immigrant
-
ఇదీ ఇండియన్స్ సత్తా! ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
Anand Mahindra Tweet: సోషల్ మీడియాలో చరుగ్గా ఉండే మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా విభిన్న అంశాలపై స్పందిస్తుంటారు. అధిక సంఖ్యలో ఉండే తన ఫాలోవర్లకు ఆయా అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా విదేశాల్లో భారతీయుల అభ్యున్నతికి సంబంధించిన అంశంపై స్పందించారు. అమెరికాలో బిలియన్ డాలర్ల కంపెనీలను స్థాపించిన విదేశీ వ్యక్తుల్లో భారతీయులే టాప్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన గణాంకాలను ‘వల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేయగా దాన్ని ట్యాగ్ చేస్తూ ‘ఆశ్చర్యపరిచే గణాంకాలు. ప్రవాస భారతీయులు తాము నివసిస్తున్న దేశాలకు ఎంత చేస్తున్నారో.. ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. ఒక బిలియన్ డాలర్ అంత కంటే ఎక్కువ విలువైన అమెరికన్ కంపెనీలలో సగానికిపైగా విదేశాల్లో జన్మించి ఆ దేశానికి వలస వచ్చినవారే. వీరిలో భారత్ నుంచి వలస వెళ్లినవారే అత్యధికులు. విదేశీ వలసదారులు స్థాపించిన మొత్తం అమెరికన్ కంపెనీల్లో అత్యధికంగా భారతీయులు 66 కంపెనీలను స్థాపించారు. 54 కంపెనీలతో ఇజ్రాయిల్, 27 కంపెనీలతో యూకే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. Astonishing figure. Demonstrates what value is brought by Indian Immigrants to a country of their adoption… https://t.co/TjcohqPsWP — anand mahindra (@anandmahindra) August 19, 2023 -
ఒకరు వచ్చారు.. ఇంకొకరు వెళ్లారు.. భారత్-పాకిస్తాన్ ప్రేమకథలు..
ఇస్లామాబాద్: మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరమంటూ భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి ప్రయత్నంలో ఉన్నారు ఇరుదేశాల ప్రేమికులు. పాకిస్తాన్ నుంచి ఒక మహిళ పబ్జీ పరిచయంతో తాను ప్రేమించిన యువకుడి కోసం భారతదేశం వచ్చినట్టే భారత దేశం నుండి కూడా ఒక మహిళ లెక్క సరిచేస్తూ ప్రేమించిన యువకుడి కోసం ఇటు నుండి పాకిస్తాన్‌కు ప్రయాణమైంది. కాకపొతే పాకిస్తానీ మహిళ సీమా హైదర్ లా కాకుండా అన్ని డాక్యుమెంట్లు పక్కాగా సిద్ధం చేసుకుని ప్రణాళిక ప్రకారం వెళ్ళింది భారత మహిళ. ఒక పధ్ధతి.. ఒక ప్లానింగ్.. యూపీలోని కైలార్ గ్రామంలో పుట్టి పెరిగి రాజస్థాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో నివాసముంటున్న అంజు(34)కు పాకిస్తాన్ యువకుడు నస్రుల్లా(29)తో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. కొద్దిరోజులకి ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఎలాగైనా ప్రియుడిని కలవాలనుకుంది. అనుకుందే తడవు సాహసం చేసి సరిహద్దు దాటేసి డిర్ జిల్లాలోని పక్తుంక్వా చేరుకుని నస్రుల్లాను కలుసుకుంది. విషయం తెలుసుకున్న డిర్ పోలీసులు వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకుని సీనియర్ పోలీసు అధికారి ముస్తాక్ ఖాబ్ ఆధ్వర్యంలో అన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు. అంతా సక్రమంగా ఉందని తెలిసిన తర్వాతే వారిని విడిచిపెట్టారు. జైపూర్ వెళ్తున్నట్లు చెప్పి.. రాజస్థాన్ పోలీసులకు ఈ సమాచారమందడంతో వారు భివాడిలోని అంజు ఇంటికి వెళ్ళి ఆరా తీశారు. విచారణ సమయంలో అంజు భర్త అరవింద్ మాట్లాడుతూ.. మాకు 2007లో పెళ్లి జరగగా 15 ఏళ్ల పాప, 6 ఏళ్ల బాబు ఉన్నారని తెలిపారు. నా భార్యకు సోషల్ మీడియాలో పరిచయాలున్నాయని నాకు తెలియదు. గురువారం తాను స్నేహితురాలిని కలిసేందుకు జైపూర్ వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిందని తర్వాత తన చెల్లెలికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా లాహోర్ వెళ్లిన విషయం తెలిసిందన్నారు. ఎలాగైనా నా భార్యకు నచ్చజెప్పి తనను తిరిగి తీసుకొస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అరవింద్. అంతా సేమ్ టు సేమ్.. ఇటీవల పబ్జీలో పరిచయాన్ని ప్రేమగా మలచుకుని భారత్ వచ్చిన మహిళ సీమా హైదర్- సచిన్ మీనాల ప్రేమకి అంజు-నస్రుల్లా ప్రేమకి కొన్ని సారూప్యతలున్నాయి. ఇద్దరూ పెళ్ళై పిల్లలున్నవారే.. ఇద్దరి ప్రేమలకూ సోషల్ మీడియానే వేదిక.. పొందికగా పొరుగు దేశాల వారినే ప్రేమించారు. కాకపొతే సీమా హైదర్ చట్టవిరుద్ధంగా భారత దేశంలో అడుగుపెట్టగా అంజు మాత్రం పూర్తి చట్టబద్ధంగా పాకిస్తాన్ వెళ్ళింది. అదొక్కటే వ్యత్యాసం. ఇది కూడా చదవండి: కూతురు అబార్షన్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది! -
అగ్రరాజ్యంలో తెలుగు తేజం
తెనాలి: అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యకు విశేష కృషి చేసినందుకు ఇమ్మిగ్రెంట్ అచీవ్మెంట్ అవార్డ్ అందుకున్నారు గుంటూరుకు చెందిన తెలుగు మహిళ నీలి బెండపూడి (59). అమెరికాలోని ప్రతిష్టాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళ నీలి బెండపూడి గత నెలలో భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనతో సమావేశమైన వ్యక్తిగా వార్తల్లోకి వచ్చారు. భారతదేశంలోని గొప్ప విద్యాలయాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రెండు దేశాలకు అవసరమైన సిఫార్సులను చేసే కోచర్‌గా ఆమె నియమితులయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రొఫెసర్ నీలి విశాఖపట్నంలో చదువుకున్నారు. అక్కడినుంచే అమెరికా వెళ్లారు. ఆమె జీవిత విశేషాల్లో విశాఖ వాసిగానే పేర్కొంటున్నారు. నిజానికి ప్రొఫెసర్ నీలి గుంటూరులో జన్మించారు. తల్లి దత్తావఝుల పద్మ, తండ్రి రమేష్. ఇద్దరూ ఆంధ్రా యూనివర్సిటీలో పనిచేశారు. ఈ కారణంగా నీలి బీఏ, ఎంబీఏ వరకు చదువు మొత్తం అక్కడే సాగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఉన్నత చదువుల కోసం 1986లో నీలి బెండపూడి అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో మార్కెటింగ్‌లో పీహెచ్డీ చేశారు. అకడమిక్ అడ్మినిస్ట్రేటర్‌గా నైపుణ్యం సాధించి.. తాను విద్య అభ్యసించిన కాన్సాస్ యూని వర్సిటీలో ప్రొవోస్ట్, ఎగ్జిక్యూటివ్ వైస్ చాన్సలర్, స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌తో సహా అనేక అడ్మినిస్ట్రేటివ్ హోదాల్లో సేవలందించారు. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఇనీషి యేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు హంటింగ్టన్ నేషనల్ బ్యాంక్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ కస్టమర్ ఆఫీ సర్గానూ విధులు నిర్వర్తించారు. అకాడమీ ఆఫ్ మార్కె టింగ్, అత్యుత్తమ మార్కెటింగ్ టీచర్ అవార్డుతో సహా అనేక జాతీయ అవార్డులను అందుకున్నారు. 2018–21లో కెంటకీలోని లూయిస్విల్లే యూనివర్సిటీకి 18వ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2022 మే 10న పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీ 19వ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతిష్టాత్మక ‘ఇమ్మిగ్రెంట్ ఎచీవ్మెంట్’ అవార్డు అందుకు న్నారు. ప్రొఫెసర్ నీలి బెండపూడిని భారత్‌లోని ప్రముఖ వర్సిటీల్లో పరిశోధనను మెరుగుపరచి ఉన్నత స్థాయిలో నిలబెట్టేలా 2 దేశాల మధ్య ఆరంభమైన కార్యక్రమానికి అవసరమైన సిఫార్సులను ప్రొఫెసర్ నీలి చేశారు. ఇందుకోసం ఆమె కోచర్‌గా నియమితులయ్యారు. -
సీఏఏపై సత్య నాదెళ్ల ఏమన్నారంటే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేక, అనుకూల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. తాజాగా సీఏఏపై భారతీయ సంతతికి చెందిన టెక్ దిగ్గజం తొలిసారి స్పందించారు. ఆయనే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తీవ్రంగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం బాధను, విచారాన్ని కలిగిస్తోందన్నారు. వివాదాస్పదమైన సీఏఏకు వ్యతిరేకంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక కొర్పొరేట్ దిగ్గజం వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బజ్‌ఫీడ్ ఎడిటర్ బెన్ స్మిత్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. బెన్ స్మిత్ ట్విటర్లో చేసిన షేర్ చేసిన వివరాల ప్రకారం సీఏఏ తర్వాత దేశంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం మంచిది కావని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి భారతదేశం వచ్చి.. తదుపరి ఇన్ఫొసిస్ కంపెనీ సీఈవోగా చూడాలని కోరుకుంటున్నానన్న సత్య నాదెళ్ల వ్యాఖ్యలను ఉటంకిస్తూ స్మిత్ ట్వీట్ చేశారు. మరోవైపు మైక్రోసాఫ్ట్ ఇండియా విడుదల చేసిన ఒక ప్రకటనలో, నాదెళ్ల ఇలా అన్నారు. ప్రతి దేశం తన సరిహద్దులను నిర్ణయించుకుంటుంది. నిర్ణయించుకోవాలి కూడా. తదనుగుణంగా జాతీయ భద్రతను కాపాడుకోవాలి, ఇమ్మిగ్రేషన్ విధానాన్ని నిర్దేశించాలి. అదే సందర్భంలో ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలు, ప్రభుత్వాలు చర్చించి, నిర్వచించి నిర్దేశించుకోవాల్సిన విషయం ఇది అని పేర్కొన్నారు. భారతీయుడిగా పుట్టాను, బహుళ సాంస్కృతిక వాతావరణాల్లో పెరిగాను. వలసదారునిగా అమెరికాలో ఉన్నారు. ఒక సంపన్నమైన ప్రారంభాన్ని కనుగొనాలని లేదా భారతీయ సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు భారీగా ప్రయోజనం చేకూర్చేలా బహుళజాతి సంస్థను నడిపించాలని ఒక వలసదారుగా తన ఆశ అంటూ న్యాయపరంగా వచ్చే వలసదారులతో దేశ ఉన్నతికి దోహదపడుతుంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. హైదరాబాద్‌కు చెందిన సత్య నాదెళ్ల ఫిబ్రవరి 2014 నుండి మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సంగతి తెలిసిందే. Asked Microsoft CEO @satyanadella about India's new Citizenship Act. "I think what is happening is sad... It's just bad.... I would love to see a Bangladeshi immigrant who comes to India and creates the next unicorn in India or becomes the next CEO of Infosys" cc @PranavDixit — Ben Smith (@BuzzFeedBen) January 13, 2020 -
ట్రంపరితనం!
-
1 నేనొక్కదాన్నే..
