చహర్‌తో ధోని (PC: IPL/CSK)
IPL 2024- Is this MS Dhoni's last IPL season?: మిస్టర్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్-2024 సీజన్‌లో ఆడతాడా? లేదా? తలా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈసారి కొత్త పాత్రలో నేను అంటూ ధోని కూడా టీజ్ చేయడంతో ఆటగాడిగా జట్టు నుంచి నిష్క్రమిస్తాడా అనే సందేహాలు మరింత బలపడ్డాయి.
తాజా ఎడిషన్‌లో మెంటార్‌గా ధోని కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎస్‌కే ఆల్‌రౌండర్ దీపక్ చహర్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో సంతోషాన్ని నింపాయి.
‘‘ధోని ఈసారి కచ్చితంగా ఆడతాడు. నాకు తెలిసి ఈ సీజన్ ముగిసిన తర్వాతే ఇక ముందు ఆడాలా? వద్దా అనే నిర్ణయం తీసుకుంటాడు. నా అభిప్రాయం ప్రకారం అయితే.. ధోని మరో రెండేళ్లపాటు ఆడతాడు. బ్యాటర్లైనా, బౌలర్లైనా తమ ఆటలో పస తగ్గినపుడే రిటైర్ అవ్వాలని భావిస్తారు.
మరి.. గతేడాది ఎంఎస్ ధోని ఎలాంటి షాట్లు బాదాడో చూశారు కదా! గంటకు 145 కిలో మీటర్ల వేగంతో సిక్స్‌లు కొట్టాడు. నెట్స్‌లోనూ భారీ షాట్లతో అలరించాడు’’ అని ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. దీపక్ చహర్ పేర్కొన్నాడు. కాగా 42 ఏళ్ల ధోని గతేడాది సీఎస్‌కేను రికార్డు స్థాయిలో ఐదోసారి చాంపియన్‌గా నిలిపాడు.
ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ
ఐపీఎల్ టి20 టోర్నీ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాటర్, న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్ కాన్వే ఐపీఎల్ టోర్నీకి దూరం కానున్నాడు. ఇటీవల కాన్వే ఎడమ బొటన వేలికి గాయంకాగా, ఈ వారంలో అతనికి శస్త్ర చికిత్స జరగనుంది.
కాన్వే కోలుకోవడానికి కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈసారి రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన కాన్వే 9 అర్ధ సెంచరీలతో కలిపి 141.28 స్ట్రయిక్‌రేట్‌తో 924 పరుగులు సాధించాడు.
చదవండి: IPL 2024: ఆ జట్టు ఈసారి కూడా ప్లే ఆఫ్స్ చేరలేదంటే సిగ్గుచేటే!
Comments
Please login to add a commentAdd a comment