గుడ్ న్యూస్.. 'ఫౌజీ' గేమ్ ట్రైలర్‌ వచ్చేసింది!  | FAU G Launch Date in India Finally Revealed | Sakshi
Sakshi News home page

గుడ్ న్యూస్.. 'ఫౌజీ' గేమ్ ట్రైలర్‌ వచ్చేసింది! 

Published Sun, Jan 3 2021 5:50 PM | Last Updated on Sun, Jan 3 2021 7:59 PM

FAU G Launch Date in India Finally Revealed - Sakshi

న్యూఢిల్లీ: గేమింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్ తెలిపింది ఎన్‌కోర్‌ గేమ్స్. 'ఫౌజీ' గేమ్ ను రూపొందిస్తున్న దేశీయ ఎన్‌కోర్‌ గేమ్స్ సంస్థ ‘మేడ్ ఇన్ ఇండియా’ 'ఫౌజీ' గేమ్ ను జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ సైనికులు లడఖ్ లో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ దళాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దృశ్యాలతో థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు లాంచ్ చేసింది. ఈ గేమ్ యొక్క మొదటి టీజర్ గత సంవత్సరం దసరా రోజున విడుదలైంది. టీజర్ లో కేవలం పోరాటానికి సంబందించిన సమాచారాన్ని మాత్రమే పంచుకుంది కానీ ఎటువంటి ఆయుధాలను తీసుకొస్తున్నారో వెల్లడించలేదు.(చదవండి: 'ఫౌజీ' ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రారంభం)

కానీ నేడు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌లో 'ఫౌజీ' గేమ్ ఉద్దేశ్యాన్ని తెలియజేసింది ఎన్‌కోర్‌ గేమ్స్. ఈ ట్రైలర్‌లో భారత సైనికులు ఉపయోగించే టాల్ట్ రైఫిల్స్‌ను కూడా చూడవచ్చు. కొత్త ట్రైలర్‌లో టైటిల్ ట్రాక్ ‘'ఫౌజీ'’ పేరుతో బాగా రూపొందించారు. అలాగే, పంజాబీలో అదిరిపోయే కొన్ని డైలాగులు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు 2020 డిసెంబర్‌లో గేమ్ కోసం ఫ్రీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కూడా చెప్పట్టారు. 'ఫౌజీ' గేమ్
కేవలం 24 గంటల్లో ఒక మిలియన్ ప్రీ-రిజిస్ట్రేషన్లతో రికార్డు సృష్టించింది. పబ్జి గేమ్ మాదిరిగా కాకుండా 'ఫౌజీ' గేమ్ నిజమైన యుద్ధ సన్నివేశాల అనుభూతిని కలిగిస్తుంది. 

పబ్జి గేమ్ ని సెప్టెంబర్ లో దేశ సరిహద్దుల్లో ఘర్షణ నేపథ్యంలో నిషేదించింది భారత ప్రభుత్వం. ఈ నిషేధం తరువాత వెంటనే 'ఫౌజీ' గేమ్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ఎన్‌కోర్‌ గేమ్స్. గత కొద్దీ నెలల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా 'ఫౌజీ' గేమ్ లవర్స్ కోసం నేడు శుభవార్త తెలిపింది. ఈ గేమ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఎన్‌కోర్‌ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ దీనిని పబ్జి గేమ్ తో పోల్చకూడదని పలు ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కేవలం భారతీయ వినియోగదారుల కోసమే రూపొందించినట్లు పేర్కొన్నాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement