నవ్వింత: పేదకుటుంబం అంటే...
ఒక ధనవంతుడి కొడుకుని స్కూల్‌లో ‘పేదకుటుంబం’ అనే విషయం మీద వ్యాసం రాయ మన్నారు. అతడు ఇలా రాయసాగాడు. ‘‘అనగనగా ఓ బీద కుటుంబం. తండ్రి చాలా బీదవాడు. తల్లి కూడా ఎంతో పేదది. వాళ్ల పిల్లలు కూడా అంతే. పాపం వాళ్ల కారు డ్రైవరు, వంటమనిషి, తోటమాలి... అంతా పేదవాళ్లే. చివరకు వాళ్లింట్లో పనిచేసే వాచ్‌మేన్ కూడా బీదవాడే. ఒక రోజున వాళ్లు తినడానికి తిండిలేక, ఆహారం వెతుక్కంటూ కారులో బయలుదేరారు...’’
పెళ్లాడేదెవరిని?
అతడు: ఇక మన పెళ్లి జరగదు రాధా...
ఆమె: ఎందుకు గోపీ?
అతడు: పొద్దున మీ ఇంటికి వెళ్లాను.
ఆమె: మా నాన్నను కలిశావా? వద్దన్నాడా?!
అతడు: కాదు మీ చెల్లిని చూశా!
వార్నీ... ఏం చెప్పావ్!
టీచర్: నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?
స్టూడెంట్: డాక్టర్‌నవుతా. దాని కోసం ఇప్పటి నుంచే జీవశాస్త్రం, గణిత శాస్త్రం బాగా నేర్చుకొంటున్నా.
టీచర్: డాక్టర్ అవ్వాలంటే జీవశాస్త్రం నేర్చుకొంటే చాలుగా, గణితం ఎందుకు?
స్టూడెంట్: బిల్స్ రాసివ్వడానికి!
నాకూ రాదులే!
స్విమ్మింగ్‌పూల్‌లోకి దూసుకెళ్తున్న గణేష్‌ని అక్కడి గార్డ్ అడ్డుకొన్నాడు.
గార్డ్: అందులో నీళ్లు లేవు సార్..
గ ణేష్: నాక్కూడా ఈత రాదు లేవయ్యా!