Sakshi Dhoni Gives Update On MS Dhoni Knee Surgery; See Video - Sakshi
Sakshi News home page

MS Dhoni: గుడ్‌న్యూస్‌ చెప్పిన ధోని భార్య సాక్షి! సంతోషంలో ఫ్యాన్స్‌.. ఇక..

Published Fri, Jul 28 2023 6:40 PM

Video: Sakshi Provides Major Update About Husband MS Dhoni Knee Injury

MS Dhoni- IPL 2024: మోకాలి గాయం వేధిస్తున్నా ఐపీఎల్‌-2023 సీజన్‌ మొత్తం ఎలాగోలా నెట్టుకొచ్చాడు చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోని. గతేడాది దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిన సీఎస్‌కేను ఈసారి ఏకంగా చాంపియన్‌గా నిలిపాడు. తన అద్భుత కెప్టెన్సీ నైపుణ్యాలతో జట్టుకు ఐదో ట్రోఫీ అందించాడు.

మోకాలికి సర్జరీ
ఇక క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌ ముగిసిన తర్వాత మిస్టర్‌ కూల్‌ మెకాలికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. నీరజ్‌ చోప్రా, రిషభ్‌ పంత్‌ వంటి యువ ఆటగాళ్లను ట్రీట్‌ చేసిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ దిన్షా పార్దీవాలా పర్యవేక్షణలో ధోనికి కీహోల్‌ సర్జరీ జరిగినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2023 తనకు చివరి ఐపీఎల్‌ కాదంటూ ట్రోఫీ ముగిసిన తర్వాత ధోని స్పష్టం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల తలా మళ్లీ బ్యాట్‌ పట్టడం ఖాయమని అభిమానులు మురిసిపోతున్నారు. ఈ క్రమంలో ధోని సతీమణి సాక్షి సింగ్‌ ఇచ్చిన అప్‌డేట్‌ వారిని మరింత ఖుషీ చేసింది.

ఆయన బాగున్నాడు
కాగా ధోని ఎంటర్టైన్‌మెంట్‌ పేరిట ప్రొడక్షన్‌ హౌజ్‌ స్థాపించిన మిస్టర్‌ కూల్‌.. తన భార్య సాక్షి నిర్మాతగా కోలీవుడ్‌లో LGM అనే సినిమాను నిర్మించాడు. శుక్రవారం ఈ మూవీ విడుదల సందర్భంగా సాక్షి సందడి చేసింది.

ఈ సందర్భంగా ధోని గురించి అభిమానులు ప్రశ్నించగా.. ‘‘ఆయన చాలా చాలా బాగున్నాడు.. కోలుకుంటున్నాడు.. రిహాబ్‌లో ఉన్నాడు’’ అని సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను తలా ఫ్యాన్స్‌ నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. ‘‘మహీ భాయ్‌.. ఐపీఎల్‌-2024లో ఆడటం ఖాయం’’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు..

Advertisement
 
Advertisement
 
Advertisement