'చావుకు చదువు కారణం కారాదు' | Cause of death can not be Education | Sakshi
Sakshi News home page

'చావుకు చదువు కారణం కారాదు'

Published Thu, Dec 10 2015 8:05 PM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

Cause of death can not be Education

ఆత్మహత్యలకు చదువు కారణం కాకూడదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. గురువారం మెదక్ జిల్లా సిద్దిపేటలో మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సీసీసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 'బాల ప్రతిభ మేళ-2015' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చదువు లక్ష్యంగా ఆత్మహత్యలు జరగడం బాధకరమని చెప్పారు. చావుకు ఆత్మహత్యలే పరిష్కారం కాదన్నారు. విద్యార్థులు అర్ధంతరంగా చదువును మానేసే కారణాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. అంతకు ముందు జాతీయ ఆహార భద్రత సలహదారురాలు ప్రొఫెసర్ రమా మెల్కొటే మాట్లాడుతూ.. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement