Human Rights Day
-
Human Rights: నోరు తెరవొద్దు.. పోస్టులు పెట్టొద్దు!
ప్రపంచమంతా మానవ హక్కుల దినోత్సవం నిర్వహించుకుంటున్న వేళ(డిసెంబర్ 10న).. ఏపీలో మాత్రం ఆ హక్కులు ఊసేలేకుండా పోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం పెంచుకున్న పగను.. అధికారంలోకి రాగానే వెల్లగక్కడం మొదలుపెట్టారు నారా చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే రాష్ట్ర శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేశారు. ఫలితంగానే.. గత ఆరు నెలలుగా దాడులు, హత్యలు, అత్యాచారాలకు నిలయంగా మారింది. భద్రత కరువైన వేళ బతుకుజీవుడా అనుకుంటూ కొందరు ఏపీని విడిచి వెళ్లిపోతుండగా.. ప్రభుత్వ వేధింపులు భరించలేక మరికొందరు బలవనర్మరణాలకు పాల్పడ్డారు.ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్ఛగా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను సైతం వదలకుండా దాడులకు తమ శ్రేణులను ఉసిగొల్పింది కూటమి. ఇక.. పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక.. ఆ దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. ప్రతిపక్ష నేతలూ, కార్యకర్తల మీద ఏపీ పోలీసులూ.. కూటమి వర్గాల దాష్టీకాలు అన్నీఇన్నీ కావు. దళితులపైనా దారుణమైన దాడులు జరుగుతున్నాయి. విపక్ష నాయకుల నిరసనలపై ఖాకీల ఆంక్షలు సరేసరి.‘ఒక మనిషి స్వేచ్ఛగా, గౌరవంగా బతకడానికి కొన్ని హక్కులు అవసరం. జాతి, కుల, మత, వర్ణ, లింగ, రాజకీయపరమైన వివక్షకు గురవ్వకుండా వ్యక్తుల రక్షణ కోసం రూపొందించినవే మానవ హక్కులు. ఆ హక్కులపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అలాంటి ప్రభుత్వమే ఏపీలో ఆ బాధ్యత మరిచి.. హక్కులను కాలరాస్తోంది’అధికారం చేపట్టాక.. పవన్ కల్యాణ్ ప్రతీకార రాజకీయాల్లాంటివి ఉండబోవని ప్రకటించారు. కానీ, స్వయానా సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రెడ్‌బుక్ పేరిట ఇష్టారాజ్యానికి దిగారు. ఆ ఎర్రబుక్లో ఉన్నవాళ్లను అధికార దుర్వినియోగంతో హింసిస్తున్నారు. తమ అనుకూలురను ప్రొత్సహించే క్రమంలో ఇతరులను బదిలీలు చేయించారు. మాట విననివాళ్లను బలవంతంగా ఇళ్లకు పంపించారు. ఈ పరిణామాలకు భయపడే అధికారులు కళ్లు మూసుకుండిపోయారు.ఇదీ చదవండి: చంద్రబాబు ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహంఏవో కొంపలు మునిగిపోయినట్లే!నచ్చని అంశాలను విమర్శించడం.. ప్రజలకున్న హక్కు. ఆ హక్కు ఎంతంగా వినియోగంలో ఉంటే.. ప్రజాస్వామ్యం అంతగా బలోపేతమవుతుంది. అయితే ఏపీలో రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఏపీలో తూట్లు పొడుస్తున్నారు. ఎన్నికల హామీల గురించి, ప్రజా సమస్యలపై మాట్లాడిన వాళ్లపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. సాధారణంగా.. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు చేయడం సహజం. కానీ, కూటమి ప్రభుత్వ కర్కోటక ఏలుబడిలో మాత్రం అది మహాపాపం. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే- ఏవో కొంపలు మునిగిపోయినట్టు కేసులు పెడుతున్నారు. రాజకీయ ఆసక్తితో పోస్టులు చేస్తున్నవాళ్లనూ వదలడం లేదు. అక్రమ కేసులు బనాయిస్తూ.. స్టేషన్ల చుట్టూ తిప్పుతూ.. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆఖరికి.. ఆడపడుచుల విషయంలోనూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గుతున్న వాళ్లు కొందరైతే.. ధైర్యంగా పోరాడుతున్నవాళ్లు మరికొందరు.ఇదీ చదవండి: టీడీపీ వేధింపులతో వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్యఅన్నింటిని మేనేజ్ చేస్తున్న బాబు!దేశంలో ఎక్కడా లేనంతగా.. చంద్రబాబు సారథ్యంలో ఏపీలో పౌరహక్కుల హననం నిరాటంకంగా సాగుతోంది. ఈ ఆర్నెల్ల కాలంలోనే ఏపీ నుంచి జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు రికార్డు స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. కేంద్ర పెద్దలకు, గవర్నర్ స్థాయి వాళ్లకు స్వయంగా ఫిర్యాదులు అందజేసింది వైఎస్సార్సీపీ. ఇక.. పోలీస్ శాఖకు వెళ్లిన ఫిర్యాదుల సంగతి సరేసరి. అయినా తన పరపతిని ఉపయోగించి చంద్రబాబు ఎక్కడికక్కడే వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు.రాజ్యాంగ నిర్దేశాలను నట్టేట్లో కలుపుతున్న కూటమి ప్రభుత్వం- మానవ హక్కుల హంతకిగా మారింది. ఏపీలో భయోత్పాతాన్ని సృష్టిస్తూ తాను ఆడిందే ఆటగా చెలరేగిపోతోంది. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అధోపాతాళానికి దిగజార్చింది. ఇప్పుడు ఏపీలో మానవహక్కులతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు మిగిలింది హక్కుల కమిషన్ల, న్యాయస్థానాల జోక్యం మాత్రమే!. -
World Emoji Day: సరదా నుంచి సందేశం వరకు...
అమెరికన్ రచయిత్రి, జర్నలిస్ట్ నాన్సీ గిబ్స్ ఇమోజీలపై తన ఇష్టాన్ని ఇలా ప్రకటించుకుంది... ‘నిఘంటువులలో పదాలు వ్యక్తీకరించలేని భావాలు, ఇమోజీలు అవలీలగా వ్యక్తీకరిస్తాయి. అదే వాటి ప్రత్యేకత. బలం’ ఇమోజీ...అంటే ‘సరదా’ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం అవి సందేశ సారథులుగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. మహిళలకు సంబంధించిన సమస్యల నుంచి సాధికారత వరకు...భావ వ్యక్తీకరణకు ప్రపంచంలోని ఎన్నో సంస్థలు ఇమోజీలను వాడుకుంటున్నాయి... కోవిడ్ సమయంలో... మహిళలపై గృహహింస పెరిగిందని గణాంకాలు చెప్పాయి. మరొకరి నీడను కూడా చూసి భయపడుతున్న కాలంలో తమ గురించి ఆలోచించకుండా, భయపడకుండా మహిళలు సేవాపథంలో అగ్రగామిగా ఉన్నారు. పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్‌కేర్ వర్కర్స్ మూడు రెట్లు ఎక్కువ రిస్క్‌ను ఎదుర్కొన్నారు... ఇట్టి విషయాలను చెప్పుకునేందుకు పెద్ద వ్యాసాలు అక్కర్లేదని చెప్పడానికి ఐక్యరాజ్య సమితి ప్రయత్నించింది. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు రకాల ఇమోజీలను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ‘గర్ల్ పవర్’ ‘జెండర్ ఈక్వాలిటీ’లపై ఇమోజీలు తీసుకువచ్చింది. యూనికోడ్ ఇమోజీ సబ్‌కమిటీ స్త్రీ సాధికారతను ప్రతిఫలించే, సాంకేతికరంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని సూచించే ఇమోజీలకు ప్రాధాన్యత ఇచ్చింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ‘ఎవ్రీ ఉమెన్’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రత్యేకమైన ఇమోజీని తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను వ్యతిరేకిస్తూ ‘జెనరేషన్ ఈక్వాలిటీ’ ‘16 డేస్’ ‘ఆరేంజ్ ది వరల్డ్’ ‘హ్యూమన్ రైట్స్ డే’ హ్యాష్‌ట్యాగ్‌లతో ఇమోజీలు తీసుకువచ్చింది. చెప్పుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాంకేతిక సంస్థలు, సామాజిక సంస్థలు ఇమోజీలను బలమైన సందేశ వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ‘ఇమోజీ’ అనేది మేజర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్‌గా మారిన నేపథ్యంలో... గతంలోలాగా... ‘చక్కగా చెప్పారు’ ‘చక్కగా నవ్వించారు’ ‘ఏడుపొచ్చింది’... ఇలాంటి వాటికే ఇమోజీ పరిమితం కాదు. కాలంతో పాటు ఇమోజీ పరిధి విస్తృతమవుతూ వస్తోంది. అందులో భాగంగా సామాజిక కోణం వచ్చి చేరింది. -
మనిషి హక్కుకు గుర్తింపు ఏది?
సాటిమనిషిని మనిషిగా చూడని సందర్భాలెన్నో చూస్తూనే ఉన్నాం. మనల్ని కాపాడిన మానవ హక్కుల పరిరక్షణను మనమే కాలరాస్తున్నాం, హరించివేస్తున్నాం. 1948 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి విశ్వమానవ హక్కులను ప్రకటన చేసింది. దాని లక్ష్యం ప్రతి ఒక్కరూ ఏ విధమైన వివక్షకు గురవ్వకుండా ప్రశాంతంగా జీవించాలి. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడున్నాయా అన్న సందేహం రాక తప్పదు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన సుమారు 30 ప్రాథమిక హక్కులు ఉన్నప్పటికీ మనల్ని మనం కాపాడుకోలేకపోవడం బాధాకరం. మానవ హక్కులు గురించి మాట్లాడుకోవడమే తప్ప ఉల్లంఘన జరిగే తీరు మాత్రం మారడం లేదు. నిరంతరం ఏదో ఒక వార్తతో ప్రతి ఒక్కరు ఉలికిపడుతున్నారు. కోర్టులు మాత్రం హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ నివారణ మాత్రం కష్టతరమవుతోంది. మానవ హక్కులు, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని 1993 అక్టోబర్ 12న నాటి ప్రధాని పి.వి. నరసింహరావు మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసారు. నేటికి 18 రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లను మన దేశంలో ఏర్పాటు చేసాయి. (చదవండి: కనురెప్పే కాటేస్తే... కన్నుకేది రక్ష?) 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి అన్ని దేశాల ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన, ఆదర్శవంతమైన ఒక ఉమ్మడి ప్రమాణంగా సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను రూపొందించింది. దీన్ని చారిత్రక అంశంగా పరిగణిస్తారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా ప్రతి పౌరుడికి అవగాహన కల్పించడానికి ఆమోదించిన దినాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 10న ఒక అంశాన్ని ప్రాతిపదికంగా తీసుకొని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తుంది. గత సంవత్సరం కరోనా వైరస్ నేపథ్యంలో ‘బాగా కోలుకోండి... మానవ హక్కుల కోసం నిలబడండి’ అనే నినాదంతో జరుపుకున్నారు. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం) – డాక్టర్ నెమలిపురి సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
హక్కులను పోరాడి సాధించుకోవాలి: సుచరిత
సాక్షి, విజయవాడ: స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా హక్కుల ఉల్లంఘన జరుగుతునే ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గురువారం ఆమె విజయవాడలో జరిగిన జాతీయ మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్సీ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్, జడ్పీటీసీ అభ్యర్థి కీర్తి సౌజన్య, ఎన్‌హెచ్‌ఆర్‌ఏసీసీ నేషనల్ చైర్ పర్సన్ శాంసన్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి సుచరిత మాట్లాడుతూ మన హక్కులను మనం సాధించుకోవడానికి ఇంకా పోరాడాల్సిన ఆవశ్యకత కనపడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ సభ్యులకు ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు. (చదవండి: చంద్రబాబుకు బాధ్యత లేదు: శ్రీరంగనాథరాజు) ‘‘వివిధ రంగాల్లో నిపుణులైన వారు హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావడం చాలా సంతోషకరం. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి న్యాయ సలహాలు ఇవ్వడం, భరోసా కల్పించడం మంచి పరిణామం. మన దేశంలో నిర్భయ లాంటి అనేక చట్టాలు ఉన్నప్పటికీ నేరస్తులకు భయం లేకుండా పోయింది. ప్రతి రోజు అనేక అఘాయిత్యాలు, దారుణాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. విజయవాడలో దివ్య తేజశ్విని, నెల్లూరులో చిన్నారి ఘటన, విశాఖపట్నం ఘటనలు జరగడం చాలా బాధాకరం. న్యాయస్థానాల్లో శిక్ష పడటం ఆలస్యం కావడం వల్ల నేరస్తులు నిర్భయంగా బయట తిరుతున్నారు. (చదవండి: టీడీపీ రెండు ముక్కలైంది..) శిక్షలను కఠినంగా అమలు చేసేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘దిశ’ చట్టాన్నితీసుకొచ్చారు.ఈ చట్టం ప్రకారం 21 రోజుల్లో శిక్ష పడేలా చర్యలు చేపడతారు. మన రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు, 3 ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. త్వరగా శిక్ష విధించేందుకు ప్రతి జిల్లాకు ప్రత్యేక న్యాయ స్థానాలను ఏర్పాటు చేయనున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. పిల్లలు బాగా చదివితినే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం భావించారు. దాదాపు రూ.33 వేల కోట్లు విద్య కోసం ఖర్చు చేస్తున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కావాలని అంబేద్కర్ కలలు కన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్దలో భాగంగా పిల్లలకు బలవర్ధమైన ఆహారం, నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. పిల్లల చదువుకు ఇబ్బంది పడుతున్న వారికి అమ్మఒడి పథకం ద్వారా సాయం అందిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని’’ మంత్రి సుచరిత వివరించారు. -
నీ కొడుకు ముస్లిం కాదని ఒప్పుకో.. క్షమాపణ చెప్పు
ఇస్లామాబాద్ : మానవ హక్కుల గురించి మాట్లాడిన ఓ మహిళా ప్రభుత్వాధికారి పట్ల పాకిస్తాన్ విద్యార్థులు దురుసుగా ప్రవర్తించారు. ఆమె కార్యాలయంలోకి చొచ్చుకువచ్చి క్షమాపణ చెప్పాలంటూ ఆమెను దౌర్జన్యానికి దిగారు. అనంతరం ఆమెతో క్షమాపణలు చెప్పించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే... డిసెంబరు 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అటాక్ అసిస్టెంట్ కమిషనర్ జన్నత్ హుస్సేన్ నెకోకరా జిల్లా పాలనావిభాగం కార్యాలయంలో ప్రసంగించారు. ‘ముస్లింమేతర పాకిస్తానీయులకు కూడా సమాన హక్కులు కల్పించాలి. మత పరమైన విభేదాలతో మన మధ్య విభజన రేఖలు ఏర్పరచుకున్నాం. షియా, సున్నీ, అహ్మదీ, వహాబీ అంటూ అంతరాలు సృష్టించుకున్నాం. మనమంతా ముస్లింలమే అని... అంతకుమించి పాకిస్తానీయులమని గుర్తించాల్సిన అవసరం ఉంది’ అని జన్నత్ వ్యాఖ్యానించారు. కాగా జన్నత్ వ్యాఖ్యలను నిరసిస్తూ అటాక్ యూనివర్సిటీ విద్యార్థులు ఆమె కార్యాలయానికి చేరుకున్నారు. అహ్మదీలను ముస్లింలుగా పేర్కొన్నందుకు జన్నత్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. అనంతరం లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు జన్నత్ ప్రయత్నించగా.. ‘ నీ కొడుకు కాఫిర్(తిరస్కరించబడినవాడు- ముస్లింమేతరుడు, నాస్తికుడు అన్న ఉద్దేశంతో). అతడు ముస్లిం కాదని ఒప్పుకో. అహ్మదీలను ముస్లింలు అన్నందుకు నువ్వు క్షమాపణ చెప్పి తీరాల్సిందే’ అంటూ ఆమె మాటలకు అడ్డుపెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక విద్యార్థుల ప్రవర్తనతో తానే వెనక్కి తగ్గిన జన్నత్ చివరకు క్షమాపణ చెప్పారు. ‘ నేను ముస్లింమేతర పాకిస్తానీ, మైనార్టీల మానవ హక్కుల గురించి మాట్లాడాను. అసలు అహ్మది అనే పదం ఉపయోగించానో కూడా గుర్తులేదు. వివక్షకు తావు లేకుండా అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో అలా మాట్లాడాను. అంతర్గతంగా మనమందరం సంఘటితంగా ఉన్నపుడే బయటి శత్రువును ఎదుర్కోగలం అనేది నా ఉద్దేశం అని వివరణ ఇచ్చారు. ‘అవును పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం అహ్మదీలు ముస్లింమేతరులు. నా దృష్టిలో కూడా సరేనా. మీరన్నట్లుగా నా కొడుకు ముస్లింమేతరుడే. వాడో కాఫిర్’ అని ఉద్వేగానికి లోనయ్యారు. కాగా జన్నత్ క్షమాపణలు చెప్పినప్పటికీ విద్యార్ధులు ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ‘హిజాబ్ ధరించని ఓ మహిళ ఇస్లాం గురించి ప్రసంగాలు ఎలా చేస్తుంది. