ఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం నిర్వహించిన పరీక్షల్లో ఆస్ట్రేలియా క్రికెటర్‌కు కరోనా నెగెటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. వైరస్ నుంచి కోలుకుంటున్న సమయంలో తాజాగా మంగళవారం మళ్లీ పాజిటివ్ రావడంతో మరికొన్ని రోజులు హస్సీ భారత్‌లోనే ఉండాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ ఆసీస్ మాజీ ఆటగాడు చెన్నైలోని ఓ హోటల్లో ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకుంటున్నాడు. హస్సీతో పాటు చెన్నై బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ క్లీనర్‌కు మే 3న కరోనా సోకింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. కాగా ఈ సీజన్లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.
చదవండి: ఇండియా గురించే ఆలోచిస్తున్నా: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment