
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఎన్నో అనుమానాలు బయలుదేరిన విషయం తెలిసిందే. ఆయనది ఆత్మహత్య కాదు, హత్య అని ఎంతోమంది బలంగా విశ్వసిస్తున్నారు. సుశాంత్ చావుకు ఆయన ప్రేయసి రియా చక్రవర్తి, బాలీవుడ్ సెలబ్రిటీలే కారణమన్న వాదన కూడా ఉంది. అయితే చాలామంది అనుకున్నట్టుగా సుశాంత్‌ది హత్య కాదని ఆయన వంట మనిషి నీరజ్ స్పష్టం చేశారు. ఆయనపై హత్య జరిగే అవకాశమే లేదని వెల్లడించారు. శుక్రవారం నీరజ్ మీడియాతో మాట్లాడుతూ.. "సుశాంత్‌ది హత్య కాదు, ఆత్మహత్య. నేను కింద ఉన్నప్పుడు ఆయన గదికి గడియ పెట్టుకున్నాడు. కానీ, సాధారణంగా ఆయనకు గడియ పెట్టుకునే అలవాటే లేదు. ఐదు నిమిషాల తర్వాత నేను ఆయన గది దగ్గరకు వెళ్లి ఏం వండమంటారని అడిగాను. అటు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు" (రియాకు షాక్ : ‘విజయానికి తొలి అడుగు’ )
"అయితే ఆ సమయంలో ఒకవేళ హత్య జరిగి ఉంటే ఎవరైనా వచ్చిపోవడాన్ని నేను చూసేవాడిని, ఆయన్ను చంపకుండా అడ్డుకునే వాడిని. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇక గది బెల్ కొట్టినా కూడా తలుపు తీయకపోతే ఆయన పడుకున్నాడేమో అని డిస్టర్బ్ చేయలేదు. ఆ తర్వాత ఎంతసేపటికి సమాధానం లేకపోవడంతో మాకు అనుమానం వచ్చింది. వెంటనే నేను, సిద్ధార్థ్ పితానీ, దీపేశ్ గది తలుపు బద్ధలు కొట్టి లోనికి వెళ్లాం. అయితే అక్కడున్న దృశ్యం చూసి మేము షాక్‌కు గురయ్యాం. సుశాంత్ ఫ్యాన్‌కు ఉరేసుకుని విగతజీవిగా కనిపించారు" అని పేర్కొన్నారు. కాగా సుశాంత్ జూన్ 14న ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు గూగుల్‌లో తన పేరుతో పాటు మరణం గురించి, మానసిక సమస్యల గురించి కూడా వెతికారు. ఇదిలా వుండగా సుశాంత్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. విచారణలో భాగంగా సీబీఐ అధికారులు సుశాంత్ ఇంటి పనిమనిషిని విచారిస్తున్నారు. (అమీర్, అనుష్క ఎందుకు నోరు విప్పలేదు?)
Comments
Please login to add a commentAdd a comment