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకింగా మాట్లాడినందుకు ఖలీఫా అబుబాకర్ తన సొంత తండ్రి తలనే నరికాడు. అలాంటి మతం గురించి తలపై ముసుగు లేకుండా తిరిగే ఈ మహిళ మాట్లాడుతోంది’ అంటూ ఆమెను హేళన చేశారు. కాగా అహ్మదీలు కూడా ఇతర ముస్లింల వలె మత సంప్రదాయాలన్నింటినీ పాటిస్తారు. అయితే మెసయ్యను తమ దేవుడిగా భావిస్తూ.. ఆయన మళ్లీ తమ మతాన్ని సంస్కరించేందుకు వస్తాడని విశ్వసిస్తారు. Attock's Assistant Commissioner Jannat Hussain Nekokara is forced to call Ahmadis non-Muslims and "the worst among non-Muslims" after Islamist students call her out for making a speech calling for ending the discrimination against non-Muslims including Ahmadis in Pakistan. pic.twitter.com/HnwUyAZ3wr — SAMRI (@SAMRIReports) December 12, 2019 -
హేయమైన ఘటనల మధ్య హక్కులెలా !
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మహిళలపై పెరిగిపోతున్న నేర ఘటనలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సమానహక్కులు అన్న సార్వత్రిక లక్ష్యం సఫలతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మానవ హక్కుల దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (యూడీహెచ్‌ఆర్)ను ఆమోదించగా.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ 10వ తేదీని మానవ హక్కుల దినంగా పాటిస్తున్నారు.యూడీహెచ్‌ఆర్ రూపకల్పనలో భారత్‌కు చెందిన సంఘసంస్కర్త, విద్యావేత్త హన్సా జీవ్‌రాజ్‌మెహతా కీలకపాత్ర పోషించారని, ఆ ప్రకటనలోని ఆర్టికల్ 1 ముసాయిదాలో ‘ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఫ్రీ అండ్ ఈక్వల్’ అన్న వాక్యాన్ని హన్సా ‘ఆల్ హ్యూమన్స్...’గా మార్చడానికి కృషి చేసి విజయం సాధించారని రాష్ట్రపతి గుర్తు చేశారు. అయితే స్త్రీ, పురుష సమానత్వం, మానవ హక్కుల విషయంలో హన్సా లాంటి దార్శనికుల స్వప్నాలను సాకారం చేసేందుకు చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని రాష్ట్రపతి అన్నారు. సమాన హక్కులు, గౌరవమన్న విషయాల్లో మనల్ని మనం ప్రశ్నించుకోవడం ద్వారా ఈ దిశగా తొలి అడుగు వేయాలని సూచించారు. జాతిపిత చెప్పిందీ అదే.. దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస సంఘటనలు మనల్ని పునరాలోచనలో పడేస్తున్నాయని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని, ఇది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రపంచమంతా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆత్మశోధన చేసుకోవాలి’అని ఆయన అన్నారు. దీంతోపాటు యూడీహెచ్‌ఆర్‌ను సమీక్షించి మానవ హక్కులను పునః నిర్వచించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పిల్లలు, వెట్టిచాకిరీలో మగ్గుతున్న వారు, స్వల్ప నేరాలకు గాను దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న వారిపట్ల సానుభూతి చూపాల్సిన అవసరముందని, వీరి హక్కుల విషయంలో మరింతగా ఆలోచన చేయాల్సి ఉందని వివరించారు. మానవ హక్కుల విషయంలో ఆత్మశోధన ఎంత అవసరమో, సమాజం, తన హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడమూ అంతే అవసరమని రాష్ట్రపతి తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ సైతం మానవ హక్కులు, పౌర విధులు ఒకే నాణేనికి రెండు పార్శా్వల వంటివని చెప్పారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, భారత్‌లో ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కో ఆర్డినేటర్ రెనెటా లోక్ డెస్సాలియన్ తదితరులు పాల్గొన్నారు. -
నీ హక్కుకు రక్షణగా నేనున్నా!
