Professor kodanda Ram
-
టీఆర్ఎస్లో నిరంకుశ పోకడలు: కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక నిరంకుశ పోకడలు పెరిగిపోయాయని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. కేబినెట్ పని చేయడం లేదన్నారు. టీజేఎస్ కార్యాలయంలో శుక్ర వారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కమిటీ నియామకం టీజేఎస్ పూర్తిస్థాయి రాష్ట్ర కార్యవర్గాన్ని కోదండ రామ్ శుక్రవారం ప్రకటించారు. తాను అధ్యక్షునిగా వ్యవహరించే పార్టీలో ఉపాధ్యక్షులుగా సయ్యద్ బదృద్దీన్, పీఎల్ విశ్వేశ్వర్రావు, రమేష్‌రెడ్డి, రాజమల్లయ్యను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా జి.వెంకట్‌రెడ్డి, ఎ. శ్రీనివాస్, కె.ధర్మార్జున్, జి.శంకర్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బాబన్న, బైరి రమేష్, భవానీరెడ్డి, మురళీధర్, జాయింట్ సెక్రటరీలుగా రాజు, రాయప్ప, ముజాహిద్, ఆశప్ప, కోశాధికారిగా డీపీరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వెంకటేశ్వర్రావు, మమత, మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డిని నియమించారు. -
వాటి ఫలితమే టీఆర్ఎస్ విజయం: కోదండరామ్
డల్లాస్: ఎన్నికలను మేనేజ్ చేయడం వల్లగానీ, మీడియాను మేనేజ్ చేయడంతోగానీ రాజకీయ పార్టీలు విజయాలు సాధించలేవని ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. డల్లాస్‌లో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్న సందర్భంగా కోదండరామ్ పలు అంశాలను ప్రస్తావించారు. ‘సామాజిక ఉద్యమాలు, ఘర్షణలు, కదలికలు, అప్పటి పరిస్థితులు ఎన్నికలకు మూలమని విశ్వసిస్తున్నాను. రాజకీయమంటే మీడియాను మేనేజ్ చేయడం, డబ్బులు పంచడం, ఎన్నికలను మేనేజ్ చేయడం కాదు. తెలంగాణ ప్రాంతంలోని సామాజిక పరిస్థితులు, ఉద్యమం, ఇతరత్రా కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అదే కారణంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ ఇప్పడు అలాంటి పరిస్థితులు లేవు. ఎన్నికల్లో నెగ్గిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సైతం ప్రస్తుతం ఎన్నికల కోసం అభ్యర్థులను ఎలా కొనగలం, ఇతర పార్టీల నేతలను ఏ విధంగా మన పార్టీలోకి రప్పించాలని చూస్తున్నారు. ఎన్నికల్లో మన నిర్వహణ సామర్థ్యం ఎలా పెంచుకోగలమని ఆలోచిస్తున్నారు. తొలిదశ ఉద్యమకాలంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉద్యమపార్టీ టీపీఎస్ నుంచి సాధారణ అభ్యర్థులు బరిలోకి దిగి.. కాంగ్రెస్‌ను ఓడించారు. అయితే ఆ సమయంలో పేపర్ తప్పా ఇతర మీడియా లేకున్నా ఆనాటి పరిస్థితుల కారణంగా టీపీఎస్ గెలుపొందింది. అప్పుడు ఎవరూ ఎన్నికలను గానీ, మీడియాను గానీ మేనేజ్ చేయలేదు. ఉద్యమం ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది. డీపీఆర్ చెప్పండి, చూపించాలని మల్లన్నసాగర్ ప్రాజెక్టు వివరాలు అడిగితే ఏ విషయాలు చెప్పడం లేదు. సాధారణ రైతులకు జవాబు చెప్పడం లేదు, సిటీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ప్లాన్ వివరాలు అడిగితే అలాంటివేం లేవు సార్.. ఆ కనిపిస్తున్న చోటు నుంచి ఇక్కడివరకూ భూమి తీసుకోవాలని చెప్పారని అధికారులు చెప్పారని గుర్తుచేశారు. మీకు గుర్తింపు ఉంది కానీ మీకు రాజకీయాలు రావు. అందుకే మీరు ఉంటే మాకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మీరు ముందుండండి మేం పనులు చూసుకుంటామని కొందరు అన్నారు. ఎన్నికలను ప్రధానం చేసి ఆలోచిస్తున్నారు. మోసం, దగా తెలియాలి, మాయమాటలు చెప్పడం రావాలి అంటున్నారు. మరికొందరు మాత్రం మీతో డబ్బులు లేవు, మీ వల్ల ఇలాంటివి సాధ్యం కావని చెప్పారు. ఈ ఇద్దరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాం. మేం ఉండాలంటారు.. కానీ పనులు మాత్రం మీరే చూసుకుంటాం అంటున్నారు. అలాంటప్పుడు మేం ఉండటం ఎందుకు అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌లోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏం చేస్తారని అడిగితే వాటికి సమాధానం కరువైందంటూ’ ప్రొఫెసర్ కోదండరాం తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. -
పారిశ్రామిక విధానంలో లోపాలు
ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్: పారిశ్రామిక విధానంలో లోపాలున్నాయని, చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమల అవసరాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి ఈ పారిశ్రామిక విధానం తోడ్పడటం లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమల పునరుద్ధ రణకు జేఏసీ కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. శనివారం ఇక్కడ అఖిల భారత చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడక ముందు 4,500 చిన్న, మధ్యతరహా పరిశ్ర మలు మూత పడితే, రాష్ట్రం వచ్చిన తర్వాత 2 వేలకుపైగా పరిశ్రమలను బ్యాంకులు బకా యిల పేరిట జప్తు చేసుకున్నాయన్నారు. వేల ఎకరాలను పెద్ద కంపె నీల కోసం సేకరిస్తున్న ప్రభుత్వం.. చిన్న పరిశ్రమల కు 250 గజాల స్థలం ఇవ్వడంలేదని ఆరోపించారు. -
నీళ్లు సరే.. నియామకాలు ఏవీ?
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తూప్రాన్ /రామాయంపేట: నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో విలేకరులతో, రామాయంపేటలో సభలో ఆయన మాట్లాడారు. నియామకాలను ప్రభుత్వం విస్మరించిందని, ఇందుకోసం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలుంటే ప్రభుత్వం కేవలం 15 వేలే భర్తీ చేసిందన్నారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన యువతను విస్మరించిందని మండిపడ్డారు. ఉద్యోగ కల్పన కోసం ఈ నెల మూడో వారంలో హైదరాబాద్‌లో నిరుద్యోగులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే తేదీ ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని విమర్శించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు అసంబద్ధంగా జరిగిందని ఆరోపించారు. -
విద్యా విధానంలో అంతరాలు తొలగాలి
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం శంషాబాద్: ప్రస్తుత విద్యావిధానంలో ఉన్న అంతరాలు తొలగిపోవాల్సిన అవసరముందని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఇందులో కోదండరాం మాట్లాడుతూ చదువులో అన్నివర్గాల ప్రజలకు సమానావకా శాలు అభించడం లేదనీ, కొందరిని నిరాదరణ వెంటాడుతోందన్నారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు పనిచేయడం లేదన్నారు. విద్యార్థులు సంఘటిత శక్తిగా మారితేనే సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుందన్నారు. -
‘స్థానిక’కు అధికారాలివ్వాలి
► జెడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఏమాజీ ► 27న సర్పంచుల ఐక్యవేదిక మహాధర్నాకు మా మద్దతు ► ప్రభుత్వ తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: కోదండరాం సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా నిధులు, అధికారాలను స్థానిక సంస్థలకు బదలాయించకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేస్తున్నా యని జెడ్పీటీసీల ఫోరం ఆరోపించింది. స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలపై సర్పం చుల ఐక్యవేదిక 27న చేపట్టిన మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. మంగళవారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో జెడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజీ మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో పాలన సజావుగా జరగాలంటే స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని పలు కమిషన్లు ప్రభుత్వానికి సిఫార్సులు చేశాయని, ఆయా సిఫారసులను ప్రభు త్వాలు అమలు చేయడం లేదన్నారు. కేరళ తరహాలో రాష్ట్ర బడ్జెట్లో 40 శాతం నిధులను స్థానిక సంస్థలకు కేటాయిస్తానన్న సీఎం ఒక్క నయాపైసా కూడా కేటాయించలేదన్నారు. కేరళ రాష్ట్రాన్ని సంద ర్శించి ఆ తరహా పాల నను రాష్ట్రంలో అందిస్తామన్న పంచాయతీ రాజ్‌శాఖ మాజీ, తాజా మంత్రులు తమ హామీలను నిలబెట్టుకోలేదన్నారు. సర్పం చుల ఐక్యవేదిక నిర్వహించే ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలంతా హాజరై విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలకు నిధులు, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించకపోవడం రాజ్యాం గ స్ఫూర్తికి విరుద్ధమని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అనివార్య కారణాలతో ప్రెస్‌మీట్‌కు హాజరు కాలేకపోయిన ఆయన ఫోన్ ద్వారా మాట్లా డారు. సర్పంచుల ఐక్యవేదిక పోరాటానికి జేఏసీ సంపూర్ణ మద్దతు పలుకుతోందని చెప్పారు. సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆందోల్ కృష్ణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుటుంబం రాష్ట్రంలో రాచరిక పాలనను సాగిస్తోందని ఆరోపించారు. జెడ్పీ టీసీల ఫోరం గౌరవాధ్యక్షుడు ఏనుగు జంగా రెడ్డి, ఉపాధ్యక్షులు అంజయ్య యాదవ్, ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
అఖిల పక్షాన్ని కలుస్తాం
భూ సేకరణ, ప్రైవేటు వర్సిటీ బిల్లుపై ప్రొఫెసర్ కోదండరాం కరీంనగర్: రైతుల నుంచి భూసేకరణ, పునరావాస ప్యాకే జీ విషయంతోపాటు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయంపై త్వరలో అఖిలపక్ష పార్టీల నాయకులను కలుస్తామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. భూసేకరణలో రైతులకు అన్యాయం చేయొద్దని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తూ నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు రాజ్యామేలుతున్నాయని, ప్రైవేటీకరణ వల్ల విద్య అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. ఇసుక, గ్రానైట్ వ్యాపారాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సామా న్యుడికి ఒక ట్రాక్టర్ ఇసుక దొరకని పరిస్థితుల్లో టన్నుల కొద్ది ఇసుక అక్రమంగా తరలిపోతోందని చెప్పారు. గత ప్రభుత్వాలకు.. ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఏమీ లేకపోవడం విచారక రమన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు గండిప డేందుకు కారణమైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి మీన మేషాలు లెక్కించడంలో ఆంతర్యమేమి టని, పాత కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త కాం ట్రాక్టర్‌కు టెండర్ల ద్వారా మిడ్‌మానేరు ప్రాజెక్టును రెండింతలు అంచనాలు పెంచి ఇవ్వడం ప్రజాధనం దుర్వినియోగం చేయ డం కాదా? అని ప్రశ్నించారు. జేఏసీ, టీవీవీ ప్రజలపక్షాన నిలుస్తుందని, జేఏసీ ఎవరికి తొత్తుగా ఉండబోదని స్పష్టం చేశారు. -
సబ్‌ప్లాన్ నిధులపై శ్వేతపత్రం ఇవ్వాలి
భట్టి విక్రమార్క డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులు, వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. పీసీసీ నేతలు తూర్పు జగ్గారెడ్డి, బండి సుధాకర్‌తో కలసి గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులను రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. రెండున్నరేళ్లలో ఎస్సీలకు, ఎస్టీలకు వినియోగించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలను కావాలని విస్మరిస్తున్నారని, అంబేడ్కర్ అడుగుజాడల్లో హక్కుల కోసం పోరాడుతా మని హెచ్చరించారు. ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. తెలంగాణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలతో పోరాడి, ఉద్యమించిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కన్వీనర్ విమలక్క కార్యాలయా న్ని సీజ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విమలక్కను పోలీసులతో అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది ముమ్మాటికీ పౌరహక్కుల ఉల్లంఘన, భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్నారు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసి, ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీఆర్ఎస్ నేతలు అనవసరమైన నిందలు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ భయపడుతున్నదని, టీఆర్ఎస్ను వెంటిలేటర్ పైకి పంపించే శక్తి కేవలం కాంగ్రెస్‌కే ఉందన్నారు. -
రాత్రికిరాత్రి మార్చేశారు!
► జిల్లాల విభజనపై ప్రొఫెసర్ కోదండరాం ► నోటిఫికేషన్ ఓ రకంగా తుది ప్రకటన మరో రకంగానా..? ► ప్రజాభీష్టాన్ని పట్టించుకోకుండా విభజించారని ఆరోపణ ► ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘జిల్లాల పునర్విభజన ప్రజల అభీష్టం మేరకు జరగలేదు. అందుకే చాలా ప్రాంతాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనం. ఆందోళన చేస్తున్న వారిని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి. అలా కాకుండా పోలీసులను పెట్టి అణచివేసే ప్రయత్నం చేయటం సరికాదు. తమ డిమాండ్లను పట్టించుకోవటం లేదన్న ఆవేదనతో ఇటీవల ముగ్గురు ఆత్మహత్యకు యత్నించగా.. ఇద్దరు మృతి చెందారు. ప్రభుత్వం వెంటనే మేల్కొనకపోతే ఈ ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది. ప్రజలు నేరుగా మాట్లాడే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించాలి. సహేతుకమైన ఆందోళనలకు తమ పూర్తి మద్దతు ఉంటుంది’ అని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాల విభజనలో భాగంగా మండలాలు, గ్రామాల విలీనాలకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం జేఏసీ ప్రతినిధులతో కలసి ఆయన సీఎస్ రాజీవ్ శర్మకు వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నాక.. జిల్లాల విభజనకు సంబంధించి తొలుత నోటిఫికేషన్ ఓ రకంగా వెలువడగా, తుది నిర్ణయం మరోలా వచ్చిందని విమర్శించారు. ప్రజలతో ప్రమేయం లేకుండా రాజకీయ నేతల ఒత్తిళ్లతోనో, మరే కారణాలతోనో రాత్రికిరాత్రే మార్పులు చేర్పులు జరగటం స్థానికులను ఆందోళనకు గురి చేసిందన్నారు. గట్టుప్పల్ మండలం ఉంటుందని ప్రకటన వెలువడటంతో స్థానికంగా మండల కేంద్రం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక.. ముందురోజు రాత్రి దాన్ని రద్దు చేయటమే ఇందుకు నిదర్శనమన్నారు. దీన్ని జీర్ణించుకోలేక బొడిగ సోని అనే యువతి ఆత్మహత్య చేసుకుందని, ఏర్పుల యాదయ్య అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. నిజామాబాద్ (పాత) జిల్లా పరిధిలోని నాగిరెడ్డిపేట మండలాన్ని సమీపంలోని మెదక్ జిల్లాలో కలపాలని స్థానికులు గట్టిగా కోరగా, దూరంగా ఉన్న కామారెడ్డి జిల్లాలో కలపటంతో మనస్తాపం చెందిన స్థానిక దళిత యువకుడు రాజు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. వెనకబడ్డ నారాయణపేట ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేయాలనే కోరిక స్థానికుల్లో బలంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయని వివరించారు. కొడంగల్, దౌల్తాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో విలీనం చేయటాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఆ డిమాండ్లను పరిశీలించకుండా పోలీసులతో అణచివేస్తుండటం దారుణమని విమర్శించారు. రంగారెడ్డి-నల్లగొండ సరిహద్దులో ఉన్న మాల్ గ్రామం రెండు జిల్లాల పరిధిలో సగంసగం కలవటం గందరగోళాన్ని సృష్టిస్తోందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన, యత్నించిన వారి కుటుంబాలను ఆదుకోవటంతోపాటు ఆందోళనల సందర్భంగా పెట్టిన పోలీసు కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో చర్చ లు జరిపి సమస్య పరిష్కరించాలని కోరారు. సమాధానం తెలుసుగా.. ప్రజలకు సీఎం అపాయింట్మెంట్ దొరికితే నేరుగా సమస్యలు చెప్పుకుంటారని, పెద్ద సారుకు విన్నవించినందున సమస్యలు పరిష్కారమవుతాయన్న సంతృప్తితో వెనుదిరుగుతారని కోదండరాం పేర్కొన్నారు. విన్నపాన్ని నేరుగా సీఎంకు కాకుండా సీఎస్‌కు ఎందుకిచ్చారని విలేకరులు ప్రశ్నించగా, ‘సమాధానం ఏం వస్తుందో తెలిసి ఈ ప్రశ్న వేయటమెందుకు’ అంటూ దాటవేశారు. కొంతకాలంగా కోదండరాంకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ లభించటం లేదని ఆయన అనుయాయులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. -
'ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలి'
ఖమ్మం : ఆదివాసీ ప్రాంతాలన్నింటినీ కలిపి ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేయాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఖమ్మం జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, సంక్షేమ పథకాలు దక్కుతాయని కోదండరాం తెలిపారు. పోడు భూములపై హక్కు కల్పించాలని, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితమైందని, ఇప్పుడు అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని సూచించారు. ప్రభుత్వం ఉమ్మడి వనరులను కాపాడాలన్నారు. 2015 నుంచి రైతులకు ఇవ్వాల్సిన పంటల ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేయాలని, రుణాలన్నీ మాఫీ చేసి, కొత్త లోన్లను మంజూరు చేయాలని, రైతులకు ఖరీఫ్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.. రైతుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్2న హైదరాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు జేఏసీ మౌనదీక్షకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ పాపారావు, కో కన్వీనర్లు జి.సత్యనారాయణ, మార్టిన్, మురళీతారకరామారావు, నాగేంద్రరావు, శంకర్రావు, రవి, విశ్వం పాల్గొన్నారు. -
మంత్రి జూపల్లిని అడ్డుకున్న విద్యార్థి జేఏసీ
ప్రొఫెసర్ కోదండరాంపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్‌నగర్‌లో గురువారం మంత్రి కాన్వాయ్‌ని విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. కోదండరామ్‌పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని కోదండరాం ప్రభుత్వంపై సందిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. -
రైతులను ఆదుకునేందుకు చట్టం తేవాలి
టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కందుకూరు: రైతులను విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఉందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కరువు పరిస్థితులపై అధ్యయనం చేయడానికి శనివారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని గుమ్మడవెల్ల్లిలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. -
కలసి పోరాడుదాం: ప్రొ. కోదండరాం
-చిన్నరాష్ట్రాలొచ్చినా..చిన్న కులాలకు రాజ్యాధికారం రాలేదు:గద్ధర్ హైదరాబాద్ ప్రజాస్వామిక విస్తరణ కోసం పార్టీలకు అతీతంగా కార్యాచరణను కొనసాగించాలని ప్రజాసంఘాలకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారంపై వెనక్కు వెళ్లేది లేదని అన్నారు. మంగళవారం హోటల్ అశోకాలో జరిగిన తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల సంఘం నూతన డైరీ-2016 ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాలతో పోల్చితే మున్సిపల్ విభాగంలో కిందిస్థాయి ఉద్యోగుల పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నారు. సమాజంలో మాదిరిగానే కార్యాలయాల్లోనూ వివక్షకు గురవుతున్నారని చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవస్థ కారణంగానే చిన్న ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ఉద్యోగుల పరిరక్షణ అంటే.. కేవలం ఆర్ధిక లబ్ది మాత్రమే కాదని, అందరికీ సమాన గౌరవం లభించినపుడే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజాసంఘాల పాత్ర, కార్యాచరణ, సైద్ధాంతిక అంశాలపై స్పష్టత కొరవడిందని అన్నారు. రాష్ట్రం వచ్చినా.. రాజ్యాధికారం ఏదీ..? దేశంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడితే.. చిన్న కులాలకు రాజ్యాధికారం వస్తుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారని, అయితే.. తెలంగాణ చిన్నరాష్ట్రం ఏర్పడినా చిన్నకులాలకు అధికారం మాత్రం దక్కలేదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. జనాభాలో కేవలం 0.4 శాతం ఉన్న కులం వారికి అధికారం వచ్చిందన్నారు. ప్రస్తుతం సిద్ధాంత పరమైన ఉద్యమాలకు జనం సిద్ధంగా లేరని చెప్పారు. అయితే.. ప్రజల్లో ఇప్పటికీ ఐక్యత, పోరాటపటిమ(యూనిటీ అండ్ స్ట్రగుల్) ఏమాత్రం తగ్గలేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల సంఘం అధ్యక్షుడు తిప్పర్తి యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్మోహన్, ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, టీఎన్జీవో నేతలు దేవీప్రసాదరావు, రవీందర్‌రెడ్డి, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ చైర్మన్ విమలక్క తదితరులు పాల్గొన్నారు. -
ఏ పార్టీ చేసినా అది తప్పే : ప్రొ.కోదండరాం
-
ఏ పార్టీ చేసినా అది తప్పే : ప్రొ.కోదండరాం
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ సిద్ధాంతాలను నమ్మి మరో పార్టీలోకి వెళ్లడం సరికాదన్నారు. పార్టీ ఫిరాయింపులను ఏ పార్టీ ప్రోత్సహించినా అది తప్పేనని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితులు రాజకీయ అస్థిరత్వానికి దారి తీస్తాయని కోదండరాం అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ జరుగుతున్నాయని... ఆత్మహత్యల నివారణకు త్వరలోనే జేఏసీతో కార్యాచారణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా నేతల వలసల నేపథ్యంలో కోదండరాం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
'చావుకు చదువు కారణం కారాదు'
ఆత్మహత్యలకు చదువు కారణం కాకూడదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. గురువారం మెదక్ జిల్లా సిద్దిపేటలో మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సీసీసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 'బాల ప్రతిభ మేళ-2015' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చదువు లక్ష్యంగా ఆత్మహత్యలు జరగడం బాధకరమని చెప్పారు. చావుకు ఆత్మహత్యలే పరిష్కారం కాదన్నారు. విద్యార్థులు అర్ధంతరంగా చదువును మానేసే కారణాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. అంతకు ముందు జాతీయ ఆహార భద్రత సలహదారురాలు ప్రొఫెసర్ రమా మెల్కొటే మాట్లాడుతూ.. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. -
‘భేరి’ మోగిద్దాం..
నల్లగొండ/నల్లగొండ రూరల్ న్యూస్‌లైన్ ‘‘ఒకరి జోలికి మేమెళ్లం...మా జోలికొస్తే వదిలిపెట్టం..’’ అనే సమాచారాన్ని సీమాంధ్ర ఉద్యోగుల చెవిలో వేసేందుకే సకల జనభేరి సభ తలపెట్టినట్టు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. తెలంగాణ నిర్ణయానికి అడ్డంపడే శక్తులకు అర్థమయ్యేలా తెలియజెప్పేందుకే సకల జనుల సమ్మెను మించి సకల జనభేరి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 29వ తేదీన నిజాం కళాశాల మైదానంలో తలపెట్టిన సకల జనభేరి సభ విజయవంతం కోసం శుక్రవారం స్థానిక ఎస్బీఆర్ ఫంక్షన్హాల్లో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పందిరి వెంకటేశ్వరమూర్తి అధ్యక్షతన జరిగిన సన్నాహక సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన సకల జనభేరి సభకు జిల్లా నుంచి తండోపతండాలుగా తరలివచ్చి ఉద్యమస్ఫూర్తిని మరోమారు చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతి ఇంటికి ఇద్దరి చొప్పున తరలిరావడం ద్వారా సీమాంధ్ర కుట్రదారులకు దిమ్మదిరిగేలా చేయవచ్చన్నారు. ఎట్టిపరిస్థితుల్లో నేనొక్కడిని వెళ్లకపోతే ఏమవుతనుకోవద్దు.. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మరొకరికి తీసుకొని రావడం ద్వారా తెలంగాణవాదాన్ని, తెలంగాణవాదుల ఐకమత్యాన్ని సీమాంధ్రులకు రుచి చూపించవచ్చన్నారు. తెలంగాణలో సకల జనుల సమ్మె సమయంలో విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని గగ్గోలు పెట్టి చర్చల మీద చర్చలు జరిపిన సీమాంధ్ర మీడియాకు నేటి సీమాంధ్ర సమ్మెలో విద్యార్థులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నూటికి పది మంది ఉండి తెలంగాణ వాళ్లనే వెళ్లిపోవాలని ఉచిత సలహాలు ఇస్తారా అంటూ మండిపడ్డారు. ‘హైదరాబాద్ అభివృద్ధి అంతా తామే చేశామంటున్నారు. ఏమి చేశారు? అణగారిన వర్గాల భూములు అప్పనంగా గుంజుకున్నారు. నిజాం హయాంలో కట్టిన చారిత్రాత్మక కట్టడాలు తప్ప ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ భవనం కట్టారా? జూబ్లీహిల్స్ చుట్టూ ఫ్లైఓవర్లు తప్ప’ అని ఆగ్రహంతో ప్రశ్నల వర్షం కురిపించారు. దుష్ర్పచారాలతో ప్రజలను మభ్యపెడుతున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు, ఉద్యోగ సంఘాలకు తగిన బుద్ధిచెబుతూ వారి కుతంత్రాలను తిప్పికొట్టేందుకే జనభేరి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భేరి విజయవంతం కోసం టీఎన్జీఓలు జిల్లాల్లో నిర్వహిస్తున్న సన్నాహక సభలు అభినందనీయమన్నారు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రసంగిస్తూ సచివాలయంలో ఉద్యోగులు పనిచేస్తున్నా ప్రభుత్వం తప్పుడు నివేదికలు అందిస్తుందని ఆరోపించారు. వచ్చిన తెలంగాణను వెనక్కి నెట్టేందుకు ఏపీఎన్జీఓలు ప్రయత్నాలు సాగిస్తున్నారని, వారి ఉద్యమం తోలుబొమ్మలాంటిదని అభివర్ణించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను ప్రభుత్వమే ఎస్కార్ట్ పెట్టి మరీ నడిపించిందన్నారు. తమ పోరాటం ఆంధ్ర ప్రజల మీద కాదని, తెలంగాణకు అన్యాయం తలపెట్టిన పాలకుల మీదనేనన్నారు. హైదరాబాద్ నూటికి నూరుశాతం మనదని, వీధుల్లో కవాతు నిర్వహించి సత్తా చాటుదామన్నారు. ఉద్యోగుల సమస్యపై ప్రశ్నపత్రం ఇస్తే రెండు రోజుల్లోనే తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సమాధానం ఇచ్చారని, సీమాంధ్ర ఉద్యోగులు రెండు నెలల సమయం అడిగారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆర్టీసీని నిర్వీర్యం చేయడం ద్వారా ప్రైవేటు ట్రావెల్స్‌ను నడిపించి సీమాంధ్ర వ్యాపారులు లబ్ధిపొందుతున్నారని ఆరోపించారు. టీఎన్జీఓ కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులందరికీ తొలిప్రాధాన్యం ఉద్యమం, రెండో ప్రాధాన్యం ఉదోగ బాధ్యతలయ్యాయన్నారు. కవి,రచయిత దేశ్‌పతి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం తెలంగాణను ఆపేందుకు సకల ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు. జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో నాటి నుంచి నేటి వరకు టీఎన్జీఓల పాత్ర, త్యాగం అనిర్వచనీయమని, టీజేఏసీకి ఉద్యోగుల పాత్ర ఆయువు పట్టు అని పేర్కొన్నారు. ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు ఓ కోన్కిస్కాగొట్టమని, సీమాంధ్ర పెట్టుబడిదారుల బోయ అని అభివర్ణించారు. సమావేశంలో టీజేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, కన్వీనర్ గోలి అమరేందర్‌రెడ్డి, ఆయా ఉద్యోగల సంఘాల జేఏసీ నాయకులు రేచల్, మందడి ఉపేందర్‌రెడ్డి, శివశంకర్, బుచ్చిరెడ్డి, ప్రతాప్, వేణుమాధవ్, మోహన్‌రెడ్డి, రాఘవేందర్రావు, మోహన్‌రావు, సురభి వెంకటేశ్వర్లు, యేపాల సత్యనారాయణరెడ్డి, మామిడాల రమేష్, జహంగీర్, శ్యాంసుందర్, జవహర్లాల్, అరేకంటి భిక్షమయ్య, యాదయ్య, అశోక్, శ్రావణ్, ప్రహ్లాద్, జయరాంనాయక్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు