కరీబియన్ దీవులు, యూఎస్‌ఏ వేదికలుగా ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత క్రికెట్ జట్టును ఈ నెలాఖరులోగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో ప్రదర్శనల ఆధారంగా పలు ఎంపికలు ఉంటాయని తెలుస్తుంది.
ప్రముఖ వార్త సంస్థ కథనం మేరకు.. భారత సెలెక్టర్లు 20 మందితో కూడిన భారత జట్టును ఇదివరకే ఎంపిక చేశారని సమాచారం. ఇందులో 15 మంది రెగ్యులర్ సభ్యులు ఉండగా.. ఐదుగురు స్టాండ్ బైలు అని తెలుస్తుంది. అందరూ ఊహించిన విధంగానే ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. సీనియర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకున్నారని సమాచారం.
ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు విధ్వంకర వీరులు శివమ్ దూబే, రింకూ సింగ్‌లు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకన్నారని తెలుస్తుంది. భారత వరల్డ్‌కప్ జట్టుపై ఇది కేవలం ప్రచారం మాత్రమే. అధికారిక ప్రకటన వెలుడాల్సి ఉంది.
టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు (నివేదికల ప్రకారం)..
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment