చెన్నై: టీమిండియా సీనియర్ ఆటగాడు, చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ఎంఎస్ ధోని గురించి ఓ ఆసక్తికర విషయాన్ని దీపక్ చహర్ తెలిపాడు. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ ఆటపై ధోని అమితాసక్తి కనబరుస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మోస్ట్ పాపులర్ గేమ్ పబ్‌జీలో ధోని అత్యంత నిష్ణాతుడని సీఎస్‌కేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపక్ చహర్ పేర్కొన్నాడు. ఆటల్లో టేబుల్ టెన్నిస్ లేక పబ్‌జీలలో ఒకటి ఎంచుకోవాలంటే ఏది ఎంచుకుంటావని చహర్‌ను సీఎస్‌కే ప్రశ్నించింది.
దీనికి సమాధానంగా.. ’ఏ మాత్రం ఆలోచించకుండా పబ్‌జీ అనే చెబుతాను. ఎందుకుంటే ఇప్పటికీ పబ్‌జీ ఆడతాను. ధోని కూడా చాలా బాగా ఆడేవాడు. నేను, ధోనితో పాటు మరికొంతమంది ఆన్‌లైన్‌లో ఈ గేమ్ ఆడేవాళ్లం. అయితే ధోని మరో గేమ్‌కు మారాడు. కాల్ ఆఫ్ డ్యూటీ(సీఓడీ)తో ప్రస్తుతం బిజీగా ఉంటున్నాడు. దీంతో అతడికి పబ్‌జీపై పట్టు కోల్పోయాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరు కాలుస్తున్నారో కనిపెట్టలేకపోతున్నాడు’ అంటూ దీపక్ చహర్ పేర్కొన్నాడు. ఇక డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ తర్వాత ఈ పేస్ బౌలర్ టీమిండియా తరుపున ఆడలేదు. అయితే ఐపీఎల్‌ను సద్వినియోగం చేసుకొని మళ్లీ టీమిండియా జెర్సీ ధరించాలని ఆశించాడు. కానీ కరోనా కారణంగా ఐపీఎల్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చదవండి:
ఎంతో మందిని చూశా.. కానీ ధోని అలా కాదు
‘తెలియక తప్పు చేశా..నరకం చూశా’
Comments
Please login to add a commentAdd a comment