ఇది మహేష్‌బాబు సినిమా కథ కాదు.. అమెరికాలోని మోనోవై అనే ఊరు కథ.. మరీ ముఖ్యంగా ఆ ఊర్లో ఉండే ఎల్సీ ఐలర్ అనే బామ్మ కథ.. అంత స్పెషల్ ఏంటట.. నెబ్రాస్కా రాష్ట్రంలోని మోనోవై.. ఈ ఊరికి మేయర్ ఉన్నారు.. క్లర్క్, సెక్రటరీ, కోశాధికారి, లైబ్రేరియన్, బార్ టెండర్ ఇలా అందరూ ఉన్నారు.. కానీ ఊర్లో ఉన్నది మాత్రం ఒక్కరే.. అవును.. 2010 అమెరికా జనాభా లెక్కల ప్రకారం ఈ ఊరి జనాభా 1. ఆ ఒక్కరు ఎల్సీ ఐలర్.. వయసు 84. ఇక మేయర్, క్లర్క్, సెక్రటరీ, కోశాధికారి, లైబ్రేరియన్, బార్ టెండర్ గురించి అంటారా.. అవన్నీ కూడా ఎల్సీ ఐలరే!! ఎందుకలా? 1930ల్లో ఇక్కడ 150 మంది దాకా ఉండేవారు. రెస్టారెంట్లు, షాపులు చివరికి ఓ జైలు కూడా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో జనం వలస బాటన పడ్డారు. ఎల్సీ ఆమె భర్త రూడీ మాత్రం ఇక్కడే ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత వీరి పిల్లలు కూడా ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. 2004లో రూడీ చనిపోయారు. అయినా.. ఎల్సీ ఊరిని విడిచిపోలేదు.. ఊరి మీద ఆమెకున్న మమకారం అలాంటిది. అంతేకాదు.. ఈ ఊరికి ఇన్కార్పొరేటెడ్ టౌన్ స్టేటస్ కోసం ఆమె పన్నులు కడతారు. దీనికి కావాల్సిన మున్సిపల్ రోడ్ ప్లాన్‌ను ఏటా సమర్పిస్తారు. ఇన్కార్పొరేటెడ్ టౌన్ అంటే ఇక్కడ ప్రభుత్వపరంగా నియమించే అధికారులు ఉంటారు. మేయర్ ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. ఎన్నికల్లో ఓటేసేదెవరు? ఇంకెవరు ఎల్సీనే.. ఊర్లో ఎవరూ లేరు.. దీంతో ఏటా మేయర్ ఎన్నికల్లో నిల్చొని.. తనకు తానే ఓటు వేసుకుంటారు. ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే.. ఏటా బార్, టొబాకో షాపు లైసెన్సు కోసం ఓ బార్ యజమానిగా రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటారు.. ఓసారి దీన్ని పరిశీలించండి అంటూ ఆ అప్లికేషన్ ఊరి సెక్రటరీ దగ్గరకు వస్తుంది.. సెక్రటరీ దరఖాస్తును పరిశీలించి.. అంతా ఓకే అని క్లర్క్ వద్దకు పంపిస్తారు.. క్లర్క్ కూడా ఓకే చేసేసి.. అనుమతి మంజూరు చేస్తూ బార్ యజమానికి ఉత్తర్వుల కాపీ ఇస్తారు.. ఇక్కడ సెక్రటరీ, క్లర్క్, బార్ యజమాని ముగ్గురూ ఎల్సీనే.. అంటే.. తనే దరఖాస్తు పెట్టి.. తనే ఓకే చేసి.. తనే తీసుకుంటారన్నమాట! మరి.. ఒక్కరే బోర్ కొట్టదా.. కొట్టదు.. ఎందుకంటే.. ఆమె నడుపుతున్న బార్, లైబ్రరీలకు పర్యాటకుల తాకిడి ఉంటుంది. గతంలో ఆ ఊరి నుంచి వెళ్లిపోయిన వాళ్లు తమ రెండో, మూడో తరాన్ని ఇక్కడికి తీసుకొచ్చి.. ఎల్సీని చూపిస్తుం టారు. అమెరికాలో ఒక్కరే ఉంటున్న ఇన్కార్పొరేటెడ్ టౌన్‌గా పేరు రావడంతో దీన్ని చూడ్డానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. పలు చానళ్లు డాక్యుమెంటరీలు కూడా ఇక్కడ తీశాయి. ఎల్సీ మనవలు అక్కడికి 90 మైళ్ల దూరంలోని పోన్కా పట్టణంలో ఉంటారు. వాళ్లు అక్కడికి సమీపంలోనే ఉన్నా.. ఊరిని విడిచి వెళ్లడానికి ఆమె ఇష్టపడటం లేదు. నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ప్రాణం పోయినా ఇక్కడే పోవాలి.. అంతే తప్ప.. ఈ మట్టిని..ఊరిని మాత్రం విడిచిపోను.. – ఎల్సీ ఐలర్ ..: సాక్షి, తెలంగాణ డెస్క్ -
వలసలకు ట్రంప్ వ్యతిరేకం కాదు
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాల కోసం ఉపయోగపడే హెచ్1బీ, ఎల్1బీ వంటి వీసాలపై అగ్రరాజ్యం అమెరికా సరికొత్త, కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానానికి వ్యతిరేకం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన స్వపక్ష నేతలు కూడా ఇలాంటి విమర్శలు చేశారు. అయితే ట్రంప్ వలసలకు వ్యతిరేకం కాదంటూ శ్వేతసౌధం ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ, ఇండో అమెరికన్ రాజ్షా అన్నారు. ‘ట్రంప్‌ది వలసల వ్యతిరేక విధానం కాదు. అక్రమ వలసల వ్యతిరేక విధానం. అమెరికాకు వలస వచ్చేవారు ప్రతిభావంతులై ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నారు. అందుకోసమే వీసా జారీలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ‘ఇది పెద్ద తప్పు’ అని నేను అనుకోవడం లేదు. ఈ నిర్ణయం ఆమోదయోగ్యం. ప్రజలు దీనికి కచ్చితంగా మద్దతిస్తారు’ అని రాజ్షా అన్నారు. హెచ్–1బీ వీసా బిల్లుకు అమెరికా ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో రాజ్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హెచ్–1బీ వీసాదారుల కనీస వేతనాన్ని పెంచుతూ సిద్ధం చేసిన బిల్లుకు ఇటీవల అమెరికా కాంగ్రెస్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో పాటు వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు చర్యలను కమిటీ ప్రతిపాదించింది. ఈ వీసాలకు భారత ఐటీ నిపుణుల్లో డిమాండ్ ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే. అమెరికా ఉద్యోగుల స్థానాన్ని వీరితో భర్తీ చేయకుండా తాజా బిల్లులో ఆంక్షలు సిద్ధం చేసింది. -
పకడ్బందీగా విచారణ చేపట్టండి : జేసీ
వారిది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం.. కొన్నేళ్లక్రితం భార్యాభర్తలు హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ ఏడాదే స్వగ్రామానికి వచ్చారు. అంతలోనే నెల వ్యవధిలో వారిద్దరూ చనిపోవడంతో ముగ్గురు పిల్లలు దిక్కులేనివారయ్యారు.. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.. ఉప్పునుంతల : సుమారు నాలుగేళ్లక్రితం మండల కేంద్రానికి చెందిన బొల్లె నర్సయ్య (40), చిట్టెమ్మ (35) దంపతులు హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఎనిమిది నెలలక్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చారు. కుమారులు ఆంజనేయులు, అ రుణ్ వంకేశ్వరం వసతి గృహంలో ఉంటూ తొమ్మిది, ఏడో తరగతి చదువుతున్నారు. గత ఏడాది కూతురు అనూష స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివింది. ఈ క్రమంలోనే గత నెల 20న కడుపునొప్పి బాధతో తండ్రి చనిపోయా డు. అప్పటి నుంచి తల్లి సరిగా తినక అనారోగ్యానికి గురైంది. చివరకు గురవారం అర్ధరాత్రి నిద్రలోనే మృతి చెందింది. దీంతో ముగ్గురు పిల్లలు దిక్కులేనివారయ్యారు. శుక్రవా రం ఉదయం బాధి త కుటుంబాన్ని ఎం పీపీ తిప్పర్తి అరుణ, తహశీల్దార్ సైదులు పరామర్శించారు. ఎంపీపీ, జెడ్పీటీసీ కట్టా సరిత తరఫున అ తని భర్త అనంతరెడ్డి *రెండు వేల చొప్పు న ఆర్థికసాయం అందజేశారు. వారికి త్వర లో క్వింటాలు బియ్యం ఇప్పిస్తానని, ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. కార్యక్రమం లో స్థానిక నాయకులు తిప్పర్తి నర్సింహా రెడ్డి, చింతగాళ్ల వెంకటయ్య, వీఆర్వో చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.