legal immigrants
-
ఒకరు వచ్చారు.. ఇంకొకరు వెళ్లారు.. భారత్-పాకిస్తాన్ ప్రేమకథలు..
ఇస్లామాబాద్: మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరమంటూ భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి ప్రయత్నంలో ఉన్నారు ఇరుదేశాల ప్రేమికులు. పాకిస్తాన్ నుంచి ఒక మహిళ పబ్జీ పరిచయంతో తాను ప్రేమించిన యువకుడి కోసం భారతదేశం వచ్చినట్టే భారత దేశం నుండి కూడా ఒక మహిళ లెక్క సరిచేస్తూ ప్రేమించిన యువకుడి కోసం ఇటు నుండి పాకిస్తాన్‌కు ప్రయాణమైంది. కాకపొతే పాకిస్తానీ మహిళ సీమా హైదర్ లా కాకుండా అన్ని డాక్యుమెంట్లు పక్కాగా సిద్ధం చేసుకుని ప్రణాళిక ప్రకారం వెళ్ళింది భారత మహిళ. ఒక పధ్ధతి.. ఒక ప్లానింగ్.. యూపీలోని కైలార్ గ్రామంలో పుట్టి పెరిగి రాజస్థాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో నివాసముంటున్న అంజు(34)కు పాకిస్తాన్ యువకుడు నస్రుల్లా(29)తో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. కొద్దిరోజులకి ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఎలాగైనా ప్రియుడిని కలవాలనుకుంది. అనుకుందే తడవు సాహసం చేసి సరిహద్దు దాటేసి డిర్ జిల్లాలోని పక్తుంక్వా చేరుకుని నస్రుల్లాను కలుసుకుంది. విషయం తెలుసుకున్న డిర్ పోలీసులు వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకుని సీనియర్ పోలీసు అధికారి ముస్తాక్ ఖాబ్ ఆధ్వర్యంలో అన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు. అంతా సక్రమంగా ఉందని తెలిసిన తర్వాతే వారిని విడిచిపెట్టారు. జైపూర్ వెళ్తున్నట్లు చెప్పి.. రాజస్థాన్ పోలీసులకు ఈ సమాచారమందడంతో వారు భివాడిలోని అంజు ఇంటికి వెళ్ళి ఆరా తీశారు. విచారణ సమయంలో అంజు భర్త అరవింద్ మాట్లాడుతూ.. మాకు 2007లో పెళ్లి జరగగా 15 ఏళ్ల పాప, 6 ఏళ్ల బాబు ఉన్నారని తెలిపారు. నా భార్యకు సోషల్ మీడియాలో పరిచయాలున్నాయని నాకు తెలియదు. గురువారం తాను స్నేహితురాలిని కలిసేందుకు జైపూర్ వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిందని తర్వాత తన చెల్లెలికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా లాహోర్ వెళ్లిన విషయం తెలిసిందన్నారు. ఎలాగైనా నా భార్యకు నచ్చజెప్పి తనను తిరిగి తీసుకొస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అరవింద్. అంతా సేమ్ టు సేమ్.. ఇటీవల పబ్జీలో పరిచయాన్ని ప్రేమగా మలచుకుని భారత్ వచ్చిన మహిళ సీమా హైదర్- సచిన్ మీనాల ప్రేమకి అంజు-నస్రుల్లా ప్రేమకి కొన్ని సారూప్యతలున్నాయి. ఇద్దరూ పెళ్ళై పిల్లలున్నవారే.. ఇద్దరి ప్రేమలకూ సోషల్ మీడియానే వేదిక.. పొందికగా పొరుగు దేశాల వారినే ప్రేమించారు. కాకపొతే సీమా హైదర్ చట్టవిరుద్ధంగా భారత దేశంలో అడుగుపెట్టగా అంజు మాత్రం పూర్తి చట్టబద్ధంగా పాకిస్తాన్ వెళ్ళింది. అదొక్కటే వ్యత్యాసం. ఇది కూడా చదవండి: కూతురు అబార్షన్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది! -
భారత్‌కు ట్రంప్ మరో షాక్!
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసా వేతన చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ దేశీయ ఐటీ కంపెనీలకు షాకిచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా మరో ఝలకిచ్చారు. అమెరికాకు వచ్చే లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను సగానికి తగ్గించే బిల్లును ఇద్దరు టాప్ యూఎస్ సెనేటర్లు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనతో దశాబ్దం లోపల అమెరికాకు వచ్చే ఇమ్మిగ్రెంట్లలో కోత పెట్టనున్నారు. సెనేటర్లు ప్రతిపాదించిన ఈ చట్టం అమెరికాలో గ్రీన్ కార్డు లేదా శాశ్వత నివాసాన్ని పొందాలనుకునే వారికి ప్రతికూలంగా మారనుంది. అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలని చాలామంది భారతీయులు ఆశిస్తుంటారు. వారిపై కూడా ఇది ఎఫెక్ట్ చూపనుంది. ''ది రిఫార్మింగ్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయిమెంట్ లేదా రైజ్ '' అనే యాక్ట్‌ను రిపబ్లికన్ సెనేటర్ టాక్ కాటన్, డెమొక్రాటిక్ పార్టీకి చెందిన డేవిడ్ పర్డ్యూలు ప్రతిపాదించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్‌లో మార్పులను తీసుకొస్తామని, నైపుణ్యంతో కూడిన వీసా లేని విదేశీయులను అమెరికాలో తగ్గిస్తామని పేర్కొన్నారు. ఇక ఇప్పటినుంచి ప్రతేడాది జారీచేసే గ్రీన్ కార్డు, న్యాయబద్ధమైన శాశ్వత నివాసాన్ని తగ్గించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. దీంతో గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న వేలకొద్దీ భారతీయులపై అతిపెద్ద ప్రభావమే చూపనుంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు మద్దతుగా ఈ బిల్లును సెనేటర్లు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం భారతీయులు గ్రీన్ కార్డు పొందాలంటే 10 ఏళ్ల నుంచి 35 ఏళ్లు వేచిచూడాల్సి వస్తోంది. ఒకవేళ ఈ బిల్లు కనుక చట్టంగా మారితే, మరింత కాలం గ్రీన్ కార్డు కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.