Lives in airport for 14 years Says family interferes: ఏవోవే చిన్న చిన్న కారణాలతో కుటుంబంతో గొడవపడి ఇంటి నుంచి బయటకి వచ్చేసి నానాపాట్లు పడుతున్నవారు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా మాటమాట పెరిగి కోపంతో బయటకు వచ్చి అనాధలుగా బతుకు వెళ్లదీసేవాళ్లు కోకొల్లలు. మరికొంతమంది చెడుమార్గంలో పయనించి తమ జీవితాలను నాశనం చేసకున్నావాళ్లు ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడోక వ్యక్తి ఇంటి నుంచి వచ్చేసి 14 ఏళ్లు అయ్యింది. అతను ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడో? ఎందుకు వచ్చేశాడో తెలుసా?
వివరాల్లోకెళ్తే...వీ జియాంగువో అనే చైనీస్ వ్యక్తి బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్‌లోనే 14 ఏళ్లుగా నివసిస్తున్నాడు. అయితే అతనికి డ్రింక్ చేయడం, సిగరెట్ కాల్చడం వంటి చెడు అలవాట్లు ఉన్నాయి. అంతేగాదు అతను ఆ చెడు అలవాట్లకు బానిసై పోవడంతో అతని కుటుంబం అతన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో కాస్త కఠినంగా వ్యవహరించింది.
ఈ మేరకు అతని కుటుంబం అతనికి ఒక షరతు కూడా పెట్టింది. అతను కుటుంబంలో ఉండాలనుకుంటే చెడు అలవాట్లను వదిలేయాలని ఒకవేళ అలా చేయలేకపోతే తన నెలవారి జీతం రూ.12 వేలు ఇచ్చేయాలని ఒక షరతు విధించారు. అలా ఇచ్చేస్తే తాను సిగరెట్, మందు కొనుక్కోవడం కష్టం అవుతుందని ఇంటి నుంచి వచ్చేశానని చెప్పాడు. 40 ఏళ వయసులో తనను ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పుకొచ్చాడు. వృద్ధాప్యం కారణంగా తనకు మళ్లీ ఉపాధి లభించలేదని వీ చెప్పుకొచ్చాడు. అయితే అతను లాంటి మరో ఆరుగురు వ్యక్తులు ఆ టెర్మినల్‌లోనే నివశిస్తున్నారు.
(చదవండి: మొసలితో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి... వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment