
తియ్యటి పండుగలు
వరలక్ష్మీ వ్రతం, రాఖీ... రెండు పర్వదినాలు ...
ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఏతెంచేందుకు సిద్ధంగా, సన్నద్ధంగా ఉన్నాయి...
అమ్మవారికి నైవేద్యం పెడదాం... అన్నదమ్ముల నోరు తీపిచేద్దాం...
అమ్మవారి ఆశీర్వాదాలు... అన్నదమ్ముల ఆదరాభిమానాలు అందుకుందాం...
ఇక ఆలస్యం దేనికి, వంటకాలకు కావలసిన పదార్థాలు సిద్ధం చేసుకోండి...
ఈ మధురపదార్థాలు తయారుచేయండి...
పండుగలను తియ్యగా ఆస్వాదించ ండి...
రబ్రీ స్వీట్
కావలసినవి: చిక్కటి పాలు - లీటరు; పంచదార - పావు కప్పు; బాదం పప్పులు - 7; పిస్తా పప్పులు - 7; కుంకుమ పువ్వు - కొద్దిగా; ఏలకుల పొడి - చిటికెడు; రోజ్ ఎసెన్స్ - 4 చుక్కలు
తయారీ: వెడల్పాటి బాణలిలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మధ్యస్థం మంట మీద మరిగించాలి మరగడం ప్రాంభం కాగానే మంట సిమ్‌లో ఉంచి, పాలు బాగా చిక్కబడి, పాలు నాలుగో వంతు వచ్చేవరకు కలుపుతుండాలి బాదం పప్పులు, పిస్తా పప్పులను చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి కుంకుమ పువ్వును చల్లటి పాలలో నానబెట్టాలి మరుగుతున్న పాలలో పంచదార, ఏలకుల పొడి వేసి ఆపకుండా కలపాలి నానబెట్టుకున్న కుంకుమపువ్వు పాలు జత చేయాలి బాదం పప్పులు, పిస్తా పప్పులను జత చేసి, బాగా కలిపి దించేయాలి చల్లారాక రోజ్ ఎసెన్స్ వేసి గిలక్కొట్టాలి ఫ్రిజ్‌లో సుమారు ఎనిమిది గంటలు ఉంచి తీశాక, డ్రైఫ్రూట్స్ తురుముతో అలంకరించి అందించాలి.
అరటిపండు అప్పాలు
కావలసినవి:
బాగా పండిన అరటిపండు - 1;
గోధుమ పిండి - కప్పు; బెల్లం తురుము - కప్పు; ఎండు కొబ్బరి తురుము - పావు కప్పు; నెయ్యి - టేబుల్ స్పూను; ఏలకుల పొడి - అర టీ స్పూను; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ: అరటిపండును మెత్తగా గుజ్జు చేయాలి ఒకపాత్రలో గోధుమ పిండి, అరటిపండు గుజ్జు, ఎండు కొబ్బరి తురుము, ఏలకుల పొడి, బెల్లం తురుము, నెయ్యి వేసి చపాతీ పిండిలా కలపాలి చేతికి నెయ్యి కాని నూనె కాని రాసుకుని పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి బాణలిలో నూనె కాగాక ఈ ఉండలను చేతిలోకి తీసుకుని గుండ్రంగా అప్పాల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి.
కొబ్బరి పాల పాయసం
కావలసినవి: బియ్యం - అర కప్పు; బెల్లం తురుము - కప్పు; తాజా కొబ్బరి ముక్కలు - ముప్పావు కప్పు; పాలు - పావు కప్పు (మరిగించాలి); ఏలకుల పొడి - అర టీ స్పూను; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు - 10; కిస్‌మిస్ - టేబుల్ స్పూను; బేకింగ్ సోడా - చిటికెడు
తయారీ: బియ్యం శుభ్రంగా కడిగి కప్పుడు నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చాక దించేయాలి కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి ముప్పావు కప్పు గోరు వెచ్చని నీళ్లు జత చేసి, మరో మారు మిక్సీ తిప్పాలి పల్చటి వస్త్రంలో కొబ్బరి పాలను వడకట్టి, కొబ్బరిని మళ్లీ మిక్సీలో వేసి ముప్పావు కప్పు నీళ్లు జత చేసి మరో మారు మిక్సీ పట్టాలి మళ్లీ ఆ పాలను వడ కట్టాలి ఈ పాలకు బేకింగ్ సోడా జత చేసి పక్కన ఉంచాలి అన్నంలో బెల్లం తురుము, కొబ్బరి పాలు వేసి స్టౌ మీద ఉంచాలి పాలు, ఏలకుల పొడి జత చేసి బాగా కలిపి సన్న మంట మీద సుమారు పది నిమిషాలు ఉంచాలి మిశ్రమం చిక్కబడుతుండగా దింపేయాలి నెయ్యి కరిగించి, అందులో జీడిపప్పులు, కిస్‌మిస్ వరుసగా వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, తయారు చేసి ఉంచుకున్న పాయసంలో వేసి కలపాలి వేడివేడిగా అందించాలి.
బాదం కోవా
కావలసినవి: బాదం పప్పులు - కప్పు; పంచదార - ముప్పావు కప్పు; పాల పొడి - అర కప్పు; నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - చిటికెడు; ఫుడ్ కలర్ - చిటికెడు; తురిమిన పిస్తా, బాదం, జీడిపప్పులు - తగినన్ని
తయారీ: బాదం పప్పులను నీళ్లలో సుమారు అరగంటసేపు నానబెట్టి, తొక్క తీసి, మిక్సీలో వేసి, కొద్దిగా పాలు జత చేసి మెత్తగా చేయాలి పంచదార, పాల పొడి జత చేసి మరోమారు బ్లెండ్ చేయాలి ఒక పాత్రలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి తయారుచేసి ఉంచుకున్న బాదం పేస్ట్ ఇందులో వేసి ఆపకుండా చిక్కబడేవరకు కలుపుతుండాలి ఏలకుల పొడి, ఫుడ్ కలర్ జత చేసి బాగా కలిపి, ఉడికిన తర్వాత దించేయాలి చెక్క గరిటెతో సుమారు ఐదు నిమిషాలు కలపాలి ముద్దగా అయిన తర్వాత కోవా ఆకారంలో తయారుచేసుకుని పైన పిస్తా, బాదం, జీడిపప్పు తురుముతో అలంకరించి కొద్దిగా గట్టిపడ్డాక అందించాలి.