న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2020ను కేంద్ర ప‌్రభుత్వం గురువారం విడుదల చేసింది. నగరాల్లో జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులకు అనుగుణంగా ఈ ర్యాంకులను కేటాయించింది. మిలియన్‌కు(10 లక్షల) పైగా జనాభా ఉన్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. ఆ తరువాతి స్థానాల్లో పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి. అయితే 13వ స్థానంలో ఢిల్లీ, 15వ స్థానంలో విశాఖ ఉంగా హైదరాబాద్ 24వ స్థానంలో నిలిచింది. మొదటి పది స్థానాల్లో ఉన్న నగరాలు ఒకసారి చూస్తే..
1. బెంగళూరు
2. పుణె
3. అహ్మదాబాద్
4. చెన్నై
5. సూరత్
6. నవీ ముంబై
7. కోయంబత్తూర్
8. వడోదర
9. ఇండోర్,
10. గ్రేటర్ ముంబై ఉన్నాయి
అదే విధంగా 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల్లో సిమ్లాకు టాప్ ప్లేస్‌లో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్, సిల్వాసా, కాకినాడ, సేలం, గాంధీనగర్, గురుగ్రామ్, దేవన్‌గిరి, తిరుచిరాపల్లి ఉన్నాయి. దీనికి సంబంధించి 2020లో సర్వే నిర్వహించారు. మొత్తంగా 111 నగరాలు ఇందులో పాల్గొన్నాయి. పట్టణాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, మెరుగైన జీవన ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించినట్లు పీఐబీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
చదవండి: పేరెంట్స్‌తో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న ఢిల్లీ సీఎం
Comments
Please login to add a commentAdd a comment