విరాట్ కోహ్లి మరో 135 పరుగులు చేస్తే ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడవుతాడు. అశ్విన్ మరో 9 వికెట్లు పడగొడితే ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఇవి మన స్టార్ ఆటగాళ్లు చేరుకోగలిగే మైలురాళ్లు. భారత్ గెలిస్తే తొలిసారి ఇంగ్లండ్‌ను 4–0తో చిత్తు చేసినట్లవుతుంది. 2011 నాటి సిరీస్ ఓటమికి లెక్క సరిపోతుంది. భారత టెస్టు చరిత్రలో రెండోసారి ప్రత్యర్థిని 4–0తో ఓడించిన జట్టుగా కోహ్లి సేన నిలుస్తుంది. మ్యాచ్ గెలిచినా, ‘డ్రా’ అయినా మన జట్టు వరుసగా 18వ మ్యాచ్‌ను ఓటమి లేకుండా ముగించిన కొత్త రికార్డు నమోదవుతుంది.