వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. అయితే విండీస్‌తో టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో సీనియర్ బ్యాటర్, నయావాల్ ఛతేశ్వర్ పూజారాకి చోటు దక్కలేదు. అదే విధంగా ఐపీఎల్‌లో అదరగొట్టిన యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌కు సెలక్టర్లు టెస్టు జట్టులో అవకాశం ఇచ్చారు.
అయితే టెస్టు క్రికెట్‌లో నయావాల్‌గా పేరుగాంచిన పూజారాను పక్కన పెట్టడాన్ని చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చాలా మంది భారత ఆటగాళ్లు విఫలమైనా పూజారాని మాత్రం ఎందుకు బలిపశువు చేశారంటూ గవాస్కర్ మండిపడ్డాడు.
"పుజారాను జట్టు నుంచి ఎందుకు తప్పించారు? టీమిండియా బ్యాటింగ్ యూనిట్ మొత్తం ఫెయిల్ అయినప్పుడు అతన్ని మాత్రం ఎందుకు బలిపశువుని చేశారు? పుజారా భారత క్రికెట్‌కు ఎన్నో ఏళ్లగా తన సేవలు అందిస్తున్నాడు. అతడు సైలెంట్‌గా ఉండి భారత జట్టును ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు.
కేవలం అతనికి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు లేరనే ఉద్దేశంతోనే పూజారాని తప్పించారని అనిపిస్తోంది. సరే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో పుజారా సరిగ్గా ఆడలేదని జట్టు నుంచి తప్పించారు.. మరి మిగితా ఆటగాళ్లు కూడా ఫెయిలయ్యారు కదా వారి పరిస్ధితి ఏంటి? అయినా జట్టును ప్రకటించేటప్పుడు సెలక్షన్ కమిటీ, మీడియా సమావేశం ఎందుకు పెట్టడం లేదో నాకు ఆర్ధం కావడం లేదు.
పుజారా గత కొంత కాలంగా కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. కాబట్టి అతడి రెడ్‌బాల్ క్రికెట్‌లో మరింత అనుభవం పెరిగింది. రెడ్‌బాల్ క్రికెట్‌పై అతడికి పూర్తి అవగహన ఉంది. ప్రస్తుతం ఫిట్‌నెస్ ఉంటే 39-40 సంవత్సరాల వయస్సు వరకు ఆడవచ్చు.
పూజారాకి కూడా నాలుగైదేళ్ల కెరీర్ ఉంది. అజింకా రహానే మినహా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఏ బ్యాటర్ కూడా సరిగా ఆడలేదు. అయినా కేవలం పుజారాను మాత్రమే ఎందుకు బలిచేశారో సెలక్టర్లు సమాధానం చెప్పాలంటూ" స్పోర్ట్స్ టూడేతో మాట్లాడుతూ సన్నీ ఫైరయ్యాడు.
చదవండి: Ind Vs WI 2023: 'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్‌తోనే కానిచ్చేయండి!'
Comments
Please login to add a commentAdd a comment