దీపక్ చహర్, రవీంద్ర జడేజాతో ధోని (PC: IPL/BCCI)
MS Dhoni On India, CSK Star: ‘‘దీపక్ చహర్ డ్రగ్ లాంటివాడు. ఒకవేళ తను మన చుట్టుపక్కలే ఉంటే.. ఎక్కడున్నాడు అని వెతుక్కోవాలి. ఒకవేళ మన పక్కనే ఉంటే.. ఇతడు ఇక్కడెందుకు ఉన్నాడని అనుకునేలా చేస్తాడు. అతడు రోజురోజుకీ పరిణతి చెందడం హర్షించదగ్గ విషయం. పూర్తిస్థాయిలో పరిణతి సాధించాలంటే చాలా సమయం పడుతుంది. అయినా పర్లేదు! కానీ నా జీవితకాలంలో మాత్రం అతడిని మెచ్యూర్ పర్సన్‌గా చూడలేను’’ అని చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు.
కాగా టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ చహర్‌కు ధోనితో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. 2016లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ చహర్‌ను తీసుకున్నపుడు అక్కడే మిస్టర్‌కూల్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో 2017 తర్వాత అతడిని సీఎస్‌కేలోకి తీసుకువచ్చాడు తలా!!
చహర్‌కు అండగా నిలిచి
ఇక 2018లో చహర్‌ను ఆడించడానికి సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నిరాకరించగా.. ధోని మాత్రం 14 మ్యాచ్‌లలో అతడిని ఆడించాడు. చహర్‌కు అండగా నిలబడి తన కెరీర్ ఊపందుకునేందుకు ఊతమిచ్చాడు. కాగా గాయం కారణంగా ఐపీఎల్-2022 మొత్తానికి దూరమైన చహర్.. తాజా ఎడిషన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు కూల్చాడు.
నిర్మాత ధోని
ఇంతకీ ధోని ఏ సందర్భంలో చహర్ గురించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడో చెప్పనేలేదు కదూ! ధోని సినీ నిర్మాతగా కొత్త అవతారమెత్తాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎస్‌కేలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న తలా.. ధోని ఎంటర్టైన్‌మెంట్ పేరిట సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.
LGM పేరిట తన ప్రొడక్షన్‌లో మొదటి సినిమా నిర్మించాడు. దీనికి సంబంధించిన ట్రైలర్, ఆడియో లాంచ్ ఫంక్షన్‌ను సోమవారం చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా చహర్ గురించి ప్రస్తావన రాగా.. ధోని పైవిధంగా స్పందించాడు.
చదవండి: Ashes 2023: కీలకమైన టెస్టుకు మళ్లీ అదే జట్టు! మొండిగా వ్యవహరిస్తే..
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ కాదు.. ఆ జట్టుతో చాలా డేంజర్! లేదంటే?
Comments
Please login to add a commentAdd a comment