ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో టీమిండియా తడబడుతుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఏంచుకున్నప్పటికి ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి స్టంపౌట్ రూపంలో పెవిలియన్ చేరగా.. గిల్ 21 పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక పుజారా నాలుగు బంతులు ఎదుర్కొన్న అనంతరం లియోన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలోనే పుజారా ఒక చెత్త రికార్డును తన పేరిట లఖించుకున్నాడు.
ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన జాబితాలో చేరిపోయాడు. నాథన్ లియోన్ పుజారాను ఔట్ చేయడం ఇది 12వ సారి. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా పుజారాను 12 సార్లు ఔట్ చేయడం విశేషం. ఇంతకముందు సునీల్ గావస్కర్ అండర్‌వుడ్ చేతిలో 12 సార్లు ఔటయ్యాడు. టీమిండియా తరపున సునీల్ గావస్కర్ తర్వాత ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన రెండో క్రికెటర్‌గా పుజారా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment