేతితో యుద్ధం చేయాల్సి ఉంటుంది.(చదవండి: గాల్వాన్ వీరుడికి పరమవీర చక్ర ఇస్తే బాగుండేది!)

ఇందులో ప్రధాన పాత్రలో ఒక సిక్కు సైన్య అధికారి ఉంటాడు. అయితే తను మిగతా తన తోటి సిబ్బందిని చైనా సైన్యం నుండి రక్షించుకోవాలి. గేమ్ లో ముందుకు వెళ్తున్నపుడు ఎనర్జీని పెంచుకోవడానికి పబ్‌జీలో లాగా డ్రింక్స్ ఏమి ఉండవు. కేవలం మనం భోగి మంటల దగ్గర కూర్చొని ఉంటే హెల్త్ పెరుగుతుంది. ఒక్కోసారి గేమ్ లో హెల్త్ అయిపోయిన దీని సహాయంతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం గేమ్ లో చేతితో పోరాడే ఆయుధాలు కత్తి లాంటివి మాత్రమే ఉన్నాయి. ఇందులో మీరు ఆశించినట్టు తుపాకులు లేవు. తర్వాత మోడ్ లో తీసుకొస్తారేమో చూడాలి. ఈ కత్తి లాంటి ఆయుధంతో శత్రువులను చంపడం చాలా తేలిక అవుతుంది. వాటిని కూడా మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే అవి రెండు హత్యలకు మాత్రమే పరిమితం చేయబడతాయి.

సినిమాటిక్ లుక్స్
ఇందులో నాలుగు దశలు ఉంటాయి. ఏ దశలో ఎంతవరకు వచ్చామనేది పైన బార్‌లో చూపిస్తుంటుంది. ఇందులో పాస్ ఆప్షన్ ఉండటం చేత రియల్ గేమ్ అనుభూతిని మనం మిస్ అవుతాం. అలాగే శత్రువులను కొట్టేటప్పుడు వారి చనిపోయేరో లేదో తెలిపే సూచికలు లేవు. అందువల్ల కొన్నిసార్లు మీరు వారు చనిపోయాక కొట్టాల్సి వస్తుంది. ప్రధానంగా గేమ్ ను సినిమాటిక్ లుక్స్ లో, ఇటీవలి గాల్వన్ సరిహద్దు సంఘటన ఆధారంగా రూపొందించారు. ఇందులో క్రమంగా చెక్‌పోస్టులను దాటేటప్పుడు మరింత కష్టమైంది అని చెప్పుకోవాలి. ఇందులో గేమర్స్ వారికీ ఇచ్చిన సమయంలో అన్ని దశలను పూర్తి చేయడం అంటే కష్ట్టమే అని చెప్పుకోవాలి. ఆట నిజంగా చాలా కష్టంగానే ఉంది. నేను, నా సహోద్యోగులు ఎవరూ కూడా ప్రస్తుతం అన్ని దశలను పూర్తీ చేయలేకపోయాము.(చదవండి: ఎలోన్ మస్క్ 'స్పేస్‌ఎక్స్' సరికొత్త రికార్డ్!)

ఆట మీద నా అభిప్రాయం 
ఈ గేమ్ ని ప్రధానంగా చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినట్లు మనకు భాగా తెలిసిపోతుంది. ఇందులో కేవలం పిడిగుద్దులు, కత్తులు తప్ప గన్స్‌ ఉండవు. అందుకే గేమ్ ఎక్కువ శాతం ఆసక్తిగా అనిపించదు. పబ్‌జీకి పోటీ అంటూ ప్రచారం జరిగింది కాబట్టి.. దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాంపెయిన్‌ మోడ్‌తో ఈ గేమ్‌ పబ్‌జీ ప్రేమికుల అంచనాలను అందుకోలేదు. మిగిలిన రెండు మోడ్స్‌ లో పబ్‌జీలో లాగా మల్టి ప్లేయర్ సపోర్ట్ తీసుకొస్తే తప్ప ఏమైనా మార్పు ఉండొచ్చు. సాధారణ సమయాలలో చిన్న పిల్లలతో ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. ‘గల్వాన్‌’ ఘటన గురించి, ఆ సందర్భంలో మన సైనికుల వీరోచిత పోరాటం గురించి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement