
న్యూఢిల్లీ: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ప్రపంచ కప్ ఆల్ స్టార్స్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. ఈ జాబితాలో ఐదుగురు టీమిండియా సభ్యులకు చోటు దక్కింది. అయితే, వికెట్ కీపర్‌గా భారత వెటరన్ మహేంద్ర సింగ్ ధోనికి బదులుగా ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను సచిన్ ఎంచుకున్నాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లి సహా మెగా టోర్నీ టాప్ స్కోరర్ రోహిత్ శర్మ, పేసర్ బుమ్రా, ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు అతడు స్థానం కల్పించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఈ జట్టుకు సారథిగా ఉన్నాడు. సచిన్ వరల్డ్ కప్ జట్టు సభ్యులు: రోహిత్ శర్మ, బెయిర్‌స్టో (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), కోహ్లి, షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, జస్‌ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్.
Comments
Please login to add a commentAdd a comment