
మరో 36 పరుగులు చేస్తే...
► అరుదైన రికార్డు కుక్ సొంతం
► నేటి నుంచి లంకతో తొలి టెస్టు
లీడ్స్: మరో 36 పరుగులు చేస్తే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ అలిస్టర్ కుక్... టెస్టుల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కుతాడు. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా సచిన్ రికార్డునూ అధిగమిస్తాడు. ఈ నేపథ్యంలో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్... శ్రీలంకతో తలపడుతుంది. గతంలో సచిన్ 31 ఏళ్ల 10 నెలల వయసులో పాకిస్తాన్ (2005)పై ఈ రికార్డును సాధించాడు. గతేడాది క్రిస్‌మస్‌తో కుక్‌కు 31 ఏళ్లు నిండాయి.