కీకారణ్యంలో.. మాయన్‌ నగర శిథిలాలు! అక్కడేం జరిగిందంటే? | National Institute Of Anthropology And History Scientists Find Mayan Civilization | Sakshi
Sakshi News home page

కీకారణ్యంలో.. మాయన్‌ నగర శిథిలాలు! అక్కడేం జరిగిందంటే?

Published Sun, Jun 23 2024 4:52 AM | Last Updated on Sun, Jun 23 2024 4:52 AM

National Institute Of Anthropology And History Scientists Find Mayan Civilization

నట్టడవిలో నగరం

దట్టమైన కీకారణ్యంలో పురాతన నగరం బయటపడింది. మెక్సికోలోని బాలంకు అభయారణ్యంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంత్రపాలజీ అండ్‌ హిస్టరీ శాస్త్రవేత్తలు అన్వేషణ జరుపుతుండగా, ఈ పురాతన మాయన్‌ నాగరికతకు చెందిన నగర శిథిలాలు బయటపడ్డాయి.

ఇక్కడ ‘ఓకోమ్టున్‌’ అనే పురాతన శిలా స్థూపాలు, భారీ రాతి భవంతులు కనిపించాయి. చుట్టూ దట్టంగా భారీ వృక్షాలతో కూడిన అడవి ఉండటంతో ఈ నగరం ఇన్నాళ్లూ ఎవరికీ కనిపించలేదు. ఇది క్రీస్తుశకం 250–800 సంవత్సరాల మధ్య కాలానికి చెందినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ నగరం 123 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ 50 అడుగుల ఎత్తున పిరమిడ్‌ నిర్మాణాలు, నివాస భవనాలు, బహిరంగ వేదికలు వంటివి ఉన్నాయి. ఈ వేదికలను మతపరమైన వేడుకల కోసం నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇవి చదవండి: వానల్లో వార్మ్‌గా, బ్రైట్‌గా.. ఉండాలంటే ఇలా చేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement