courtesy : IPL/KKR
అహ్మదాబాద్: కేకేఆర్ స్టార్ బౌలర్.. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ కరోనా బాధితుల కోసం 50వేల ఆస్ట్రేలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, లివింగ్ స్టోన్, ఆండ్రూ టై లాంటి విదేశీ ఆటగాళ్లు బయోబబుల్‌లో ఉండలేమంటూ లీగ్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్‌ను నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై పాట్ కమిన్స్ స్పందించాడు.
''మేము ఐపీఎల్ ఆడుతున్నామంటే ఇక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామనేది మాకు తెలుసు. బయోబబుల్‌లో ఉంటూ క్రికెట్ ఆడడం మాకు అలవాటుగా మారిపోయింది. అయినా మేము రోజు మూడు నుంచి నాలుగు గంటలపాటు మాత్రమే మైదానంలో ఉంటూ ఆటలో మజాను అందిస్తున్నాం. బయట కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలంతా ఇంట్లోనే ఉంటూ ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. మా వల్ల వారికి హాని జరగకపోగా.. మేలు జరుగుతుంది. ఒక రోజులో మూడు నాలుగు గంటల పాటు మా ఆటను ఎంజాయ్ చేస్తూ టీవీలకే అతుక్కుపోతున్నారు. సమస్య ఇంకెక్కడ ఉంది. మేం చేస్తున్న ఈ పనికి ఐపీఎల్‌ను ఆపాలని చెప్పడం కరెక్ట్ కాదు'' అని చెప్పుకొచ్చాడు.
కాగా పాట్ కమిన్స్ ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2020 ఐపీఎల్ వేలంలో కమిన్స్‌ను రూ. 16 కోట్లకు కేకేఆర్ కొనులు చేసింది. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడి 82 పరుగలతో పాటు 4 వికెట్లు తీశాడు. ఇక సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సిక్సర్ల జడివాన సృష్టించిన కమిన్స్ ఒకదశలో కేకేఆర్‌ను విజయంవైపు నడిపించాడు. ఆ మ్యాచ్‌లో కమిన్స్ కేవలం 34 బంతుల్లోనే కమిన్స్ 66 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
చదవండి: చప్పట్లు సరిపోవు.. ఘనంగా సత్కరించండి
Comments
Please login to add a commentAdd a comment