పబ్‌ జీ గేమ్‌కు బానిసై అర్ధనగ్నంగా గలాటా | PUBG Game Effected Young man Drama on Road Karnataka | Sakshi
Sakshi News home page

అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చి గలాటా

Published Wed, Jan 22 2020 7:12 AM | Last Updated on Wed, Jan 22 2020 7:12 AM

PUBG Game Effected Young man Drama on Road Karnataka - Sakshi

కర్ణాటక యశవంతపుర : పబ్‌ జీ గేమ్‌కు బానిసైన యువకుడు మానసిక అస్వస్థతతో అర్ధనగ్నంగా తిరుగుతూ రాళ్లతో దాడి చేసిన ఘటన విజయపుర పట్టణంలో జరిగింది. పబ్‌జీ గేమ్‌కు అలవాటు పడిన యువకుడు మంగళవారం విజయపుర పట్టణంలోని మనగోలి అగసి వద్ద అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. అనంతరం రాళ్లతో కార్లు, బైక్‌లపై దాడి చేశాడు. పబ్‌జీలో మాదిరిగా బాంబ్‌లు విసిరినట్లు గలాటా సృష్టించాడు. దీంతో మహిళలు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement