
పారిశ్రామిక విధానంలో లోపాలు
ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్: పారిశ్రామిక విధానంలో లోపాలున్నాయని, చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమల అవసరాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి ఈ పారిశ్రామిక విధానం తోడ్పడటం లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమల పునరుద్ధ రణకు జేఏసీ కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. శనివారం ఇక్కడ అఖిల భారత చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడక ముందు 4,500 చిన్న, మధ్యతరహా పరిశ్ర మలు మూత పడితే, రాష్ట్రం వచ్చిన తర్వాత 2 వేలకుపైగా పరిశ్రమలను బ్యాంకులు బకా యిల పేరిట జప్తు చేసుకున్నాయన్నారు. వేల ఎకరాలను పెద్ద కంపె నీల కోసం సేకరిస్తున్న ప్రభుత్వం.. చిన్న పరిశ్రమల కు 250 గజాల స్థలం ఇవ్వడంలేదని ఆరోపించారు.