ఏ పార్టీ చేసినా అది తప్పే : ప్రొ.కోదండరాం
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ సిద్ధాంతాలను నమ్మి మరో పార్టీలోకి వెళ్లడం సరికాదన్నారు. పార్టీ ఫిరాయింపులను ఏ పార్టీ ప్రోత్సహించినా అది తప్పేనని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు.
ఇటువంటి పరిస్థితులు రాజకీయ అస్థిరత్వానికి దారి తీస్తాయని కోదండరాం అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ జరుగుతున్నాయని... ఆత్మహత్యల నివారణకు త్వరలోనే జేఏసీతో కార్యాచారణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా నేతల వలసల నేపథ్యంలో కోదండరాం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.