అంబటి రాయుడుతో ధోని (PC: IPL/BCCI)
MS Dhoni Hilarious Response Over Yogi Babu Wanting To Join CSK: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో.. ఆఫ్ ది ఫీల్డ్ అంతే సరదాగా ఉంటాడు. ఆటలో కెప్టెన్సీ నైపుణ్యాలతో ఆకట్టుకునే తలా.. ప్రస్తుతం సినీ నిర్మాతగా కొత్త అవతారమెత్తిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌తో పెనవేసుకున్న బంధాన్ని మరింత పదిలం చేసుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో ధోని ఎంటర్టైన్‌మెంట్ పేరిట నిర్మాణ రంగంలోకి దిగాడు.
లెట్స్ గెట్ మ్యారీడ్
తమ బ్యానర్‌పై తెరకెక్కిన తొలి సినిమా LGM (Let's Get Married) ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. చెన్నైలో జరిగిన ఈ ఈవెంట్‌లో ధోని, అతడి సతీమణి సాక్షి తమ చేతుల మీదుగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. LGMలో నటించిన హరీశ్ కళ్యాణ్, నదియా, ఇవానా, కమెడియన్ యోగిబాబు, ఆర్జే విజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎస్‌కేకు ఆడాలని ఉంది
ఈ సందర్భంగా యోగిబాబు తనదైన శైలిలో హాస్యం పండించాడు. అంతేకాదు తనకు చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగం కావాలని ఉందంటూ తన మనసులో ఉన్న కోరికను ధోని ముందు బయటపెట్టాడు. ఇందుకు ధోని కూడా అంతే సరదాగా స్పందించాడు. ‘‘రాయుడు రిటైర్ అయ్యాడు. కాబట్టి సీఎస్‌కేలో మీకు తప్పకుండా చోటు ఉంటుంది. మేనేజ్‌మెంట్‌తో నేను మాట్లాడతాను.
కానీ మీరిప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు కదా!నేనైతే మీరు ఎల్లప్పుడు జట్టుతో ఉంటూ నిలకడగా ఆడాలని కోరుకుంటా. కానీ వాళ్లు మాత్రం ఫాస్ట్ బౌలింగ్‌తో మిమ్మల్ని గాయపరుస్తారు మరి జాగ్రత్త’’ అని తలా యోగిబాబుకు బదులిచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి.
రాయుడు అరుదైన ఘనత
అంబటి రాయుడు ఐపీఎల్-2023 తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎడిషన్‌లో చెన్నై టైటిల్ గెలిచి ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా నిలవడంతో రాయుడు అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో మొత్తంగా ఆరుసార్లు(ముంబై ఇండియన్స్ తరఫున 3, సీఎస్‌కే తరఫున 3) విజేతగా నిలిచిన జట్టులో భాగమైన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ముంబై సారథి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.
చదవండి: సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా!
తల్లిదండ్రుల కష్టం ఏమిటో అర్థం చేసుకోలేని స్థితిలోనూ! శెభాష్ బిడ్డా..
Comments
Please login to add a commentAdd a comment