-
నీ హక్కుకు రక్షణగా నేనున్నా!
పుట్టిన ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ప్రతి పౌరుడికి కనీస అవసరాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. హక్కులను హరించే హక్కు ఎవరికి ఉండదు. అయితే కొన్ని సందర్భాలలో ఆ ప్రభుత్వాలే హక్కులను కాలరాస్తుంటాయి. అటువంటి సందర్భాలలో కోర్టుకెక్కి మన హక్కులను దక్కించుకుంటున్నాం. అయితే రారాను మన హక్కులను మనకు దక్కకుండా చేస్తున్నారు. అందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో పౌరులందరికి తమ హక్కులు దక్కేలా కృషి చేస్తూ ప్రతి యేడాది డిసెంబర్ 10వ తేదీన మానవహక్కుల దినోత్సవంగా నిర్వహిస్తుంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషి, చేపడుతున్న చర్యలు తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఉత్తరాదినే ఉల్లంఘనం ఎక్కువట!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)లో నమోదవుతున్న కేసుల్లో ఉత్తరాది రాష్ట్రాలవే ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే.. ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లోనే ఈ తరహా ఘటనలు అధికంగా చోటుచేసుకుంటునాయి. ఎన్హెచ్ఆర్సీ 2016–17కు సంబంధించి నివేదికను బట్టి ఈ విషయాలు స్పష్టమవుతున్నాయి. మానవహక్కుల ఉల్లంఘన జరిగిన సందర్భంలో ఎన్హెచ్ఆర్సీ రంగంలోకి దిగుతుంది. కొన్ని సందర్భాల్లో బాధితులు నేరుగా ఫిర్యాదు చేస్తారు. మరికొన్ని సార్లు దినపత్రికలు, చానళ్లలోచూసి ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఒక్క యూపీలోనే సగం కేసులు దేశంలో మానవహక్కుల ఉల్లంఘనపై ఏటా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎన్హెచ్ఆర్సీ కేసులు నమోదు చేసి విచారణ చేపడుతుంటుంది. ఇందులో అత్య«ధి కంగా వచ్చే ఫిర్యాదులు ఉత్తరప్రదేశ్ నుంచే కావడం గమనార్హం. ఏటా దేశవ్యాప్తంగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. ఒక్క యూపీ నుంచే 30 నుంచి 40 వేల వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో ఎన్కౌంటర్లకు సంబంధించినవే వేల సంఖ్యలో ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఎన్హెచ్ఆర్సీ విడుదల చేసిన నివేదిక 2016–17 పేర్కొన్న అంశాల ప్రకారం.. 42,590 కేసుల నమోదుతో యూపీ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఒడిశా 8,750, ఢిల్లీ 6,368, హరియాణా 4,596, బిహార్ 3,765 ఉన్నాయి. 928 కేసులతో తెలంగాణ 17వ స్థానం, 1,250 కేసులతో ఏపీ 10వ స్థానంలో నిలిచింది. కాగా 2017 నుంచి ఇప్పటివరకు 5,178 ఎన్కౌంటర్లు యూపీలోనే అయినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. వీటిలో 103 మంది నేరస్తులు మరణించారు. ఇక తెలంగాణలో గత ఆరేళ్లలో 10 ఎన్కౌంటర్లు జరగ్గా.. అందులో దాదాపు 25 వరకు వ్యక్తులు మరణించారు. ఎన్హెచ్ఆర్సీ ఏం చేస్తుంది? ఒకవేళ ఎన్హెచ్ఆర్సీ విచారణలో ఎన్కౌంటర్ బూటకమని తేలితే సదరు బాధిత కుటుంబాలకు రూ.ఒక లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం అందించాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. మిగతా కేసు ల్లో వ్యక్తులు, ఇతర సంస్థలు, పరిశ్రమల ‡తప్పిదాల వల్ల మనుషుల ప్రాణాలకు నష్టం వాటిల్లితే.. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు అందజేయాలని సిఫారసు చేస్తుంది. ఉమ్మడి ఏపీలో బూటకపు ఎన్కౌంటర్లు.. 2002కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలులో జరిగిన 19 ఎన్కౌంటర్లలో 16 బూటకపువేన ని ఎన్హెచ్ఆర్సీ తేల్చిచెప్పింది. ఆయా ఘటనల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. -
పదేళ్లలోపు వారికి పది మంచి బుక్స్
50 ఏళ్లు. ఐక్యరాజ్యసమితి ‘మానవ హక్కుల దినం’ అంటూ ఒక రోజును ప్రకటించి! ఏటా డిసెంబర్ 10న ఈ ‘హ్యూమన్ రైట్స్ డే’ని జరుపుకుంటాం. కానీ ఏం మారలేదు. ఏడు దశాబ్దాలుగా మనిషి హక్కులు రెక్కలు తెగిన పక్షులు అవుతూనే ఉన్నాయి. కనీసం పిల్లల్నైనా మార్చుకుంటే.. భవిష్యత్ తరాలలో హింసకు, హక్కుల ఉల్లంఘనకు తావుండదని ప్రపంచం నమ్ముతోంది. ఆ నమ్మకంతోనే చిన్నారుల్లో సమతాభావం పాదుగొల్పేందుకు ‘అమెజాన్’ ప్రచురణల సంస్థ తన ప్రయత్నంగా ఓ పది పుస్తకాలను సూచించింది. మహాశ్వేతాదేవిలాంటి మహారచయితల పుస్తకాలు మొదలుకుని ప్రముఖులు రచించిన ఈ పది పుస్తకాలు పిల్లల్లో మానవహక్కుల పరిరక్షణ భావనకు ఉపకరిస్తాయని అమెజాన్ విశ్వసిస్తోంది. ఆ పది పుస్తకాలు.. వివరాలు. ద వై వై గర్ల్ మహాశ్వేతాదేవి రచించిన వైవై గర్ల్ పుస్తకంలోని కథంతా మొయినా అనే పశువులను కాసుకునే అమ్మాయి నేపథ్యంగా సాగుతుంది. మొయినా స్కూల్‌కి వెళ్లి చదువుకునే అవకాశం ఉండదు. పశువులను కాయడం, ఇంట్లోకి వంటచెరకు సమకూర్చడం, నీళ్లు తీసుకురావడంతోనే ఆమె తలమునకలై పోతుంటుంది. అయినా ఆమె మదినిండా అనేక ప్రశ్నలు. ఆమెను వెంటాడే ఆ ప్రశ్నలను అందరినీ అడుగుతుంటుంది. అందుకే పోస్ట్‌మాస్టర్ ఆమెను వై వై గర్ల్ అని పిలుస్తుంటాడు. అదే ఈ పుస్తకం పేరు కూడా. ఆరేళ్ల చిన్నారుల కోసం ఉద్దేశించింది ఈ పుస్తకం. వి ఆల్ ఆర్ బార్న్ ఫ్రీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రపంచ మానవహక్కుల దినోత్సవ ప్రాధాన్యతను బొమ్మల రూపంలో చెప్పే పుస్తకం ఇది. ఆరేళ్ల వయస్సు పిల్లలకోసం ఉద్దేశించిందీ పుస్తకం. ప్రముఖ చిత్రకారుడు ఆక్సెల్ షెఫ్లర్ సహా పీటర్ సిస్, కిట్మురా, అలెన్ లీ, పాలీ డన్బర్, జాకీ మారిస్, డేబీ గ్లియోరీ, క్రిస్ రిడిల్, క్యాథరిన్, లారెన్స్ అన్హాల్ట్ లాంటి వారు వేసిన చిత్రాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇయర్ ఆఫ్ ద వీడ్స్ సిద్ధార్థ శర్మ రాసిన ఈ పుస్తకం తొమ్మిదేళ్ల వయస్సు పిల్లలకు ఉద్దేశించినది. ఒరిస్సాలోని గోండు తెగకు చెందిన ఆదివాసీ చిన్నారి మైనింగ్ మాఫియా నుంచి తన గ్రామాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నది కథ సారాంశం. గనుల తవ్వకాల కోసం గ్రామాన్ని ఖాళీ చేయించాలన్న కంపెనీని ఎదిరించిన కోరక్ ఇందులో హీరో. ఎవ్రీ హ్యూమన్ హాస్ రైట్స్ ఈ పుస్తకం ఫొటోగ్రాఫ్‌ల ద్వారా మానవహక్కులను వివరిస్తుంది. దీనికి మేరీ రాబిన్సన్ ముందుమాట రాశారు. 1948 ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటన సందర్భంగా చెప్పిన జీవించే హక్కు, ఆరోగ్య హక్కు, విద్యా హక్కు లాంటి మొత్తం 30 హక్కులను గురించి వివరిస్తుంది. రైట్ టు లెర్న్ అతి చిన్న వయస్సులోనే నోబెల్ బహుమతిని అందుకునే అరుదైన అవకాశం మలాలాకి దక్కింది. విద్యాహక్కు కోసం ప్రాణాలకు తెగించి తాలిబన్లతో పోరాడిన మలాలా యూసఫ్ఝా పై రెబెక్కా లాంగ్స్టన్ జార్జ్ ఈ పుస్తకం రాశారు. పంచో రాబిట్ అండ్ కోయోట్ బతుకుదెరువుకోసం ఉన్న ఊరునీ, కుటుంబాలనూ వదిలివెళ్లాల్సి రావడం ఎంత బాధాకరమో బొమ్మల ద్వారా వివరించే పుస్తకం ఇది. కథంతా పంచో అనే కుందేలు చుట్టూ సాగుతుంది. కార్పెట్ బాయ్స్ గిఫ్ట్ తన చదువుకోసం, కార్పెట్ ఫ్యాక్టరీలో పనిచేసే తన తోటి పిల్లల విద్యాహక్కు కోసం నదీం అనే పాకిస్తానీ పిల్లవాడు చేసే పోరాటమే ఈ పుస్తకం. సెపరేట్ ఈజ్ నెవర్ ఈక్వల్ ఎనిమిదేళ్ల మెక్సికన్ చిన్నారి సెల్వియా మెండెజ్ ని శ్వేతజాతీయుల పాఠశాలలో నిరాకరించడం గురించి రాసింది. బ్రేవ్ గర్ల్ అమెరికాలో మహిళా కార్మికుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా 1990లో జరిగిన శ్రామిక మహిళల పోరాటానికి నాయకత్వం వహించిన క్లారా లెమ్చిన్ కథ ఇది. ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన క్లారా లెమ్లిచ్ కథ బ్రేవ్ గర్ల్. ఇది కూడా బొమ్మల రూపంలోనే ఉంటుంది. యాస్మిన్స్ హ్యూమర్ కుటుంబ పోషణ కోసం ఇటుక బట్టీల్లో పనిచేసే బాలకార్మికురాలి కథ ఇది. చదువుకోవాలన్న తన కలను నెరవేర్చుకోవడం కోసం రహస్య ప్రణాళిక వేసే యాస్మిన్ పై సాగే ఈ కథ విద్య ప్రాధాన్యతను వివరిస్తుంది. – అత్తలూరి అరుణ, సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
'చావుకు చదువు కారణం కారాదు'
ఆత్మహత్యలకు చదువు కారణం కాకూడదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. గురువారం మెదక్ జిల్లా సిద్దిపేటలో మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సీసీసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 'బాల ప్రతిభ మేళ-2015' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చదువు లక్ష్యంగా ఆత్మహత్యలు జరగడం బాధకరమని చెప్పారు. చావుకు ఆత్మహత్యలే పరిష్కారం కాదన్నారు. విద్యార్థులు అర్ధంతరంగా చదువును మానేసే కారణాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. అంతకు ముందు జాతీయ ఆహార భద్రత సలహదారురాలు ప్రొఫెసర్ రమా మెల్కొటే మాట్లాడుతూ.. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.