చెట్టెక్కిన అభిమానం.. జడుసుకున్న టీమిండియా క్రికెటర్లు | Man Sitting On The Tree Scared Indian Players During T20 World Cup 2024 Winning Parade, Video Viral | Sakshi
Sakshi News home page

Team India Victory Parade: చెట్టెక్కిన అభిమానం.. జడుసుకున్న టీమిండియా క్రికెటర్లు

Published Fri, Jul 5 2024 8:18 AM | Last Updated on Fri, Jul 5 2024 12:09 PM

Man Sitting On The Tree Scared Indian Players During T20 World Cup 2024 Winning Parade

టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్‌ నిరీక్షణకు తెరదించుతూ యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌ విజయానంతరం భారత క్రికెట్‌ జట్టు నిన్న ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది. 11 ఏళ్ల అనంతరం ఐసీసీ ట్రోఫీ సాధించడంతో భారత క్రికెట్‌ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. 

టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్‌ పెరేడ్‌లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధుల టీమిండియా క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి. విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్‌ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్‌ టాప్‌ బస్‌ నుంచి జనాలకు అభివాదం చేశారు. 

అయితే ఈ విన్నింగ్‌ పరేడ్‌లో ఓ ఘటన అందరి దృష్టిని ఆకర్శించింది. ఓ అభిమాని భారత క్రికెటర్లను దగ్గరి నుండి చూసేందుకు చెట్టెక్కాడు. సదరు అభిమాని ఎంచక్కా చెట్టు కొమ్మపై పడుకుని సెల్‌ఫోన్‌తో భారత క్రికెటర్ల ఫోటోలు తీసుకున్నాడు. అభిమానిని సడెన్‌గా చూసిన భారత క్రికెటర్లు ఒక్కసారిగా జడుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమాని చేసిన రిస్క్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. లక్కీ ఫెల్లో.. టీ20 ప్రపంచకప్‌ను, వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ హీరోలను దగ్గరి నుండి చూశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, భారత క్రికెటర్ల వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ పరేడ్‌ మెరైన్‌ రోడ్‌ గుండా వాంఖడే స్టేడియం వరకు సాగింది. అనంతరం వాంఖడేలో బీసీసీఐ భారత క్రికెటర్లను సన్మానించింది. ఇదిలా ఉంటే, జూన్‌ 29 జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2024 ఫైనల్లో భారత్‌.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement