ఇస్లామాబాద్: పాకిస్తాన్ జూలై 1న పబ్‌జీ గేమ్‌ను నిషేధించింది. ఇది ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉండటంతోపాటు చిన్నారులకు, యువతకు హాని కలిగిస్తుండటమే దీనికి కారణమని స్పష్టం చేసింది. అయితే ప్రముఖ యాప్ టిక్‌టాక్ కూడా ఇంచుమించు ఇలాంటి ఆరోపణలే ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌కు పాక్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. టిక్‌టాక్‌లో అసభ్యత, అశ్లీలత హెచ్చు మీరకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని దాని మాతృ సంస్థ బైట్ డాన్స్‌ను ఆదేశించింది.
ఈమేరకు పాకిస్తాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) స్పందిస్తూ.. "సోషల్ మీడియా యాప్స్‌లో అసభ్య కంటెంట్ ఉంటోందంటూ మాకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో అధికంగా టిక్‌టాక్, బిగో నుంచే ఉన్నాయి. ముఖ్యంగా యువతను చెడుదారి పట్టించే కంటెంట్ ఎక్కువగా ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే దీనిగురించి ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశాం. కానీ వారి స్పందన అంత సంతృప్తికరంగా లేదు. దీంతో ఇప్పటికే బిగోను నిషేధించాం. టిక్‌టాక్‌కు ఆఖరి హెచ్చరిక జారీ చేశాం. ఇందులో మితిమీరుతున్న అశ్లీలతను, అసభ్యతను, అనైతిక వీడియోలను నియంత్రించేందుకు సమగ్రమైన యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించా"మని పేర్కొంది. కాగా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందన్న కారణంతో భారత్ కూడా టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. దీనితోపాటు మరో 58 యాప్‌లను నిషేధించింది. (పబ్‌జీ ఆట.. యాంటీ ఇస్లాం అట..!!)
Comments
Please login to add a commentAdd a comment