ఇది ఒక విచిత్ర కుటుంబానికి చెందిన కథ. వారు బాహ్యప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా బతికారు. ప్రపంచంలో ఏమి జరుగుతోందో వారికి ఏమాత్రం తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది. ఈ విషయం కూడా ఆ కుటుంబానికి తెలియదు. ఈ కుటుంబంలోని వారు సెర్బియాలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుడిసె వేసుకుని జీవించారు. వారిని ఒక శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఇది 1978 నాటి ఉదంతం.
ఖనిజ సంపదను అన్వేషించే ప్రయత్నంలో..
డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం భూవిజ్ఞాన శాస్త్రవేత్తల బృందం హెలికాప్టర్ ద్వారా సెర్బియాలోని దట్టమైన అడవులతో కూడిన ఒక ప్రాంతానికి వెళ్లింది. ఖనిజ సంపదను అన్వేషించే ఉద్దేశంతో వారి ప్రయాణం సాగింది. అనుకోని రీతిలో హెలికాప్టర్ పైలెట్ ఏదో నగరానికి 155 మైళ్ల దూరంలో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఒక ప్రాంతాన్ని గమనించాడు. అది మనుషులు ఉంటున్న ప్రాంతంగా అతనికి అనిపించింది.
6 వేల అడుగుల ఎత్తైన పర్వతంపై..
దీంతో శాస్త్రవేత్తల బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ వారికి ఈ విచిత్ర కుటుంబం కనిపించింది. కార్ప్ అనే వృద్దుడు, అతని నలుగురు పిల్లలు అక్కడ ఉన్నారు. ఆ వృద్ధుని భార్య అకులిన్ 1961లో విపరీతమైన చలి, ఆకలి కారణంగా మృతి చెందింది. ఈ కుటుంబం దట్టమైన అడవిలో 6 వేల అడుగుల ఎత్తున ఉన్న పర్వతంపై శాస్త్రవేత్తలకు కనిపించింది. ఇంత ఎత్తులో కేవలం ఎలుగుబంట్లు, తోడేళ్లు మొదలైన జంతువులు మాత్రమే జీవించగలవు.
ఇది కూడా చదవండి: నయా దోపిడీ: సాధువు వేషంలో పాములను మనుషులపైకి వదులుతూ..
రెండవ ప్రపంచ యుద్ధం గురించి..
ఆ కుటుంబం ప్రపంచంతో సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. రెండవ ప్రపంచయుద్ధం, టీవీ, ఆధునిక వైద్యం మొదలైనవాటి గురించి వారికి ఏమాత్రం తెలియదు. జియాలజిస్ట్ గలీనా పిస్మెన్స్కాయ ఇక్కడకు ఖనిజ పరిశోధన నిమిత్తం వచ్చారు. ఆయన ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ కుటుంబం గురించి తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ‘వారు ఎంతో భయస్తులుగా కనిపించారు. మేము ఆ వృద్దునికి నమస్కారం పెట్టాం. వెంటనే ఆ వృద్ధుడు ఏమీ స్పందించలేదు. తరువాత మెల్లగా మీరు ఇంత దూరం వచ్చారు. మీకు స్వాగతం అని అన్నాడు.
తాత్కాలిక గృహాన్ని నిర్మించుకుని..
ఆ వృద్దుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్టాలిన్ పాలనా కాలంలో 1936లో కమ్యూనిస్టులు అతని తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపేశారు. అనంతరం కార్ప్ లైకోవ్ తన భార్య 9 ఏళ్ల కుమారుడు సావిన్, రెండేళ్ల కుమార్తె నటాలియాలతో పాటు ఈ దట్టమైన అటవీ ప్రాంతానికి వచ్చాడు. వారు ఇక్కడ తాత్కాలిక గృహాన్ని నిర్మించుకున్నారు. ఇక్కడే కార్ప్ దంపతులకు 1940, 1943లలో మరో ఇద్దరు పిల్లలు కలిగారు. ఆ పిల్లలకు ఈ ప్రాంతానికి బయట మరోప్రాంతం ఉందని కూడా తెలియదు.
బయటకు రావాలని కోరినా..
శాస్త్రవేత్తలు ఆ కుటుంబ సభ్యులను తమతో పాటు తమ క్యాంపునకు తీసుకువెళ్లారు. అక్కడ వారి దగ్గరున్న పలు ఆధునిక పరికరాలను చూసి, ఆ కుటుంబ సభ్యులు తెగ ఆశ్చర్యపోయారు. 1981లో సావిన్, నటాలియాలు ఆహార సమస్యతో కిడ్నీలు ఫెయిలై మృతిచెందారు. మరో కుమార్తె నిమోనియాతో మృతి చెందింది. ఇలా ముగ్గురు సభ్యులు మరణించిన నేపధ్యంలో శాస్త్రవేత్తలు కార్ప్‌ను, అతని మరో కుమార్తెను ఆ అడవిని విడిచిపెట్టి బయటకు రావాలని కోరారు. అయితే అందుకు వారు నిరాకరించారు. 1988, ఫిబ్రవరి 16న కార్ప్ మృతి చెందాడు. ఈ ఏడాది మార్చి వరకూ అందిన సమాచారం ప్రకారం అతని కుమార్తె ఇంకా ఆ దట్టమైన అడవిలో ఒంటరిగానే ఉంటోంది.
ఇది కూడా చదవండి: నాడు సీమా, నేడు సానియా.. ప్రేమ కోసం తరలివస్తున్న ప్రియురాళ్లు!
Comments
Please login to add a commentAdd a comment