విశాఖలో ప్రాణం తీసిన పబ్‌జీ | Pubg Addict Attempt Suicide After Mother Scoldings Him At Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో ప్రాణం తీసిన పబ్‌జీ

Published Wed, Sep 11 2019 12:04 PM | Last Updated on Sat, Sep 28 2019 10:23 AM

Pubg Addict Attempt Suicide After Mother Scoldings Him At Visakhapatnam - Sakshi

ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి బోయి లోహిత్‌

సాక్షి, పెదగంట్యాడ (విశాఖపట్నం): పబ్‌జీ ఆన్‌లైన్‌ గేమ్‌ ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. స్థానిక చినకోరాడ ప్రాంతంలో నివాసముంటున్న బోయి వెంకటరమణ, త్రివేణి దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు బోయి లోహిత్‌ (14) స్థానికంగా ఓ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. పబ్‌జీ గేమ్‌కు బానిసైన లోహిత్‌ చదువును నిర్లక్ష్యం చేస్తుండడంతో తల్లి త్రివేణి గత నెల 20న మందలించి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుంది.

దీంతో మనస్తాపానికి గురైన బాలుడు చీమలమందు నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన షీలానగర్‌లోని ఆస్పత్రి తరలించారు. మూడు రోజలు చికిత్స అనంతరం మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం నగరంలోని మరో  ఆస్పత్రిలో చేర్పించారు. 14 రోజలు చికిత్స అనంతరం బాలుడు పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాలుడు మృతిచెందాడు. దీంతో బాలుడి మేనమామ పులి సూరిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో న్యూపోర్టు సీఐ పైడా అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ అప్పలనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement