మంచి రుచికరంగా వంట చేయడం ఓ కళ. అయితే ఇప్పుడూ చాలా విభిన్నమైన కొత్త కొత్త రుచులు వచ్చేస్తునన్నాయి. అంతా వాటిని ట్రై చేస్తున్నారు కూడా. అయితే రుచికి మాత్రమే కాదు, వండే విధానానికి కూడా ప్రాధాన్యం ఇవ్వమని హెచ్చరిస్తోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్). వండేటప్పుడూ మూత పెట్టకుండా వండితే ఇక అంతే సంగతులను గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. దీని వల్ల ఎక్కవసేపు మంటమీద ఉడికించాల్సి రావడమే గాక ఆరోగ్యానికి హనికరమని చెబుతుంది. ఎలా వండితే మంచిదో కూడా వెల్లడించింది. అవేంటో సవివరంగా చూద్దామా..!
ఓపెన్ మూత వర్సెస్ క్లోజ్డ్ వంట:
మూత పెట్టి కూరలు వండితే సమయం ఆదా అవ్వడమే గాక పోషకాల నష్టం కూడా ఉండదని చెబుతోంది. అదే మూత లేకుండా వండితే..ఎక్కువసేపు పట్టడమేగాక ఆహార పదార్థాలు ఎక్కువ సేపు ఉష్ణోగ్రతలోనే ఉడకటంతో పోషకల నష్టం జరుగుతుందని హెచ్చరిస్తోంది. అలాగే మూత పెట్టి వండే వంటలో త్వరితగతిన వండేయగలం, మంచి పోషకవంతంగా ఉంటుందని చెబుతోంది. ముఖ్యంగా ఆకుపచ్చ కూరలను మూతపెట్టి వండితే కూర రంగు మారి, పోషకాల నష్టాన్ని తగ్గిస్తుందని వెల్లడించింది.
ఆరోగ్యకరమైన వంట పద్ధతులు..
పప్పు దినులు పోషక నాణ్యత ఉండాలంటే మూత పెట్టి ఉడకించడం లేదా ప్రెజర్ కుక్కర్‌లో వంట చేయడం ఉత్తమం అని చెబుతోంది. అంటే మూతపెట్టి ప్రెజర్‌లో తగు మోతాదులో ఉడకించడం వల్ల పోషకాల నష్టం జరగకుండా కాపాడటమే గాక తొందరగా ఉడికిపోతాయి. పైగా ఆయా ఆహారపదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి. అదీగాక ఇలా వంట చేయడం వల్ల ఆయా పదార్థాల ఆకృతిమారి, రుచికరంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి కూడా. దీని వల్ల హానికరమైన సూక్ష్మజీవులు ప్రమాదం కూడా ఉండదని, ఆహారం కలుషితం కాదని ఐసీఎంఆర్ పేర్కొంది.
మైక్రోవేవ్‌లో వంట మంచిదేనా..
ఇక్కడ మైక్రోవేవ్ కూడా త్వరితగతిన వండేస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. ఎక్కువసేపు మంట మీద ఉడకించే పద్ధతులతో పోలిస్తే పోషకాలు విచ్ఛిన్నం కాకుండా తక్కవ టైంలోనే త్వరితగతిన వండేసే పద్ధతులు బెటర్ అని చెప్పకనే చెప్పింది. మైక్రోవేవ్‌లో తక్కువ టైంలోనే ఆహార పదార్థాలు ఉడికిపోతాయి కాబట్టి విటమిన్‌లు, ఇతర పోషకాలు నష్టపోకుండా చేయడంలో సహాయ పడుతుందని ఐసీఎంఆర్ మార్గదర్శకాల్లో పేర్కొంది.
(చదవండి: రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్‌గా..! ఇంటర్ ఫెయిల్ అవ్వడమే..!)
Comments
Please login to add a commentAdd a comment