ఛతేశ్వర్ పుజారా
Cheteshwar Pujara- Ind Vs WI test Series: వెస్టిండీస్‌తో సిరీస్ నేపథ్యంలో టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారాకు మొండిచేయి ఎదురైంది. విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టుతో జట్టులోకి తిరిగి వచ్చిన పుజారా బంగ్లాదేశ్ సిరీస్‌లోనూ ఆడాడు.
కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు
ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగమయ్యాడు. ఈ క్రమంలో ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 140 పరుగులు చేయగలిగాడు. అనంతరం ఇంగ్లండ్‌లో కౌంటీల్లో ఆడిన పుజారా ససెక్స్ జట్టు నాయకుడిగా వ్యవహరించాడు. అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ 8 ఇన్నింగ్స్‌లో 3 సెంచరీల సాయంతో.. 545 పరుగులతో అదరగొట్టాడు.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఛతేశ్వర్ అదరగొట్టడం ఖాయమని అభిమానులు సంబరపడిపోయారు. కానీ గుజరాత్ బ్యాటర్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో తుస్సు
ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డు కలిగి ఉన్న పుజారా.. ఓవల్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకు పరిమితమై వైఫల్యం కొనసాగించాడు. దీంతో అతడికి భారీ షాకిచ్చారు టీమిండియా సెలక్టర్లు.
విండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. అదే సమయంలో.. మరో వెటరన్ బ్యాటర్, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆకట్టుకున్న అజింక్య రహానేకు మాత్రం ఈ సిరీస్‌తో మరోసారి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కింది.
విండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
చదవండి: ఎన్నాళ్లో వేచిన ఉదయం! ఈసారి మా ఆశలు వమ్ము చేయొద్దు ప్లీజ్!
అప్పుడు జట్టులో చోటే కరువు.. ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా.. నువ్వు సూపర్ ‘హీరో’!
ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్‌పై అశ్విన్ విసుర్లు!
Comments
Please login to add a commentAdd a comment