
కుక్ డబుల్ సెంచరీ
అబుదాబి: పాకిస్తాన్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. కుక్(397 బంతుల్లో 201 బ్యాటింగ్, 16 ఫోర్లు), రూట్(76 బ్యాటింగ్) కూడా రాణించడంతో ఇంగ్లండ్ 144.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 405 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. 290/3 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ మరో వికెట్ పడకుండా పాకిస్థాన్ కు దీటుగా బదులిస్తోంది. మూడో రోజు 168 పరుగులతో అజేయంగా ఉన్న కుక్.. ఈరోజు కూడా పాకిస్థాన్ బౌలర్లకు పరీక్షగా నిలిచి ద్విశతకాన్ని నమోదు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో వాహబ్ రియాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇంకా ఇంగ్లండ్ 118 పరుగులు వెనుకబడిఉంది.
అంతకుముందు పాకిస్థాన్ ఎనిమిది వికెట్ల నష్టానికి 523 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ డబుల్ సెంచరీ(245)తో రాణించి జట్టు భారీ స్కోరులో సహకరించాడు. ఆటకు రేపు మాత్రమే మిగిలి ఉండటంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.