లక్ష్యం పెద్దది... కాబట్టి గెలవడం సాధ్యం కాదు... 53 ఓవర్ల పాటు నిలబడితే మ్యాచ్‌ను డ్రా చేసుకోవచ్చు. తొలి ఇన్నింగ్‌సలో అందరూ బాగానే ఆడారు... అటు ఐదో రోజు ఉదయం సెషన్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కూడా బాగా ఆడారు. కాబట్టి ఇది అసాధ్యమేమీ కాదు... ఇలాంటి స్థితిలో రెండో ఇన్నింగ్‌స మొదలుపెట్టిన భారత్... వరుసగా వికెట్లు కోల్పోతూ ఓ దశలో ఓటమి ప్రమాదంలో పడింది. నమ్ముకున్న బ్యాట్స్‌మెన్ అంతా నిరాశపరిచినా... అశ్విన్, జడేజాల సహకారంతో కోహ్లి పోరాడటంతో భారత్ గట్టెక్కింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టును డ్రా చేసుకుని టీమిండియా ఊపిరి పీల్చుకుంది.