భారత టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో అదరగొడుతున్నాడు. ససెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు 717 పరుగులు సాధించాడు. పుజారా ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా కౌంటీల్లో నిలకడగా రాణిస్తున్న పుజారా తిరిగి భారత టెస్టు జట్టులోకి వస్తాడని టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు." టీమిండియా ఇంగ్లండ్‌లో ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. గతేడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు, న్యూజిలాండ్ ఇంగ్లండ్‌లో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. కాబట్టి వారు అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డారు. దీంతో సౌతాంప్టన్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది.
ఇప్పడు పుజారా కూడా అదే చేస్తున్నాడు. అక్కడ పరిస్థితుల్లో, ఇంగ్లండ్ బౌలర్లకు తిరేకంగా బ్యాటింగ్ చేయడం అలవాటు చేసుకున్నాడు. అయితే కౌంటీ పేస్ అటాక్‌కి, టెస్ట్ బౌలింగ్‌కు చాలా తేడా ఉంటుంది. అయితే ఒక బ్యాటర్ రిథమ్‌లో ఉన్నప్పుడు అదేం పెద్ద సమస్య కాదు. అతడు మళ్లీ తిరిగి భారత టెస్టు జట్టులోకి వస్తాడన్న నమ్మకం నాకు ఉంది" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: పుజారా కౌంటీ ఫామ్‌పై ఆసక్తికర ట్వీట్ చేసిన టీమిండియా మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment